Israel iran: ఇజ్రాయెల్‌తో మాములుగా ఉండదు మరి.. అత్యంత ప్రమాదకరమైన డ్రోన్స్
ఇజ్రాయెల్, ఇరాన్ మళ్లీ ప్రత్యక్షంగా యుద్ధరంగంలో తలపడ్డాయి. ఈ దాడులు గతంలో ఎన్నడూ లేని విధంగా సాగుతున్నాయి. రెండు దేశాలు భారీగా పరస్పర దాడులకు దిగడంతో మధ్యప్రాచ్య పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

ఒకేసారి 200 విమానాల ప్రయోగం
ఇజ్రాయెల్ ఒకే దెబ్బకు సుమారు 200 యుద్ధ విమానాలను ప్రయోగించి, ఇరాన్‌లోని కీలక అణు కేంద్రాలు, సైనిక స్థావరాలు, అణు శాస్త్రవేత్తలు, సైనిక ఉన్నతాధికారులను లక్ష్యంగా చేసుకుంది. దీనిని అత్యంత సమన్వయంతో చేసిన బహుళ దాడిగా చెబుబుతున్నారు.
ఈ దాడికి ప్రతీకారంగా, ఇరాన్ దాదాపు డజన్ల కొద్ది బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించి, ఇజ్రాయెల్ పై విరుచుకుపడింది. వీటిలో కొన్ని ఇజ్రాయెల్ ఐరన్ డోమ్, ఇతర వాయు రక్షణ వ్యవస్థలను తప్పించుకుని లక్ష్యాలను తాకినట్టు సమాచారం.
చమురు నిల్వలే టార్గెట్
ఇరాన్ దాడికి వెంటనే స్పందనగా, ఇజ్రాయెల్ టెహ్రాన్‌లోని చమురు నిల్వ కేంద్రాన్ని టార్గెట్ చేసింది. ఈ దాడి అనంతరం ఆ ప్రాంతంలో పొగలు, మంటలు ఎగసిపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇజ్రాయెల్‌కు అత్యంత ప్రమాదకరమైన డ్రోన్లు
ఈ ఘర్షణల నేపథ్యంలో, ఇజ్రాయెల్ వినియోగిస్తున్న ఆధునిక, అత్యంత శక్తివంతమైన డ్రోన్ల గురించి తెలుసుకోవాలి.
హెరాన్ TP – దీర్ఘ శ్రేణి మల్టీరోల్ డ్రోన్
ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (IAI) అభివృద్ధి చేసిన హెరాన్ TP డ్రోన్, ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన UAVలలో ఒకటి. ఇది 30 గంటలకుపైగా గాలిలో ఉండగలదు, నిఘా, లక్ష్యాల గుర్తింపు, క్షిపణి దాడులు వంటి మల్టీ రోల్ సామర్థ్యాలు కలిగివుంది. ఇది ఏ వాతావరణంలోనైనా పనిచేయగలదు. వైమానిక దళం, నేవీ, ఆర్మీ ఇలా మూడింటికీ ఇది సేవలు అందిస్తుంది.
హెరోప్ డ్రోన్ – స్వయంగా బాంబుగా మారే డ్రోన్
ఇజ్రాయెల్ మరో కీలక ఆయుధం హెరోప్ (Harop) డ్రోన్. ఇది ‘సూసైడ్ డ్రోన్’గా ప్రసిద్ధి. లక్ష్యాన్ని గుర్తించిన తర్వాత స్వయంగా దానిపై ఢీకొని పేలుతుంది. ఇది ఎలక్ట్రానిక్ సిగ్నల్‌లను ట్రాక్ చేస్తూ శత్రు రాడార్ లేదా క్షిపణి వ్యవస్థలను ధ్వంసం చేస్తుంది. భారతదేశం కూడా ఈ డ్రోన్లను వినియోగిస్తోంది.
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల ముప్పు
ఇరాన్-ఇజ్రాయెల్ పరస్పర దాడులతో ఉగ్రవాదం, ఆయుధాల చోదక శక్తిగా ఉన్న ప్రాంతాల్లో మరింత అస్థిరత ఏర్పడే అవకాశం ఉంది. యుద్ధం ఆగకపోతే, దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలపై కూడా పడే ప్రమాదం ఉంది.