- Home
- International
- Nimisha Priya : యెమెన్ పౌరుడి మరణం నుండి నిమిష మరణశిక్ష వాయిదా వరకు... ఏం జరిగింది? టైమ్ టు టైమ్ వివరాలివే
Nimisha Priya : యెమెన్ పౌరుడి మరణం నుండి నిమిష మరణశిక్ష వాయిదా వరకు... ఏం జరిగింది? టైమ్ టు టైమ్ వివరాలివే
నిమిష ప్రియ మరణశిక్ష వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో యెమెన్ పౌరుడు తలాల్ మరణం నుండి ఈమె మరణశిక్ష వాయిదా వరకు జరిగిన పరిణామాలేమిటో ఇక్కడ తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us

నిమిష ప్రియ మరణశిక్ష వాయిదా
Nimisha Priya : అరబ్ దేశాల్లో శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో ఇండియన్ మహిళ నిమిష ప్రియ వ్యవహారం ద్వారా బైటపడుతున్నాయి. ఓ హత్యకేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిషను దోషిగా తేల్చాయి యెమెన్ న్యాయస్థానాలు... దీంతో ఆమెకు మరణశిక్ష విధించాయి. మరికొద్దిగంటల్లో ఆమెకు మరణశిక్ష అమలుచేస్తారనగా ఈ ప్రక్రియను నిలిపివేసారు. ఈ క్రమంలో నిమిష ప్రియ వ్యవహారంలో 2017 నుండి ఇప్పటివరకు ఏం జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం.
ఈ మతగురువు చర్చల పలితంగానే నిమిష మరణశిక్ష ఆగిందా?
యెమెన్‌లో మరణశిక్ష విధించబడి జైలులో ఉన్న మలయాళీ నర్సు నిమిష ప్రియ విడుదలపై చర్చలు కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా కేరళకు చెందిన ముస్లిం మతపెద్ద కాంతపురం ఎ.పి. అబూబకర్ ముస్లియార్ ద్వారా జరిగిన చర్చలు నిమిషా ప్రియ మరణశిక్ష వాయిదా వేయడానికి దారితీశాయి.
అయితే నిమిష చేతిలో హత్యకు గురయినట్లు చెబుతున్నతలాల్ సోదరుడు మాత్రం ఈమెను క్షమించబోమని.. రాజీకి సిద్ధంగా లేమని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. మరణశిక్షను రద్దుకు తలాల్ కుటుంబం అంగీకరించడంలేదు.. కాబట్టి మరిన్ని చర్చలు అవసరమని మధ్యవర్తి బృందం తెలిపింది. ఇంకా చర్చలు కొనసాగవచ్చని మధ్యవర్తి బృందం ప్రతినిధులు తెలిపారు.
నిమిష ప్రియకు శిక్ష వాయిదా పడటంతో కేంద్రం మళ్ళీ జోక్యం చేసుకుంటోంది. కానీ ఈ విషయంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎలాంటి ప్రకటన చేయలేదు. యెమెన్‌లో శాంతిభద్రతలకు భంగం కలగకుండా చూసుకోవాలని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉండగా నిమిష ప్రియ మరణశిక్ష వాయిదాపై మరికొందరు స్పందిస్తున్నారు. తలాల్ సోదరుడితో మాట్లాడినట్లు సౌదీ అరేబియాలోని ఓ మలయాళీ వ్యాపారవేత్త చెప్పారు. నిమిష విడుదల, మరణశిక్ష వాయిదాపై సోషల్ మీడియాలో కూడా తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.
నిమిష ప్రియ వ్యవహారంలో ఇప్పటివరకు జరిగిన పరిణామాలివే :
2017 జులై 25న యెమెన్‌లో నర్సుగా పనిచేస్తున్న నిమిష ప్రియ సొంతంగా క్లినిక్ ప్రారంభించడానికి సహాయం చేసిన యెమెన్ పౌరుడు తలాల్ అబ్దుల్ మహదిని హత్యకు గురయ్యాడు. అయితే తన పాస్‌పోర్ట్ తీసుకొని అతడు వేధించాడని, అందువల్లే అతన్ని చంపినట్లు నిమిష ప్రియ చెబుతున్నట్లు యెమెన్ న్యాయస్థానం పేర్కొంది.
నేరం అంగీకరించడంతో నిమిషకు 2018లో మరణశిక్ష విధించారు. ఆమె న్యాయపోరాటం చేసినా పలితంలేదు...మరణశిక్ష రద్దు చేయాలన్న అప్పీలును 2022లో న్యాయస్థానం తిరస్కరించింది.
2024లో యెమెన్ సుప్రీంకోర్టు మరణశిక్షను సమర్థించింది. దీంతో న్యాయపరంగా అన్నిదారులు మూసుకుపోయాయి. దీంతో హత్యకు గురయిన తలాల్ కుటుంబం క్షమించడమే మార్గంగా మిగిలింది. అయితే తలాల్ కుటుంబం నిమిషను క్షమించేందుకు అంగీకరించకపోవడంతో చర్చలు ముందుకు సాగలేదు.
2024 ఏప్రిల్‌లో యెమెన్‌కు వెళ్లిన నిమిష ప్రియ తల్లి ప్రేమకుమారికి ఆమెను కలవడానికి అనుమతి లభించింది.
2024 డిసెంబర్ చివర్లో యెమెన్ అధ్యక్షుడు నిమిష ప్రియ మరణశిక్షకు ఆమోదం తెలిపారు.
సామాజిక కార్యకర్త సామ్యూల్ జెరోమ్‌తో కలిసి నిమిష ప్రియ తల్లి యెమెన్‌లో విడుదల ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే అధ్యక్షుడు మరణశిక్షకు ఆమోదం తెలిపారు.
సుప్రీం కోర్టులో నిమిష ప్రియ వ్యవహారం
నిమిష ప్రియ విషయంలో మానవతా దృక్పథంతో జోక్యం చేసుకుంటామని ఇరాన్ తెలిపింది. ఇరాన్ విదేశాంగ సహాయ మంత్రి భారత్ పర్యటన సందర్భంగా ఈ విషయం తెలిపారు.
అయితే జులై 16న నిమిష ప్రియ మరణశిక్ష అమలు చేయాలని యెమెన్ జైలు అధికారులు నిర్ణయించారు.
నిమిష ప్రియ మరణశిక్షను నిలిపివేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు జులై 9న కేంద్రం తెలిపింది. అత్యవసర జోక్యం కోరుతూ ఎంపీ కె. రాధాకృష్ణన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
యెమెన్ పౌరుడి కుటుంబం దియా ధనం తీసుకోకపోవడం సమస్యగా మారింది. మరణశిక్షను నిలిపివేయడానికి కృషి చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది.
జులై 10న సేవ్ నిమిష ప్రియ యాక్షన్ కౌన్సిల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
కేరళ ప్రతిపక్ష నేత వి.డి. సతీశన్ రాష్ట్రపతికి, జోస్ కె. మాణి ప్రధానికి నిమిష ప్రియను కాపాడాలని లేఖ రాశారు. ఆమె విడుదలకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు గవర్నర్ చెప్పారు.
యెమెన్ కుటుంబం దియా ధనం అడగలేదు, అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు నిమిష ప్రియ భర్త టామీ థామస్ చెప్పారు.
కాంతపురం ఎ.పి. అబూబకర్ ముస్లియార్ కీలక జోక్యం చేసుకున్నారు. యెమెన్ మత పెద్దలు, తలాల్ సోదరుడితో ఆయన చర్చలు జరిపారు. ఉత్తర యెమెన్‌లో అత్యవసర సమావేశం జరిగింది. తలాల్ సోదరుడు కూడా సమావేశంలో పాల్గొన్నారు.
నిమిష మరణశిక్షను నిలిపివేయడానికి సాధ్యమైనంతవరకు ప్రయత్నిస్తున్నట్లు కేంద్రం తెలిపింది.
వాటికన్ జోక్యం కోరుతూ సేవ్ నిమిషా ప్రియ గ్లోబల్ యాక్షన్ కౌన్సిల్ వైస్ ఛైర్‌పర్సన్ దీప జోసెఫ్ భారతదేశంలోని వాటికన్ రాయబారికి వినతిపత్రం సమర్పించారు.
దియా ధనం తీసుకొని క్షమించాలనే ప్రతిపాదనపై యెమెన్ కుటుంబం స్పందించలేదు. చర్చలు కొనసాగుతాయని ప్రతినిధి బృందం తెలిపింది.
మరణశిక్షను నిలిపివేయడానికి చివరి దశ చర్చలు జరుగుతున్నాయి. పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని కేంద్రం తెలిపింది.
చివరకు నిమిష మరణశిక్ష వాయిదా
కాంతపురం చర్చలు అనుకూలంగా సాగుతున్నాయని ఆయన కార్యాలయం తెలిపింది.
గవర్నర్ జోక్యం చేసుకున్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఎం.ఎ. యూసుఫాలీతో ఆయన మాట్లాడారు.మరణశిక్ష అమలుకు ఒక్క రోజు ముందు నిమిష ప్రియ శిక్ష వాయిదా పడింది. దీన్ని కేంద్రం ధృవీకరించింది.
కాంతపురం జోక్యానికి పూర్తి మద్దతు ఉందని అనిల్ ఆంటోనీ, కేంద్రం దౌత్యపరంగా జోక్యం చేసుకుంటుందని చెప్పారు.నిమిష ప్రియ శిక్ష వాయిదాలో ప్రభుత్వం జోక్యం చేసుకుందని, మానవతా దృక్పథం అవలంబించిందని ఎం.వి. గోవిందన్ చెప్పారు.
అధికారిక తీర్పు కాపీని విడుదల చేసి వివరాలు వెల్లడించారు కాంతపురం. మానవతా దృక్పథంతో జోక్యం చేసుకున్నట్లు కాంతపురం చెప్పారు.
కాంతపురం తన సుదీర్ఘకాల స్నేహితుడు, యెమెన్ సూఫీ ఇస్లామిక్ పండితుడు షేక్ హబీబ్ ఉమర్ బిన్ హాఫిజ్ ద్వారా చేసిన జోక్యం కొత్త ఆశను కలిగిస్తోందని శశి థరూర్ అన్నారు.
నిమిష మరణశిక్ష వాయిదాకు కారణం సమిష్టి ప్రయత్నమని, ఇంకా శుభవార్తలు వస్తాయని గవర్నర్ చెప్పారు.
నిమిష ప్రియ శిక్ష వాయిదాకు కాంతపురం చొరవ, జోక్యమే కారణమని ముఖ్యమంత్రి అన్నారు.
యెమెన్ నుంచి ఆశాజనక వార్తలు వచ్చాయని, కేంద్రం జోక్యం కొనసాగుతుందని రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు.
చర్చలు కొనసాగుతాయి. జోక్యం చేసుకున్నట్లు మరికొందరు చెబుతున్నారు.
యెమెన్‌లో శాంతిభద్రతలకు భంగం కలుగుతుందని, అందుకే ప్రకటన చేయలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ తీర్పు కాపీ అసలైనదేనని, సనా కోర్టు ఉత్తర్వులేనని కాంతపురం కార్యాలయం తెలిపింది.
నిమిష ప్రియకు క్షమించబోమని, రాజీకి సిద్ధంగా లేమని తలాల్ సోదరుడు చెబుతున్నారు. అయితే వారితో చర్చలు కొనసాగనున్నాయి.