MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • International
  • Ali Khamenei: నడి రోడ్డుపై 16 ఏళ్ల యువతి ఉరితీత.. ఖమేనీ మరణం ఆ కర్మ ఫలితమేనా.?

Ali Khamenei: నడి రోడ్డుపై 16 ఏళ్ల యువతి ఉరితీత.. ఖమేనీ మరణం ఆ కర్మ ఫలితమేనా.?

Ali Khamenei: అమెరికా- ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోవ‌డం ఇప్పుడు కొత్త చ‌ర్చ‌కు తెర తీసింది. ఈ చ‌ర్య‌తో ఇరాన్ ఎలా స్పందిస్తుంది.? ఇది ఎలాంటి ప‌రిణామాల‌కు దారి తీస్తుంద‌న్న అంశం ఆస‌క్తిగా మారింది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Mar 01 2026, 10:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఖ‌మేనీ మ‌ర‌ణంతో మ‌ళ్లీ చ‌ర్చ‌లోకి 16 ఏళ్ల యువ‌తి ఘ‌ట‌న
Image Credit : Sunil Mishra/X, Getty

ఖ‌మేనీ మ‌ర‌ణంతో మ‌ళ్లీ చ‌ర్చ‌లోకి 16 ఏళ్ల యువ‌తి ఘ‌ట‌న

మధ్యప్రాచ్యంలో కీలక దేశమైన ఇరాన్‌లో ఇటీవల రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సుదీర్ఘకాలం దేశాన్ని ప్రభావితం చేసిన అలీ ఖ‌మేనీ నాయకత్వం ముగిసిన నేపథ్యంలో భవిష్యత్తుపై అనిశ్చితి పెరిగింది. ఇదే సమయంలో ఇరాన్ గతంలో చేసిన కొన్ని వివాదాస్పద చర్యలు ఇప్పుడు మళ్లీ చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా 16 ఏళ్ల ఒక యువతిని బహిరంగంగా ఉరితీసిన ఘటనను గుర్తు చేస్తూ, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను కొందరు "కర్మ ఫలితం"గా అభివర్ణిస్తున్నారు.

25
ఖమేనీ తర్వాత ఇరాన్ పరిస్థితి
Image Credit : Sunil Mishra/X

ఖమేనీ తర్వాత ఇరాన్ పరిస్థితి

ఖ‌మేనీ మ‌ర‌ణం త‌ర్వా ఇరాన్ ప‌రిస్థితిపై ప‌లువురు ప‌లు ర‌కాలుగా అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇది దేశంలో అస్థిరతకు దారి తీస్తుంద‌ని కొంద‌రు అంటుంటే మ‌రికొంత మంది మాత్రం దేశంలో కొత్త రాజ‌కీయ మార్పుల‌కు ఇది ప్రారంభ‌మ‌ని అంటున్నారు. ఇదే సమయంలో పాత సంఘటనలను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో వివిధ చర్చలు జరుగుతున్నాయి.

Related Articles

Related image1
వచ్చే నెల రోజులు చాలా ప్రమాదకరం. ప్రతీ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. ముఖ్యంగా ఈ రాశుల వారు
Related image2
Iran Israel War: ఇరాన్ సుప్రీం లీడ‌ర్ ఖ‌మేనీ చనిపోయాడు.. ట్రంప్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న, ఇరాన్ మీడియా సైతం
35
16 ఏళ్ల యువతి ఘటన మళ్లీ చర్చలోకి
Image Credit : Social Media

16 ఏళ్ల యువతి ఘటన మళ్లీ చర్చలోకి

ఇరాన్‌లో 2004లో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. అతీఫ్ రజబి సహాలే అనే 16 ఏళ్ల యువతిని బహిరంగంగా ఉరితీసిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారితీసింది. తల్లిదండ్రులు లేని ఆ యువతిపై జరిగిన అన్యాయం తరువాత ఆమెనే నిందితురాలిగా చూపించడం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఆ సమయంలో మానవ హక్కుల సంస్థలు కూడా తీవ్రంగా స్పందించాయి.

45
అస‌లేం జ‌రిగిందంటే?
Image Credit : X

అస‌లేం జ‌రిగిందంటే?

తల్లి, తండ్రిలేని అతీఫ్ ర‌జ‌బి స‌హాలేపై ఓ వ్య‌క్తి అత్యాచారం చేశాడు. దీనిని ఇరాన్ చ‌ట్టం ప్ర‌కారం నేరంగా ప‌రిగ‌ణించారు. క‌న్య‌త్వాన్ని కోల్పోవ‌డ‌మే ఆమె చేసిన త‌ప్పంటూ నేర‌స్తురాలిగా తీర్మానించింది. ఆమెపై నైతిక నేరాల ఆరోపణలు మోపారు. అయితే త‌న‌కు అన్యాయం జ‌రిగింద‌ని పోలీసుల వ‌ద్ద‌కు వెళితే.. త‌న‌దే త‌ప్ప‌ని కోర్టు చెప్ప‌డం ఆమెలో కోపాన్ని పెంచింది. దీంతో కోర్టు హాల్లోనే హిజాబ్ తొలగించి త‌న నిర‌స‌న‌ను తెలిపింది. దీన్ని కోర్టు తీవ్ర‌మైన నేరంగా ప‌రిగ‌ణించి ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. క‌ట్ట‌లు తెంచుకున్న కోపంతో యువ‌తి జ‌డ్జిపైకి చెప్పును విసిరింది. దీంతో యావ‌జ్జీవ కారాగార శిక్ష‌ను ఉరిశిక్ష‌గా మార్చేశారు. ఆమెను బ‌హిరంగంగా ఉరితీశారు.

लोग कहते हैं इसी लड़की का श्राप ईरान को लगा है क्योंकि इस लड़की के फांसी के बाद से ईरान में कभी शांति नहीं रही

सबसे क्रूर सजा दिए जाने का जो मामला दुनिया के सामने आया था, वो ईरान की 16 वर्षीय मासूम लड़की अतीफेह रजबी सहलीह का मामला है...

जिसके अंदर तनिक भी मानवता जीवित है, कहानी… pic.twitter.com/RR6jbVAZYK

— Sunil Mishra ♛ (@MrMishra) June 17, 2025

55
అంతర్జాతీయ విమర్శలు
Image Credit : Social Media

అంతర్జాతీయ విమర్శలు

ఆ యువతి వయసు విషయంలో కూడా వివాదం నెలకొంది. నిజానికి ఆమె 18 ఏళ్లు నిండకపోయినా, అధికారిక రికార్డుల్లో వయసు ఎక్కువగా చూపించారని ఆరోపణలు వచ్చాయి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం చిన్నారులకు ఉరిశిక్ష విధించడం తప్పు. అయినప్పటికీ ఆ శిక్ష అమలు చేయడం ప్రపంచ దేశాలను షాక్‌కు గురిచేసింది. ఈ సంఘటన తర్వాత ఇరాన్ మానవ హక్కుల పరిస్థితులపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

“కర్మ ఫలితం” అంటూ చర్చ

ప్రస్తుతం ఇరాన్‌లో జరుగుతున్న పరిణామాలను ఆ యువతి ఘటనతో అనుసంధానం చేస్తూ సోషల్ మీడియాలో అనేక పోస్టులు వైరల్ అవుతున్నాయి. గతంలో మహిళలపై జరిగిన అన్యాయాల వల్లే ఇప్పుడు ఇరాన్ కష్టాలు ఎదుర్కొంటోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మహిళల స్వేచ్ఛపై కఠిన నియంత్రణలు, మోరాలిటీ పోలీసుల చర్యలు, నిరసనల అణచివేత వంటి అంశాలు తరచూ విమర్శలకు గురవుతున్నాయి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ప్రపంచం
యుద్ధం

Latest Videos
Recommended Stories
Recommended image1
Flour Price: కిలో గోధుమ‌ పిండి ధ‌ర రూ. 200... చుక్క‌లు చూపిస్తోన్న ద్ర‌వ్యోల్బణం
Recommended image2
Iran Israel War: ఇరాన్ సుప్రీం లీడ‌ర్ ఖ‌మేనీ చనిపోయాడు.. ట్రంప్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న, ఇరాన్ మీడియా సైతం
Recommended image3
Baba Vanga : వణికిస్తున్న బాబా వంగా జోస్యం.. మరో ప్రపంచ యుద్ధం !
Related Stories
Recommended image1
వచ్చే నెల రోజులు చాలా ప్రమాదకరం. ప్రతీ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. ముఖ్యంగా ఈ రాశుల వారు
Recommended image2
Iran Israel War: ఇరాన్ సుప్రీం లీడ‌ర్ ఖ‌మేనీ చనిపోయాడు.. ట్రంప్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న, ఇరాన్ మీడియా సైతం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved