ఏ రోటీ తింటే మంచిది?
బరువు తగ్గాలనుకునే చాలా మంది అన్నానికి బదులుగా రోటీలను తింటుంటారు. అయితే జొన్న రొట్టే, గోధుమ చపాతీ, రాగి రోటీ అంటూ ఎన్నో రకాల రోటీలు ఉంటాయి. మరివీటిలో ఏది తింటే తొందరగా బరువు తగ్గుతారో తెలుసా?

రోటీ
అన్నం కంటే రోటీలే ఆరోగ్యానికి చాలా మంచివి. ఎందుకంటే అన్నంలో ఎక్కువగా ఉండే కార్బోహైడ్రేట్లు శరీర బరువును మరింత పెంచుతాయి. అంతేకాదు అన్నం తింటే బ్లడ్ షుగర్ కూడా పెరుగుతుంది. అందుకే షుగర్ పేషెంట్లు, బరువు తగ్గాలనుకునేవారు అన్నాన్ని ఎక్కువగా తినరు. దక్షిణ భారతదేశంలో చాలా మంది బరువు తగ్గాలనుకునేవారు అన్నానికి బదులుగా రోటీలనే తింటుంటారు.
అయితే ఈ రోటీలు ఎన్నో రకాలు ఉన్నాయి. అంటే రాగి రోటీ, జొన్న రొట్టే, గోధుమ చపాతీ వంటి రోటీలను తయారుచేసి తినొచ్చు. మరి మీరు తినే రోటీలో ఎలాంటి పోషకాలున్నాయో ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా? అసలు ఏ రోటీ ఏ పోషకాలను కలిగి ఉంటుంది? ఈ రోటీలను తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రముఖ అన్కాలజిస్ట్ డాక్టర్ మోహన వంశి ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
రాగి రోటీ
రాగి రోటీ మంచి హెల్తీ ఫుడ్. ఈ రోటీలో కాల్షియం, ఐరన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ రాగి రోటీని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది రక్తాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది. అలాగే హెల్తీగా బరువు కూడా తగ్గుతారు. ఈ రోటీని తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
సజ్జల రోటీ
సజ్జల రోటీని కూడా చాలా మంది తింటుంటారు. ఈ రోటీలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీనిలో గ్లూటెన్ ఉండదు. అలాగే దీనిలో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి దీన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలాగే జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది.
జొన్న రొట్టే
గోధుమ రొట్టెకు ప్రత్యామ్నాయంగా జొన్న రొట్టెను తింటారు. ఈ రోటీలు సెలీనియంతో పాటుగా ఐరన్, కాల్షియం, మెగ్నీషియంతో పాటుగా ఇతర ప్రయోజనకరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
సత్తు రోటీ
ఈ రోటీలో ప్రోటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఈ రోటీని తింటే ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా ఈ రోటీ సహాయపడుతుంది. ఇందులో ఐరన్, సెలీనియంతో పాటుగా కాల్షియం, జింక్ కూడా పుష్కలంగా ఉంటాయి.
గోధుమ రొట్టె
గోధుమ రెట్టొను మనలో చాలా మంది రెగ్యులర్ గా తింటుంటారు. ఈ గోధుమ రోటీలో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గిస్తుంది. అలాగే గుండె జబ్బుల నుంచి మనల్ని కాపాడుతుంది.
బార్లీ రొట్టె
బార్లీ రోటీలో ఫైబర్ కంటెంట్ మెండుగా ఉంటుంది. అలాగే ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ రోటీని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఆకలి చాలా వరకు తగ్గుతుంది. ఈ రోటీని తినడం వల్ల కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. కాబట్టి ఈ రోటీ బరువును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.