మీకు ఐస్ క్రీం అంటే ఇష్టమా? ఈ విషయం తెలిస్తే అస్సలు తినరు
ఐస్ క్రీం ను పిల్లలు మాత్రమే కాదు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. కానీ ఐస్ క్రీంలో ఉండే కొన్ని పదార్థాలు మన ఆరోగ్యానికి చేసే చెడు గురించి తెలుసుకుంటే మీరిక ఐస్ క్రీం ను అస్సలు తినరు.

ఐస్ క్రీం
ఐస్ క్రీం అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ముఖ్యంగా మండుతున్న ఎండలకు చల్ల చల్లగా కరిగిపోయే ఐస్ క్రీం ను తింటే బలే ఉంటుంది. కానీ ఐస్ క్రీంలో ఉండే ఒక కెమికల్ వల్ల మన ఆరోగ్యం ఎంతో దెబ్బతింటుంది. దీని గురించి బెస్ట్ అన్కాలజిస్ట్ డాక్టర్ మోహన వంశి ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
మీరు ఎప్పుడైనా మీరు గమనించారా? కొన్ని ఐస్ క్రీంలు వెంటనే కరిగిపోతే.. మరికొన్ని మాత్రం గంటల తరబడి కరిగిపోకుండా అలాగే ఉంటాయి. దీనికి కారణం వాటిలో ఉండే పాలిసోర్బేట్ 80 అనే ఒక కెమికల్.
ఐస్ క్రీం
ఇది కేవలం ఒక్క ఐస్ క్రీంలోనే కాదు.. ప్రాసెస్ చేసిన ఎన్నో ఆహారాల్లో ఈ ఎముల్సీఫైర్స్ వాడకం చాలా ఎక్కువగా అయ్యింది. ఇవి మన ఆరోగ్యాన్ని ఎంతో దెబ్బతీస్తాయి. ఈ ఎముల్సీ ఫైయర్ వల్ల మన పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను నాశనం చేస్తాయని ఈ మధ్యకాలంలో వచ్చిన చాలా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. జీర్ణ వ్యవస్థలో ఇన్ఫ్లమేషన్ కు దారితీస్తాయి.
ఐస్ క్రీం
అంతేకాదు వీటి కారణంగా ఇన్ఫ్లమేటరీ బౌవల్ డిసీజ్ వస్తుందని చెబుతున్నాయి. అలాగే క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన అవకాశం ఉందని చాలా మంది నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువగా ప్రాసెస్ చేసిన ప్యాకేడ్డ్ పదార్థాల్లో వాడే కార్బోక్స్ మీథైల్ సెల్యూలోజ్, మాల్టోడెక్స్ ట్రిన్ వంటి రసాయనాలు ఈ కోవలోకి వస్తాయి.
ఐస్ క్రీం
ఈ మధ్య కాలంలో ప్రాన్స్ లో జరిగిన అనేక అధ్యయనాల్లో ఈ రసాయనాలు పేగు మైక్రోబయమ్ కు హానికరమని చెబుతున్నాయి. కొన్ని కంపెనీలు తమ బ్రాండ్ లపై ఎమల్సీ ఫైయర్ లేవు అని ప్రచారం చేసుకుంటున్నాయి. వీటిని గుర్తించడం వినియోగదారులకు చాలా కష్టం. కాబట్టి ప్యాకేజ్ మీదున్న లేబుల్ ని చాలా కేర్ ఫుల్ గా పరిశీలించాలి. ఈ ఎమల్సీ ఫైయర్ ఉన్న వాటిని తినకుండా ఉంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది.