- Home
- International
- Marriage leave: కొత్త జంటలకు పండగే.. పెళ్లి చేసుకుంటే వేతనంతో కూడిన సెలవులు. ప్రభుత్వం కీలక నిర్ణయం.
Marriage leave: కొత్త జంటలకు పండగే.. పెళ్లి చేసుకుంటే వేతనంతో కూడిన సెలవులు. ప్రభుత్వం కీలక నిర్ణయం.
ప్రతీ వ్యక్తి జీవితంలో వివాహానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అందుకే పెళ్లిని సంతోషంగా జరుపుకోవాలని భావిస్తారు. మరి వివాహానికి వేతనంతో కూడిన సెలవులు ఉంటే ఎలా ఉంటుంది.? అది కూడా ప్రభుత్వం ప్రకటిస్తే. భలే ఉంటుంది కదూ!

దుబాయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
యుఏఈలోని దుబాయ్ ప్రభుత్వం ఇటీవల ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా, దుబాయ్ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఎమిరాతీ ఉద్యోగులకు పెళ్లి కోసం 10 రోజుల పూర్తి వేతన సెలవు ఇవ్వనుంది. ఈ నిర్ణయాన్ని డిక్రీ నంబర్ 31 ఆఫ్ 2025 ద్వారా జారీ చేశారు. ఈ చట్టం దుబాయ్ అంతటిలో పనిచేస్తున్న ప్రభుత్వ, అభివృద్ధి జోన్, ఫ్రీ జోన్‌ల ఉద్యోగులకు వర్తిస్తుంది. ఇందులో డుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ (DIFC) ఉద్యోగులూ ఉంటారు.
ఎవరుఅర్హులు?
ఈ పెళ్లి సెలవు కేవలం ఎమిరాతీ పౌరులకే వర్తిస్తుంది. అర్హతకు కొన్ని షరతులు ఉన్నాయి. అవేంటంటే..
* ఉద్యోగి భార్య లేదా భర్త తప్పనిసరిగా ఎమిరాతీ పౌరుడు/పౌరురాలు అయి ఉండాలి
* ఉద్యోగి ప్రొబేషన్ పీరియడ్ పూర్తిచేసి ఉండాలి
* పెళ్లి రిజిస్ట్రేషన్ 2025 జనవరి 1 లేదా దాని తరువాత జరగాలి
* పెళ్లి ఒప్పందం యుఏఈ అధికారులతో ధృవీకరించాలి.
సెలవు వినియోగంపై ప్రత్యేక నిబంధనలు
ఉద్యోగి పెళ్లి సెలవును ఒక్కసారిగా లేదా విడివిడిగా తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ 10 రోజులు పెళ్లి తేదీ నుంచి 1 సంవత్సరంలోపే పూర్తిగా వినియోగించాలి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, జవాబుదారిగా కారణాలు చూపించి, ప్రత్యక్ష మేనేజర్ అనుమతి తీసుకుంటే, మిగిలిన సెలవును తర్వాతి ఏడాదిలో తీసుకునే వీలుంది.
సెలవు సమయంలో అన్ని వేతనాలు, భత్యాలు చెల్లింపు
పెళ్లి సెలవు సమయంలో ఉద్యోగికి పూర్తి జీతం, అలవెన్సులతో పాటు ఇతర ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. ఇది ఆయా శాఖల మానవ వనరుల విధానాల ప్రకారం అమలవుతుంది. అలాగే, ఉద్యోగి తాను అందుకోగలిగే ఇతర సెలవులతో కూడి ఈ పెళ్లి సెలవును కలిపి తీసుకునే అవకాశం కూడా ఉంది.
సైనిక ఉద్యోగులకు ప్రత్యేక నిబంధనలు
పెళ్లి సెలవు తీసుకున్న ఉద్యోగిని ఆ సమయంలో ఉన్నపలంగా విధుల్లో చేరమని అడగరు. అయితే సైనిక శాఖల్లో పనిచేసే ఉద్యోగులు, వెరీ హైవోల్యూమ్ వర్క్ లోడ్ ఉన్నప్పుడు మాత్రమే తిరిగి విధుల్లో చేరాలని ఆదేశిస్తారు. అలాంటి సందర్భాల్లో తిరిగి విధులు ముగిసిన తర్వాత, మిగిలిన పెళ్లి సెలవును తిరిగి ఉపయోగించే అవకాశం కల్పిస్తారు.