- Home
- National
- అంబులెన్స్‌లో ఒక యువతి, ఇద్దరు యువకులు.. అనుమానం వచ్చి వెంబడించిన స్థానికులు. షాకింగ్ సీన్
అంబులెన్స్‌లో ఒక యువతి, ఇద్దరు యువకులు.. అనుమానం వచ్చి వెంబడించిన స్థానికులు. షాకింగ్ సీన్
Viral Video: ప్రాణాలను కాపాడేందుకు వినియోగించే అంబులెన్స్‌ను కొందరు యువకులు పూర్తిగా దుర్వినియోగం చేసిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.

రోడ్డుమీద కనిపించిన అనుమానాస్పద దృశ్యం
స్థానికుల సమాచారం ప్రకారం, ఓ అంబులెన్స్ రోడ్డుపై వెళ్తుండగా లోపల అనుమానాస్పద కదలికలు కనిపించాయి. కిటికీలో నుంచి చూసినప్పుడు ఓ యువతి, ఇద్దరు యువకులు అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఆ వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు.
5 కిలోమీటర్ల చేజ్ తర్వాత
అంబులెన్స్‌ను వెంటనే ఆపలేకపోయిన స్థానికులు దాన్ని వెంబడించారు. సుమారు 5 కిలోమీటర్ల పాటు వెంబడించిన తర్వాత చివరకు వాహనాన్ని నిలిపివేశారు. తలుపులు తెరిచి పరిశీలించగా, ఎలాంటి రోగి లేకుండా యువకులు, యువతి మాత్రమే ఉండటం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది.
‘మూవింగ్ ఓయో’గా మార్చేరంటూ..
అంబులెన్స్‌లో వైద్య అత్యవసర సేవలకు సంబంధించిన ఎలాంటి గుర్తులు లేకపోవడం స్థానికులకు మరింత కోపం తెప్పించింది. ప్రశ్నించగా, పట్టుబడిన వారు తప్పించుకునేందుకు వివిధ కారణాలు చెప్పినప్పటికీ, స్థానికులు తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలకు సేవ చేయాల్సిన వాహనాన్ని ఇలా వ్యక్తిగత వినియోగానికి, అది కూడా అసాంఘిక పనులకు వాడటం తీవ్ర విమర్శలకు దారి తీసింది. అంబులెన్సును ఓయో రూమ్‌గా మార్చేశారు కదా అంటూ తిట్టిన తిట్ట తిట్టకుండా తిట్టారు.
పోలీసుల విచారణ
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు వెంటనే స్పందించారు. ప్రాథమికంగా అంబులెన్స్ డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటూ, అతడిని విధుల నుంచి తొలగించినట్లు సమాచారం. అలాగే ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. ప్రజల ప్రాణాలను కాపాడే సేవలను దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
एंबुलेंस बनी चलता फिरता OYO. राहगीरों ने एंबुलेंस की विंडो से देखी गलत हरकत है, जिसके बाद लोगों ने किया पीछा. तकरीबन 5 किलोमीटर बाद एक लड़की और दो लड़कों को पकड़ा गया.
📍 छतरपुर (मध्य प्रदेश) pic.twitter.com/C2Ipwl8US3— ocean jain (@ocjain4) April 23, 2026

