MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • International
  • చైనా నుంచి ఇరాన్‌కు ఆయుధాలు, మ‌ధ్య‌లో పాకిస్థాన్‌.? ట్రంప్ వ్యాఖ్య‌ల‌తో మొద‌లైన కొత్త చ‌ర్చ

చైనా నుంచి ఇరాన్‌కు ఆయుధాలు, మ‌ధ్య‌లో పాకిస్థాన్‌.? ట్రంప్ వ్యాఖ్య‌ల‌తో మొద‌లైన కొత్త చ‌ర్చ

US Iran War: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. చైనా తయారు చేసిన క్షిపణి వ్యవస్థలను పాకిస్థాన్ మార్గంగా ఇరాన్‌కు పంపనున్నారని ట్రంప్ చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌కు దారి తీశాయి.

2 Min read
Author : Narender Vaitla
Published : Jul 30 2026, 05:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ట్రంప్ ఏమన్నారంటే.?
Image Credit : Asianet News

ట్రంప్ ఏమన్నారంటే.?

చైనా తయారు చేసిన సుమారు 400 భుజంపై మోసుకెళ్లే ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థలు (MANPADS) పాకిస్థాన్ ద్వారా ఇరాన్‌కు చేరనున్నాయనే కథనాలపై వైట్ హౌస్‌లో మీడియా ట్రంప్‌ను ప్రశ్నించారు. దీనికి స్పందించిన ఆయన, అలాంటి సమాచారం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తనతో వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేయబోమని హామీ ఇచ్చారని, ఆ హామీని ఉల్లంఘిస్తే తాను నిరాశ చెందుతానని వ్యాఖ్యానించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వార్తల్లో ఏముంది?
Image Credit : Asianet News

వార్తల్లో ఏముంది?

అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఇరాన్ తన వైమానిక రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు చైనాతో ఒక ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం 300 నుంచి 400 వరకు చైనా తయారు చేసిన QW-12, FN-16 వంటి పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థలను ఇరాన్ కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. వీటి విలువ సుమారు 60 నుంచి 70 మిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని అంచనా. ఈ సరుకు చైనాలోని ఉరుమ్‌కీ నగరం నుంచి బయలుదేరి పాకిస్థాన్ మీదుగా ఇరాన్‌కు చేరుతుందని కథనాలు పేర్కొన్నాయి.

Related Articles

Related image1
షాపింగ్ మాల్స్‌లో డ్ర‌స్‌ల‌కు ఉండే ఈ ట్యాగ్‌లు ఏంటో తెలుసా? ఇవి ఎలా ప‌నిచేస్తాయంటే.?
Related image2
తెలంగాణ‌లో మినీ ఆదియోగి.. రూ. 15 కోట్ల‌తో అద్భుత పార్క్‌, హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌ర్లోనే.. ఎలా వెళ్లాలంటే.?
35
ఖండించిన చైనా, పాకిస్థాన్
Image Credit : X

ఖండించిన చైనా, పాకిస్థాన్

ఈ ప్రచారాన్ని చైనా విదేశాంగ శాఖ పూర్తిగా తోసిపుచ్చింది. ఇలాంటి వార్తలకు ఎలాంటి ఆధారాలు లేవని, తాము ఎప్పటికీ శాంతి, వివాదాల పరిష్కారానికే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. మరోవైపు పాకిస్థాన్ సైన్యానికి చెందిన ఐఎస్‌పీఆర్ కూడా ఈ ఆరోపణలను నిరాధారం అని పేర్కొంది. చైనా నుంచి ఇరాన్‌కు ఆయుధాల రవాణాలో పాకిస్థాన్ పాత్ర ఉందన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టంచేసింది.

45
అమెరికా-పాకిస్థాన్ సంబంధాలపై ప్రభావం?
Image Credit : X

అమెరికా-పాకిస్థాన్ సంబంధాలపై ప్రభావం?

ఇటీవలి కాలంలో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాల్లో పాకిస్థాన్ మధ్యవర్తిగా వ్య‌వ‌హ‌రించిన విష‌యం తెలిసిందే. ట్రంప్ కూడా పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు ఆసిమ్ మునీర్ పాత్రను గతంలో ప్రశంసించారు. ఇలాంటి సమయంలో చైనా ఆయుధాలను పాకిస్థాన్ ద్వారా ఇరాన్‌కు పంపుతున్నారనే వార్తలు నిజమైతే, వాషింగ్టన్-ఇస్లామాబాద్ సంబంధాలపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అధికారికంగా ఈ ఆరోపణలను ఇరు దేశాలు ఖండించడంతో పరిస్థితి ప్రస్తుతం స్పష్టత కోసం ఎదురుచూస్తోంది.

55
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల మధ్య పెరిగిన ఆసక్తి
Image Credit : x.com

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల మధ్య పెరిగిన ఆసక్తి

అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి కథనాలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఒకవైపు ఇరాన్ తన రక్షణ సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తుండగా, మరోవైపు అమెరికా చైనా పాత్రపై నిఘా ఉంచుతోంది. అయితే చైనా, పాకిస్థాన్ చేసిన అధికారిక ఖండనలతో ఈ అంశంపై ఇంకా స్పష్టమైన ఆధారాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వ్యవహారం అంతర్జాతీయ దౌత్యరంగంలో ఆసక్తికర చర్చగా మారింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
యుద్ధం
ప్రపంచం
Latest Videos
Recommended Stories
Recommended image1
USA Iran: అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్‌.. 9/11 తరహా దాడులు చేస్తామంటూ హెచ్చ‌రిక
Recommended image2
USA Iran: ఇరాన్‌తో యుద్ధం.. అమెరికా ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని కోట్లు ఖ‌ర్చు చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Recommended image3
USA Iran: ఇరాన్ అధ్య‌క్షుడి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌.. మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చిన ప‌రిస్థితి
Related Stories
Recommended image1
షాపింగ్ మాల్స్‌లో డ్ర‌స్‌ల‌కు ఉండే ఈ ట్యాగ్‌లు ఏంటో తెలుసా? ఇవి ఎలా ప‌నిచేస్తాయంటే.?
Recommended image2
తెలంగాణ‌లో మినీ ఆదియోగి.. రూ. 15 కోట్ల‌తో అద్భుత పార్క్‌, హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌ర్లోనే.. ఎలా వెళ్లాలంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved