- Home
- International
- Donald Trump: భారత్‌ను నరకంతో పోల్చిన ట్రంప్.. ఒకసారి వచ్చి చూడమని ఇరాన్ కౌంటర్
Donald Trump: భారత్‌ను నరకంతో పోల్చిన ట్రంప్.. ఒకసారి వచ్చి చూడమని ఇరాన్ కౌంటర్
Donald Trump: నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా సోషల్ మీడియా షేర్ ప్రస్తుతం పెద్ద వివాదానికి దారితీసింది. భారత్‌ను అవమానించేలా ఉన్న ఒక లేఖను ఆయన షేర్ చేయడంతో ఈ అంశం అంతర్జాతీయంగా చర్చకు వచ్చింది.

వివాదానికి కారణమైన పోస్ట్ ఏంటి?
అమెరికా రేడియో హోస్ట్ మైఖేల్ సేవేజ్ రాసిన ఒక లేఖలో భారత్, చైనా దేశాలను తీవ్రంగా విమర్శిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ లేఖను ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ట్రూత్ సోషల్‌లో రీషేర్ చేశారు. ఇందులో భారత్‌ను నరకంతో పోల్చడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
భారత్ కౌంటర్.. “అవగాహన లేని వ్యాఖ్యలు”
ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు అవగాహన లేని, అనుచితమైనవి అని స్పష్టం చేశారు. భారత్-అమెరికా సంబంధాలు పరస్పర గౌరవం, భాగస్వామ్య ప్రయోజనాలపై ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు.
మరోవైపు ప్రశంసలు
ఇదిలా ఉండగా, అమెరికా ప్రతినిధి క్రిస్టోఫర్ ఎల్మ్స్ మరో కోణాన్ని వెల్లడించారు. ట్రంప్ వ్యక్తిగతంగా భారత్‌పై మంచి అభిప్రాయం కలిగి ఉన్నారని, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీతో తనకు స్నేహం ఉందని ఆయన చెప్పినట్లు తెలిపారు. దీంతో ట్రంప్ వ్యాఖ్యలపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.
అసలు నేపథ్యం ఇదే..
ఈ వివాదానికి ప్రధాన కారణం అమెరికాలో అమలులో ఉన్న “బర్త్‌రైట్ సిటిజన్‌షిప్” విధానం. దీనిపై ట్రంప్ ఎప్పటి నుంచో వ్యతిరేకంగా ఉన్నారు. ఆసియా దేశాల నుంచి, ముఖ్యంగా భారత్, చైనా నుంచి వచ్చే వలసదారులపై కొన్ని ఆరోపణలు చేయడం ఈ వివాదానికి దారి తీసింది. టెక్ రంగంలో ఉద్యోగాలపై కూడా వ్యాఖ్యలు చేయడం విమర్శలకు కారణమైంది.
ఇరాన్ ఎంబసీ సపోర్ట్.. భారత్‌కు బలమైన సపోర్ట్
ఈ వివాదంలో భారత్‌కు మద్ధతుగా ఇరాన్ ఎంబసీలు కూడా స్పందించాయి. ముంబయిలోని ఇరాన్ ప్రతినిధులు భారత్ గొప్ప నాగరికత కలిగిన దేశమని పేర్కొన్నారు. భారత్ అభివృద్ధి, సంస్కృతి గురించి ప్రత్యక్షంగా తెలుసుకున్న తర్వాతే మాట్లాడాలని సూచించారు. ఇందులో భాగంగానే మహారాష్ట్రాలోని పలు టూరిస్ట్ ప్లేసెస్‌కి సంబంధించిన వీడియోను షేర్ చేశారు.
Maybe someone should book a one-way cultural detox for Mr. #Trump, it might just reduce the random bakwaas 😏
Kabhi #India aa ke dekho, phir bolna. pic.twitter.com/kkocLZ31XX— Iran in Mumbai (@IRANinMumbai) April 23, 2026

