MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • International
  • Iran-US: అమెరికాకు ఇరాన్ అల్టిమేటం.. ఈ షరతులకు ఒప్పుకుంటేనే హర్మూజ్ జలసంధి తెరుస్తాం

Iran-US: అమెరికాకు ఇరాన్ అల్టిమేటం.. ఈ షరతులకు ఒప్పుకుంటేనే హర్మూజ్ జలసంధి తెరుస్తాం

Iran-US: ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్ మరోసారి కఠిన వైఖరిని ప్రకటించింది. అమెరికా తమ డిమాండ్లను అంగీకరించే వరకు ఈ సముద్ర మార్గాన్ని పూర్తిగా తెరిచే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.

2 Min read
Author : Narender Vaitla
Published : Aug 09 2026, 03:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఇరాన్ షరతులు
Image Credit : X

ఇరాన్ షరతులు

ఇరాన్ తాజా ప్రకటనలో అమెరికాపై పలు కీలక డిమాండ్లు చేసింది. తమపై అమలులో ఉన్న అన్ని ఆర్థిక ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని, విదేశాల్లో నిలిపివేసిన ఇరాన్ నిధులను ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలని కోరింది. అలాగే, ఇరాన్ నౌకాశ్రయాలపై అమలులో ఉన్న దిగ్బంధనాన్ని తొలగించాలని, తమ భూభాగం సమీపంలోని అమెరికా సైనిక ఉనికిని తగ్గించి సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. యుద్ధం కారణంగా జరిగిన నష్టానికి పూర్తి స్థాయి పరిహారం చెల్లించాలని కూడా స్పష్టం చేసింది. ఈ షరతులు అమలైన తర్వాతే హర్మూజ్ జలసంధిని పూర్తిస్థాయిలో తెరవడంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అమెరికా-ఇరాన్ ల నడుమ కొనసాగుతున్న ప్రతిష్ఠంబన
Image Credit : X

అమెరికా-ఇరాన్ ల నడుమ కొనసాగుతున్న ప్రతిష్ఠంబన

ఇటీవల ఇరు దేశాల నడుమ జరిగిన చర్చల్లో కొన్ని అంశాలపై సూత్రప్రాయ అంగీకారం కుదిరినా, తుది ఒప్పందంపై ఇంకా స్పష్టత రాలేదు. అమెరికా ముందుగా హర్మూజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలు సాధారణ స్థితికి రావాలని కోరుతోంది. ఆ తర్వాతే ఆంక్షల సడలింపు, నిధుల విడుదల వంటి అంశాలను పరిశీలిస్తామని భావిస్తోంది. అయితే ఇరాన్ మాత్రం ముందు తమ డిమాండ్లు అమలు చేయాల్సిందేనని పట్టుబడుతోంది. దీంతో రెండు దేశాల నడుమ చర్చలు ముందుకు సాగకుండా ప్రతిష్ఠంబన నెలకొంది.

Related Articles

Related image1
నీ క‌ష్టాన్ని ఎవ‌రూ గుర్తించ‌డం లేద‌ని బాధ‌ప‌డుతున్నావా.? మీ ఆలోచ‌న‌ను మార్చే క‌థ
Related image2
Kalki bhagwan: ఈ ఫొటోలో ఉంది ఎవ‌రో గుర్తు ప‌ట్టారా.? ఇంత‌కీ వీళ్లు ఏమై పోయారు.?
34
ఒమన్‌తో ప్రత్యేక చర్చలు.. కానీ షరతుల్లో మార్పు లేదు
Image Credit : Asianet News

ఒమన్‌తో ప్రత్యేక చర్చలు.. కానీ షరతుల్లో మార్పు లేదు

హర్మూజ్ జలసంధి నిర్వహణకు సంబంధించి ఒమన్‌తో సాంకేతిక స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయని ఇరాన్ తెలిపింది. అయితే అవి కేవలం నౌకల రాకపోకల నిర్వహణకు సంబంధించినవేనని, అమెరికాతో ఉన్న రాజకీయ, ఆర్థిక వివాదాలకు వాటికి సంబంధం లేదని స్పష్టం చేసింది. అమెరికా తమ షరతులను అంగీకరించే వరకు జలసంధిని పూర్తిగా తెరవబోమని మరోసారి ప్రకటించింది. అవసరమైతే చర్చల గడువును పొడిగించే అవకాశాన్ని కూడా ఇరు పక్షాలు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

44
ప్రపంచ చమురు మార్కెట్‌పై ప్రభావం పడే అవకాశం
Image Credit : X

ప్రపంచ చమురు మార్కెట్‌పై ప్రభావం పడే అవకాశం

హర్మూజ్ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరాలో అత్యంత కీలకమైన సముద్ర మార్గంగా గుర్తింపు పొందింది. ప్రపంచంలో ఎగుమతి అయ్యే చమురులో గణనీయమైన భాగం ఈ మార్గం ద్వారానే రవాణా అవుతుంది. ఈ కారణంగా హర్మూజ్ జలసంధిపై ఏ చిన్న ఉద్రిక్తత ఏర్పడినా అంతర్జాతీయ చమురు ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇరాన్ ప్రకటించిన కొత్త షరతులు, అమెరికా స్పందన కోసం ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. రెండు దేశాల నడుమ తుది ఒప్పందం ఎప్పుడు కుదురుతుందన్నది ఇప్పుడు అంతర్జాతీయంగా కీలక అంశంగా మారింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
యుద్ధం
ప్రపంచం
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
Latest Videos
Recommended Stories
Recommended image1
న‌న్ను అరెస్ట్ చేస్తే, మా ప్ర‌త్యేక ద‌ళాలు రంగంలోకి దిగుతాయి.. ఇజ్రాయెల్ ప్ర‌ధాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Recommended image2
చైనా నుంచి ఇరాన్‌కు ఆయుధాలు, మ‌ధ్య‌లో పాకిస్థాన్‌.? ట్రంప్ వ్యాఖ్య‌ల‌తో మొద‌లైన కొత్త చ‌ర్చ
Recommended image3
USA Iran: అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్‌.. 9/11 తరహా దాడులు చేస్తామంటూ హెచ్చ‌రిక
Related Stories
Recommended image1
నీ క‌ష్టాన్ని ఎవ‌రూ గుర్తించ‌డం లేద‌ని బాధ‌ప‌డుతున్నావా.? మీ ఆలోచ‌న‌ను మార్చే క‌థ
Recommended image2
Kalki bhagwan: ఈ ఫొటోలో ఉంది ఎవ‌రో గుర్తు ప‌ట్టారా.? ఇంత‌కీ వీళ్లు ఏమై పోయారు.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved