- Home
- Life
- Health
- Child Health: 6 నెలలలోపు చిన్నారులకు నీళ్లు తాగిస్తే ఏమవుతుందో తెలుసా.? ఎప్పటి నుంచి తాగించాలి..
Child Health: 6 నెలలలోపు చిన్నారులకు నీళ్లు తాగిస్తే ఏమవుతుందో తెలుసా.? ఎప్పటి నుంచి తాగించాలి..
Kids Health: మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే ముఖ్యమని చెప్పాల్సిన పనిలేదు. శరీరంలో నీటి శాతం తగ్గితే డీహైడ్రేషన్‌కు గురవుతారు. ఇది ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అందుకే కచ్చితంగా సరిపడ నీటిని తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే అప్పుడే పుట్టిన చిన్నారులకు మంచి నీరు అందిస్తే ఏమవుతుంది.? అసలు ఎప్పటి నుంచి నీటిని తాగించాలి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా పురుషులు రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీటిని, మహిళలు 2 నుంచి 3 లీటర్ల నీటిరి, చిన్నారులు 1-2.5 లీటర్ల నీటిని తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. ఇంతకు మించి తగ్గితే శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. అయితే ఇది ఆరు నెలల కంటే తక్కువ వయసున్న చిన్నారులకు వర్తించదు. అప్పుడే పుట్టిన బిడ్డకు ఆరు నెలలు వచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లో నీటిని తాగించకూడదు.
అయితే చిన్నారులకు నీటిని ఎందుకు ఇవ్వకూడదన్న విషయంపై వైద్యులు కొన్ని కారణాలు చెబుతున్నారు. సాధారణంగా 6 నెలల వయసు వరకు శిశువుకు మూత్రపిండాలు పూర్తి స్థాయిలో పరిపక్వం చెందవు. ఈ కారణంగా నీటిని తీసుకుంటే శరీరం నుంచి అదనపు నీరు, సోడియం మూత్రం రూపంలో బయటకు పోతుంది. ఇది చిన్నారుల్లో తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని వైద్యులు చెబుతున్నారు.
శరీరంలో సోడియం లోపం ఏర్పడితే మెదడుపై ప్రభావం పడుతుంది. మెదడు పనితీరు దెబ్బతినే అవకాశం ఉంటుంది. చిరాకుతో పాటు దీర్ఘకాలంలో మానసిక సమస్యలకు దారి తీస్తుంది. అలాగే ముఖం, కాళ్లు, చేతుల్లో వాపు ఏర్పడే అవకాశం ఉంటుంది. నీటిని ఇవ్వడం వల్ల నవజాత శిశువుల్లో పోషకాల కొరత, నెమ్మదిగా పెరుగుదల, పోషకాహార లోపం, బరువు తగ్గడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
baby
వీలైనంత వరకు ఆరు నెలల వరకు చిన్నారులకు తల్లి పాలనే పట్టించాలి. అయితే బాగా వేడిగా ఉన్న సమయంలో లేదా మలబద్దకం సమస్య ఉంటే స్పూన్‌తో తక్కువ మొత్తంలో నీటిని అందించవచ్చని చెబుతుంటారు. అయితే కచ్చితంగా వైద్యులను సంప్రదించిన తర్వాతే, వారి సూచన మేరకు నీటిని అందించాలని నిపుణులు చెబుతున్నారు.
నోట్: పైన తెలిపిన వివరాలు కేవలం ప్రాథమిక సమాచారం కోసమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.