Zodiac sign: ఈ రాశి వారికి వచ్చే వారం పరీక్షా సమయం.. చాలా ఓపికతో ఉండాలి. లేదంటే..
Zodiac sign: జనవరి మూడో వారం ఓ రాశి వారికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని జ్యోతిషం చెబుతోంది. ఆదివారం అమావాస్య కారణంగా కుంభ రాశి వారికి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని అంటున్నారు.

కుంభ రాశి వారికి కష్టకాలం
జనవరి మూడో వారం కుంభ రాశివారికి కొంత కష్టంగా ఉండొచ్చు. సాధారణ పనులకే ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. ఆరంభంలో ఎదురైన సమస్యలు మనసును కొంత అసహనానికి గురిచేస్తాయి. అయితే సహనం పాటిస్తే చివరికి పరిస్థితులు అదుపులోకి వస్తాయి.
ఉద్యోగం, వ్యాపారం పరిస్థితి
ఈ వారం ఉద్యోగ రంగంలో ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. పని ఆలస్యం కావచ్చు. అధికారుల నుంచి ఆశించిన సహకారం తక్కువగా ఉండొచ్చు. వ్యాపార రంగంలో కూడా నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్త అవసరం. తొందరపాటు నిర్ణయాలు సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది.
ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ
ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అకస్మాత్తుగా పెద్ద ఖర్చులు రావడంతో బడ్జెట్ తారుమారు కావచ్చు. ప్రభుత్వ సంబంధిత పనులు ఆశించిన విధంగా పూర్తి కాకపోవడం వల్ల అసంతృప్తి కలగొచ్చు. ఈ వారం డబ్బు విషయంలో నియంత్రణ చాలా అవసరం.
కుటుంబం, ప్రేమ జీవితం
వ్యక్తిగత సంబంధాల్లో జాగ్రత్త అవసరం. వారం ప్రారంభంలో తండ్రితో మాటల తేడాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో శాంతి నిలబెట్టాలంటే మాటల్లో వినయం అవసరం. ప్రేమ జీవితం విషయంలో అతిగా ప్రవర్తించకుండా హద్దుల్లో ఉండడం మంచిది.
ఆరోగ్యం, పరిహారం
ఈ వారం ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయకూడదు. పాత వ్యాధులు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఆహారం, నిద్ర సమయంపై శ్రద్ధ పెట్టాలి.
పరిహారం: శివుడికి బిల్వ పత్రాలు సమర్పించి రుద్రాష్టకం పఠించడం మంచిది.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం ఆస్ట్రాలజీ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించడమైంది. దీనిని ఖచ్చితమైన సూచనగా భావించరాదు. అలాగే ఇందులో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.

