MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • Real Estate : ఈ పట్టణాల చుట్టూ రింగ్ రోడ్స్, రియల్ బూమ్ ఖాయం.. ఇప్పుడే భూములు కొనిపెట్టుకొండి

Real Estate : ఈ పట్టణాల చుట్టూ రింగ్ రోడ్స్, రియల్ బూమ్ ఖాయం.. ఇప్పుడే భూములు కొనిపెట్టుకొండి

తెలంగాణలోని చిన్నచిన్న పట్టణాల్లో కూడా రియల్ బూమ్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు రియల్ ఎస్టేట్ రంగానికి ఊపు ఇచ్చేలా ఉన్నాయి. కాబట్టి మీరు భూములు కొనేందుకు ఇదే సరైన సమయం. 

2 Min read
Author : Arun Kumar P
Published : Mar 12 2026, 11:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రియల్ ఎస్టేట్ ఊపందుకుంటుందా..?
Image Credit : Gemini AI

రియల్ ఎస్టేట్ ఊపందుకుంటుందా..?

Real Estate : భూమిపై పెట్టుబడులు పెడితే ఎప్పటికైనా లాభం ఉంటుందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతుంటారు. కొందరు కాస్త తెలివిగా ఆలోచించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందుతుంటారు. అలాంటి అవకాశమే తెలంగాణ ప్రజలకు వచ్చింది... కేవలం లక్షల్లో పెట్టుబడి పెట్టి భవిష్యత్ లో కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను సృష్టించే అద్భుతమైన ఛాన్స్. కొన్ని పట్టణాల్లో రియల్ ఎస్టేట్ రంగానికి ఊపునిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కాబట్టి మీరు ఇప్పుడే అలర్ట్ అయితే భవిష్యత్ లో వచ్చే రియల్ బూమ్ ఫలాలను అందుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఈ పట్టణాల చుట్టూ రింగ్ రోడ్స్...
Image Credit : Gemini AI

ఈ పట్టణాల చుట్టూ రింగ్ రోడ్స్...

తెలంగాణ రాజధాని హైదరాబాద్ చుట్టూ ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు (ORR) ఉంది. అయినప్పటికీ రీజనల్ రింగ్ రోడ్డు (RRR) ను నిర్మిస్తున్నారు. ఈ రింగ్ రోడ్స్ కారణంగా శివారు ప్రాంతాల్లో రియల్ బూమ్ ఏ స్థాయికి చేరుకుందో చూస్తున్నాం. ఇప్పుడు ఇదే తరహాలో జిల్లా కేంద్రాల చుట్టూ రింగ్ రోడ్స్ నిర్మించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్దమవుతోంది. అంటే ORR, RRR పరిసరాల్లో మాదిరిగానే జిల్లా కేంద్రాల శివార్లలో భూములకు రెక్కలు రానున్నాయి... రియల్ ఎస్టేట్ ఊపందుకోనుంది.

35
రేవంత్ సర్కార్ ప్లాన్ ఇదే..
Image Credit : Gemini AI

రేవంత్ సర్కార్ ప్లాన్ ఇదే..

రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలన్నింటి చుట్టూ రింగు రోడ్లు నిర్మించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి రోడ్లు, భవనాల శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లోకి భారీ వాహ‌నాలు వెళ్ల‌కుండా ఈ రింగ్ రోడ్స్ ఉపయోగపడతాయని... తద్వారా స‌రుకు ర‌వాణా వేగం పెరుగుతుందని అన్నారు. అంతేకాదు పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గుతాయని... తద్వారా ప్రజల ప్రయాణ సమయం కూడా తగ్గుతుందని అన్నారు.

ఇప్ప‌టికే ఆయా జిల్లా కేంద్రాల‌కు స‌మీపంలో జాతీయ రహదారులు ఉంటే వాటిని అనుసంధానించేలా రింగ్ రోడ్లు ఏర్పాటు చేయాల‌ని సీఎం సూచించారు. జిల్లా కేంద్రాల నుంచి రింగు రోడ్ల‌కు అనుసంధానించేలా రేడియ‌ల్ రోడ్లు నిర్మించాల‌ని సీఎం ఆదేశించారు. జాతీయ ర‌హ‌దారుల‌కు రింగు రోడ్ల‌ను అనుసంధానించే అంశంపై ప్రత్యేకంగా అధ్య‌య‌నం చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

45
రియల్ ఎస్టేట్ ఊపందుకుంటుందా..?
Image Credit : Google Gemini AI

రియల్ ఎస్టేట్ ఊపందుకుంటుందా..?

ప్రస్తుతం తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోయిందనే చెప్పాలి. గతంలో పంటలుపండే వ్యవసాయ భూములు కాదు బీడు, రాళ్లు, కొండకోన ప్రాంతాల్లోని భూములు కూడా లక్షలు, కోట్లు పలికాయి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు... ధరలు సగానికి సగం పడిపోయాయి. దీంతో భూములు అమ్మేవారు, కొనేవారు సైలెన్స్ అయిపోయారు... రియల్ ఎస్టేట్ నెమ్మదించింది. ఈ క్రమంలో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ కు బూస్ట్ ఇచ్చేలా నిర్ణయాలు తీసుకుంటోంది... అందులో భాగమే ఈ జిల్లా కేంద్రాల చుట్టూ రింగ్ రోడ్స్ ప్రతిపాదన. భవిష్యత్ లో తెలంగాణ జిల్లా కేంద్రాల్లో రియల్ భూమ్ ఖాయంగా కనిపిస్తోంది.

55
ఇప్పుడే భూములు కొనిపెట్టుకోండి..?
Image Credit : Google Gemini AI

ఇప్పుడే భూములు కొనిపెట్టుకోండి..?

ప్రస్తుతం రియల్ ఎస్టేట్ డల్ గా ఉంది.. కాబట్టి భూముల ధరలు తక్కువగా ఉన్నాయి. హైదరాబాద్ తో పాటు శివారుప్రాంతాల్లో భూముల ధరలు కాస్త పరవాలేదు... కానీ జిల్లాల్లో పూర్తిగా పడిపోయాయి. కాబట్టి ఇప్పుడే జిల్లా కేంద్రాల శివారులో తక్కువ ధరకే భూములు కొనుగోలు చేయడం మంచిది. భవిష్యత్ లో రింగ్ రోడ్డు పూర్తయితే ఈ భూములకు భారీ డిమాండ్ పెరుగుతుంది... భారీ లాభాలు పొందే అవకాశం ఉంటుంది. అయితే గుడ్డిగా ఎక్కడపడితే అక్కడ కాకుండా కాస్త తెలివిగా ఆలోచించి సరైన ప్రాంతంలో భూములు కొనాలి... అప్పుడే భవిష్యత్ లో లాభాలు పొందవచ్చు.

గమనిక : రియ‌ల్ ఎస్టేట్‌లో పెట్టుబ‌డులు పెట్టే ముందు కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. పెట్టుబడి పెట్టే ముందు లీగల్ క్లారిటీ, భూమి డాక్యుమెంట్లు, అభివృద్ధి స్థాయి వంటి అంశాలు పరిశీలించడం అవసరం. సరైన ప్రణాళికతో ముందడుగు వేస్తే రియల్ ఎస్టేట్ మంచి పెట్టుబ‌డి ఆప్ష‌న్‌గా మార్చుకోవ‌చ్చు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
స్థిరాస్తి
తెలంగాణ
హైదరాబాద్
అనుముల రేవంత్ రెడ్డి
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?
Recommended image2
Farmer ID: రైతులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్, రైతు భరోసా ఆగిపోవద్దంటే వెంటనే ఇలా చేయండి
Recommended image3
Heavy Rains Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో వారం రోజులు వర్షాలే వర్షాలు
Related Stories
Recommended image1
Real estate: హైద‌రాబాద్‌లోని ఈ శివారు ప్రాంతం మ‌రో కూక‌ట్‌ప‌ల్లి కావ‌డం ఖాయం.. ఇప్పుడే కొనేయండి
Recommended image2
Real estate: ఏపీలోని ఈ ప్రాంతం మ‌రో సైబ‌ర్ సిటీ కావ‌డం ఖాయం.. ఇవే సాక్ష్యాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved