MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Districts News
  • Hyderabad
  • Betting Apps: బెట్టింగ్‌ యాప్స్‌ ఎలా పని చేస్తాయి? నిజంగానే డబ్బులు ఊరికే వస్తాయా.? భయంకరమైన నిజాలు..

Betting Apps: బెట్టింగ్‌ యాప్స్‌ ఎలా పని చేస్తాయి? నిజంగానే డబ్బులు ఊరికే వస్తాయా.? భయంకరమైన నిజాలు..

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్‌ యాప్స్‌కు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కొంత మంది సోషల్‌ మీడియా ఇన్‌ప్లూయర్స్‌ బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తూ ఎంతో మంది మరణాలకు కారణమయ్యారన్న అంశం కుదిపేస్తోంది. పోలీసుల విచారణలో తెలియక తప్పు చేశామంటూ బుకాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలీ బెట్టింగ్‌ యాప్స్‌ ఎలా రన్‌ అవుతున్నాయి.? వీటి వెనక జరిగే మోసాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..  

3 Min read
Narender Vaitla
Published : Mar 22 2025, 02:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
online betting

online betting

'డబ్బులు ఎవరికీ ఊరికే రావు' ఇదొక పాపులర్‌ డైలాగ్‌. నిజంగా ఆలోచిస్తే ఒక రూపాయి సంపాదించాలన్నా ఎంతో కొంత కష్టపడాలి. శారీరకంగా లేదా మానసికంగా శ్రమిస్తే కానీ చేతికి డబ్బులు రావు. అలాంటిది బెట్టింగ్‌ యాప్‌లో డబ్బులు వస్తాయంటే ఎలా నమ్ముతారు. అందుకే వందలాది మంది అద్యంతరంగా తనువు చాలిస్తున్నారు. బెట్టింగ్‌ యాప్స్‌ ఊబిలో చిక్కుకుపోయి, అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకొని తమను నమ్ముకున్న వారిని పుట్టెడు దుఃఖంలో ముంచేస్తున్నారు.  

26
IPL BETTING

IPL BETTING

అసలు బెట్టింగ్‌ యాప్స్‌ ఎలా పనిచేస్తాయి.? 

బెట్టింగ్‌ యాప్‌ వెనకాల ఒక పెద్ద ముఠా ఉంటుంది. భారత దేశంలో బెట్టింగ్‌ యాప్స్‌పై నిషేధం ఉన్నా యథేశ్చగా సాగుతుండడానికి ఇదే కారణం. నేరుగా బ్యాంక్‌ అకౌంట్ల ద్వారానే ఈ బెట్టింగ్ దందా నడుస్తోంది. ఇందుకోసం ముందుగా ఊరు పేరు తెలియని కొందరు వ్యక్తుల పేర్ల మీద సిమ్‌ కార్డులు, బ్యాంక్‌ అకౌంట్స్‌ ఓపెన్‌ చేస్తారు. బెట్టింగ్‌ యాప్స్‌ కోసం ఇవే అకౌంట్లను ఉపయోగించుకుంటారు. వీటితో యూపీఐ అకౌంట్లను క్రియేట్‌ చేస్తారు. అలాగే కొంత మంది డెవలపర్ల సహాయంతో ఆకర్షణీయమైన పేర్లతో యాప్స్‌ను తయారు చేస్తారు. ఈ యాప్స్‌ను ఎవరు నిర్వహిస్తున్నారన్న విషయం తెలియకుండా ఉండేందుకు ఇలా వందలాది బ్యాంక్‌ అకౌంట్లను ఉపయోగిస్తుంటారు. 
 

36
Betting Apps

Betting Apps

ప్రమోషన్‌ కోసమే ఈ ఇన్‌ప్ల్యూయర్స్‌: 

ఒకప్పుడు ఈ బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేసేందుకు పైరసీ మూవీలు ఉండే వెబ్‌సైట్లను ఉపయోగించే వారు. కానీ కాలక్రమేణ సోషల్‌ మీడియాను దీనికి అడ్డాగా మార్చుకున్నారు. రిజిస్టర్‌ చేసుకుంటే బోనస్‌ పాయింట్స్‌ వస్తాయంటూ ప్రజలను అట్రాక్ట్‌ చేస్తారు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్ల్యూయర్స్‌ను రంగంలోకి దింపారు. లక్షల్లో ఫాలోవర్లను ఉన్న వారిని సెలక్ట్‌ చేసుకొని వారితో బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తారు. 

ఇలా ప్రమోట్‌ చేసినందుకు వారికి లక్షల్లో డబ్బులు ఇస్తున్నారు. అయితే బెట్టింగ్‌ యాప్స్‌ నిర్వాహకులు నేరుగా ఇన్‌ఫ్ల్యూయర్స్‌ను కాంటాక్ట్‌ అవ్వరు. ఇందుకోసం మార్కెటింగ్‌ ఏజెన్సీలను ఎంచుకుంటారు. మార్కెటింగ్ ఏజెన్సీలు సోషల్‌ మీడియా ఇన్‌ప్ల్యూయన్సర్లకు యాప్స్‌ ప్రమోషన్‌ గురించి వివరించి రెమ్యునరేషన్‌ అందిస్తారు. 

46

ఈ యాప్స్‌కు ఎందుకు అట్రాక్ట్‌ అవుతున్నారు.? 

బెట్టింగ్‌ యాప్స్‌కు కేవలం యువత మాత్రమే కాకుండా పెద్దలు కూడా అట్రాక్ట్‌ అవుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఈజీ మనీ. క్షణాల్లో డబ్బులు రెట్టింపు కావడం, బెట్టింగ్‌ యాప్స్‌ నిర్వాహకులు యూజర్‌ ఇంటర్‌ఫేజ్‌ను చాలా ఫ్రెండ్లీగా తయారు చేయడమే దీనికి కారణాలుగా చెప్పొచ్చు. ప్లేస్టోర్‌లో ఒక సింగిల్‌ క్లిక్‌ దూరంలో యాప్స్‌ అందుబాటులో ఉండడంతో చాలా మంది సరదాగా మొదలు పెట్టి, వాటికి అడిక్ట్‌ అవుతున్నారు. 

56
Dharwad Betting

Dharwad Betting

ఆత్మహత్యలకు ఎలా దారి తీస్తుంది.? 

మన దగ్గర ఉన్న డబ్బులతో బెట్టింగ్‌ చేస్తాం. ఒకవేళ అవి పోతే, ఆపేస్తాం అంతేగా.. అనే సందేహం వస్తుండొచ్చు. అయితే ఒక్కసారి జూదంలోకి దిగితే దాని నుంచి బయటకు రావడం అంత సులభమైన విషయం కాదు. రూ. 100 కోల్పోతే రూ. 1000 సంపాదిస్తా అన్న కసి పెరుగుతుంది. దీంతో అప్పులు చేయడం మొదలు పెడతారు. ఇందుకోసం లోన్‌ యాప్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ఎలాంటి డాక్యుమెంటేషన్‌ లేకుండా క్షణాల్లో అప్పులు ఇచ్చే లోన్‌ యాప్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

అయితే వీటిలో వడ్డీలు ఓ రేంజ్‌లో ఉంటాయి. తీసుకున్న అప్పు చెల్లించడంలో ఏమాత్రం విఫలమైన వడ్డీతో కలిపి తీసుకున్న అప్పు మూడు రెట్లు అవుతుంది. అప్పు చేసిన డబ్బులు కూడా బెట్టింగ్‌ యాప్స్‌లో పోతాయి. ఇక అసలు కథ ఇప్పుడు స్టార్ట్‌ అవుతుంది. అప్పు ఇచ్చిన బెట్టింగ యాప్‌ నిర్వాహకులు మీ స్నేహితులకు, బంధువులకు ఫోన్‌లు చేస్తారు. మీరు అప్పు తీసుకుని ఎగ్గొట్టారంటూ ఫొటోలను వైరల్‌ చేస్తుంటారు. దీంతో తీవ్రమైన ఒత్తిడిని భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. 

66

వీటి నుంచి ఎలా బయటపడాలి.? 

బెట్టింగ్ యాప్స్‌ బారినపడకుండా ఉండాలంటే ఒక విషయాన్ని కచ్చితంగా గుర్తుంచుకోవాలి. కష్టం చేయకుండా డబ్బు వస్తుందంటే అది కచ్చితంగా చట్ట విరుద్ధమని తెలుసుకోవాలి. బెట్టింగ్‌ యాప్స్‌ను మీకు తెలియని వ్యక్తి ఎక్కడి నుంచో రన్‌ చేస్తుంటాడు. అలాంటి వారిని గుడ్డిగా విశ్వసించడం మరో తప్పు. అందుకే ఇలాంటి వాటిని వీలైనంత దూరంగా ఉండడమే మంచిది.

మీకు నిజంగా డబ్బు కావాలంటే మీ కష్టాన్నే నమ్ముకోవాలి. మీకు వచ్చిన పనిని, మీకు తెలిసిన టెక్నాలజీ ఆధారంగా డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోండి. ఇక మరికొందరు సరదాగా బెట్టింగ్‌ యాప్స్‌లో ఆడడం మొదలు పెట్టి లక్షలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. అందుకే కాలక్షేపం కాకపోతే పుస్తకాలు చదవడం, ట్రావెల్‌ చేయడం లాంటివి చేయాలి కానీ ఎట్టి పరిస్థితుల్లో బెట్టింగ్‌ యాప్స్‌ జోలికి వెళ్లకూడదు. బెట్టింగ్‌ యాప్‌లో ఈరోజు మీకు రూ. 100 వచ్చాయంటే.. రేపు రూ. 500 పోవడం ఖాయమనే ఒక సింపుల్‌ లాజిక్‌ తెలిస్తే అసలు జీవితంలో వాటిని టచ్‌ చేయరు. 
 

About the Author

NV
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు.
నేరాలు, మోసాలు
హైదరాబాద్
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Recommended image2
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?
Recommended image3
హైదరాబాద్ లో బుధవారం నీటి సరఫరా బంద్.. ఈ ప్రాంతాల ప్రజలు ముందే జాగ్రత్తపడండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved