- Home
- International
- Cyclospora parasite: వ్యాక్సిన్ లేదు.. సైక్లోస్పోరా వణికిస్తోంది.. మరో కరోనా లాంటి ముప్పేనా?
Cyclospora parasite: వ్యాక్సిన్ లేదు.. సైక్లోస్పోరా వణికిస్తోంది.. మరో కరోనా లాంటి ముప్పేనా?
Cyclospora parasite: అమెరికాను సైక్లోస్పోరా అనే పారాసైట్ వణికిస్తోంది. మనం తినే ఫారిన్ బెర్రీలు, ఇంపోర్టెడ్ సలాడ్ ఆకుల ద్వారా ఇది ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వొచ్చు. అసలు ఈ సైక్లోస్పోరా కథేంది? ఇది మరో కరోనా వైరస్ లాంటి ముప్పు అవుతుందా?

సైక్లోస్పోరా అంటే ఏంటి? ఎలా స్ప్రెడ్ అవుతుంది?
సైక్లోస్పోరా అనేది ఒక సింగిల్ సెల్ పరాన్నజీవి. ఇది మనుషుల మలం ద్వారా ఎన్విరాన్‌మెంట్‌లోకి వస్తుంది. ఎవరైనా ఇన్ఫెక్ట్ అయిన వ్యక్తి మలం ఓపెన్ ల్యాండ్స్‌లో చేరినప్పుడు.. లేదా ఆ కలుషిత నీటిని, ఎరువులను పంటలకు వాడినప్పుడు ఇది కూరగాయలు, పండ్లపైకి ఈజీగా షిఫ్ట్ అయిపోతుంది.
ఇది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి డైరెక్ట్‌గా అంత ఈజీగా స్ప్రెడ్ అవ్వదు. కేవలం కలుషితమైన ఫుడ్, వాటర్ తీసుకుంటేనే బాడీలోకి వెళ్తుందని యూఎస్ హెల్త్ బాడీ ఎఫ్డీఏ తెలిపింది.
అమెరికా పై సైక్లోస్పోరా దెబ్బ.. ఇండియాకు రిస్క్ ఉందా?
ఈ ఏడాది ప్రారంభం నుంచి అమెరికాలో ఈ సైక్లోస్పోరా వ్యాప్తి వేగంగా పెరుగుతూ వచ్చింది. అక్కడ 30కి పైగా స్టేట్స్‌లో దాదాపు 1,500 నుండి 2,900 కి పైగా కేసులు రికార్డయ్యాయి. ముఖ్యంగా మిచిగన్ స్టేట్‌లో ఏకంగా 2,640 కేసులు నమోదయ్యాయి. యూఎస్ జనాభా లెక్కన చూస్తే ఇది చాలా పెద్ద నెంబర్. సాధారణంగా ఏడాదికి 40-50 కేసులు వచ్చే చోట ఇప్పుడు వందల్లో, వేలల్లో రావడం కలకలం రేపుతోంది. అక్కడ హోటళ్లు, సూపర్ మార్కెట్లలో అమ్మే కొత్తిమీర, రాస్ప్‌బెర్రీలు, ముందే కడిగి ప్యాక్ చేసిన సలాడ్ ఆకుల ద్వారానే ఇది జనాలకు సోకినట్లు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
ఇక ఇండియా విషయానికి వస్తే.. ప్రస్తుతానికి ఇక్కడ అలాంటి కేసులు లేవు. కానీ ఎండాకాలంలో అప్పుడప్పుడూ కేసులు బయటపడుతుంటాయి. మన దేశం నుంచి యూరప్, అమెరికాలకు భారీగా కూరగాయలు ఎగుమతి, దిగుమతి అవుతుంటాయి. హైదరాబాద్, బెంగళూరు లాంటి మెట్రో సిటీస్ సూపర్ మార్కెట్లలో దొరికే కాస్ట్లీ ఇంపోర్టెడ్ హెర్బ్స్, బెర్రీస్ వల్ల మనకూ రిస్క్ పొంచి ఉంది. లోకల్‌గా ఉండే కలుషిత నీరు, ఆర్గానిక్ పేరిట వాడే కొన్ని రకాల అన్‌ట్రీటెడ్ ఎరువుల వల్ల కూడా ఇది మన దగ్గర స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
సైక్లోస్పోరా దెబ్బ.. సింప్టమ్స్ ఎలా ఉంటాయి? బాడీలో ఏం జరుగుతుంది?
ఈ ఇన్ఫెక్షన్ ఉన్న ఫుడ్ తిన్న తర్వాత 2 నుండి 14 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి.
• వాటరీ డీహైడ్రేషన్: రోజుకు చాలా సార్లు నీళ్ల విరేచనాలు వుంటాయి.
• కడుపు నొప్పి, తీవ్రమైన క్రాంప్స్ ఉంటాయి.
• వాంతులు, వికారం, తీవ్రమైన అలసటగా ఉంటుంది.
• ఆకలి చచ్చిపోవడం, సడన్‌గా బరువు తగ్గిపోవడం.
• కొంతమందికి లైట్ జ్వరం, బాడీ పెయిన్స్ కూడా ఉంటాయి.
ఈ సింప్టమ్స్ కొన్ని వారాల నుంచి నెలల దాకా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్లు, చిన్నారులు, ముసలివాళ్లు, హెచ్ఐవి పేషెంట్లకు ఇది చాలా డేంజర్. అమెరికాలో వందల మంది దీనివల్ల హాస్పిటలైజ్ అయ్యారు కానీ, అదృష్టవశాత్తూ మరణాలు లేవు. బయట రోడ్ సైడ్ టిఫిన్లు, సలాడ్స్ ఎక్కువగా తినే అలవాటు ఉంటే మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
వ్యాక్సిన్ ఉందా? ట్రీట్‌మెంట్ ఏంటి?
ప్రస్తుతానికి ఈ సైక్లోస్పోరా పరాన్నజీవికి ఎలాంటి వ్యాక్సిన్ లేదు. కాబట్టి ప్రివెన్షన్ ఒక్కటే మనకున్న బెస్ట్ ఆప్షన్. ఒకవేళ ఇన్ఫెక్షన్ సోకితే మాత్రం ట్రిమెథోప్రిమ్ సల్ఫామెథాక్సాజోల్ అనే యాంటీబయాటిక్ కాంబినేషన్‌తో డాక్టర్లు ట్రీట్‌మెంట్ ఇస్తారు. సల్ఫా మందు ఎలర్జీ ఉన్నవారికి ప్రత్యామ్నాయ మందులు ఇస్తారు.
ఈ జాగ్రత్తలు తీసుకోండి
వ్యాధి వచ్చాక బాధపడటం కంటే రాకుండా చూసుకోవడమే మంచిది. దీని కోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. అవి..
1. ఉప్పు నీటితో కడగండి: కూరగాయలను కేవలం నార్మల్ వాటర్‌తో కాకుండా, ఉప్పు నీరు లేదా వెనిగర్ కలిపిన వాటర్‌తో క్లీన్ చేయాలి. ప్యాకెట్లపై ‘ప్రీ-వాష్డ్’ అని రాసి ఉన్నా సరే మళ్లీ కడగడమే సేఫ్.
2. లోకల్ ప్రొడ్యూస్ బెస్ట్: సాధ్యమైనంత వరకు లోకల్, సీజనల్ కూరగాయలు, పండ్లు కొనండి. దిగుమతి చేసుకునే రాస్ప్‌బెర్రీలు, కొత్తిమీర, బేసిల్ ఆకులతో ఎక్కువ రిస్క్ ఉంటుంది. అమెరికా హెల్త్ అఫీషియల్స్ ప్రకారం.. ప్యాక్డ్ సలాడ్ లీవ్స్ కంటే హోల్ లెట్యూస్ కొని, పైనున్న రెండు మూడు పొరలు పారేసి లోపలి ఆకులు వాడుకోవడం మంచిది.
3. బాగా వండి తినండి: పచ్చి సలాడ్స్ కంటే 158 డిగ్రీల ఫారెన్‌హీట్ వేడిపై వండిన ఫుడ్ తినడం వల్ల ఈ పరాన్నజీవి చనిపోతుంది.
4. ఫిల్టర్డ్ వాటర్: ఎప్పుడూ మరిగించిన నీరు లేదా ప్రాపర్ ఫిల్టర్డ్ బాటిల్ వాటర్ మాత్రమే తాగాలి.
5. హ్యాండ్ వాష్: వాష్‌రూమ్ కెళ్లొచ్చాక, తినడానికి ముందు చేతులను సబ్బుతో కనీసం 20 సెకన్లు రుద్ది కడగాలి.
6. ట్రావెల్ అలర్ట్: ఎండాకాలంలో వేడి ఎక్కువగా ఉండే దేశాలకు ట్రిప్స్ ప్లాన్ చేస్తే ఫుడ్, వాటర్ విషయంలో డబుల్ కేర్ తీసుకోవాలి.

