MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • దుమారం రేపుతోన్న ఉపాసన వ్యాఖ్యలు.. అసలేంటీ ఎగ్ ఫ్రీజింగ్, బిగ్ స్టోరీలో ఇంట్రెస్టింగ్ విషయాలు

దుమారం రేపుతోన్న ఉపాసన వ్యాఖ్యలు.. అసలేంటీ ఎగ్ ఫ్రీజింగ్, బిగ్ స్టోరీలో ఇంట్రెస్టింగ్ విషయాలు

Egg Freezing: ఇటీవ‌ల ఉపాస‌న చేసిన వ్యాఖ్య‌లు పెద్ద చ‌ర్చ‌కు తెర తీశాయి. పిల్ల‌ల‌ను క‌న‌డానికి సంబంధించి మ‌హిళ‌ల‌కు ఉపాస‌న ఇచ్చిన ఓ స‌ల‌హా సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె చెప్పిన ఎగ్ ఫ్రీజింగ్ ప్రాసెస్ గురించి చ‌ర్చ న‌డుస్తోంది. 

3 Min read
Author : Narender Vaitla
Published : Nov 22 2025, 03:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
ఇంత‌కీ ఉపాసన ఏమన్నారంటే?
Image Credit : Asianet News

ఇంత‌కీ ఉపాసన ఏమన్నారంటే?

ఇటీవ‌ల హైద‌రాబాద్ ఐఐటీలో విద్యార్థులో మాట్లాడిన ఉపాస‌న‌.. మహిళలు తమ కెరీర్‌పై దృష్టి పెట్టాలనుకుంటే అండాలను ఫ్రీజ్ చేయించుకోవడం మంచి ఉపాయం అని తెలిపారు. ఇది “మహిళలకు అతిపెద్ద బీమ”లాంటింద‌ని ఆమె చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు దీనిపై చ‌ర్చ మొద‌లైంది.

210
స‌పోర్ట్‌తో పాటు వ్య‌తిరేక‌త‌..
Image Credit : Youtube/Curly Tales

స‌పోర్ట్‌తో పాటు వ్య‌తిరేక‌త‌..

ఉపాస‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ నడుస్తోంది. కొంద‌రు ఉపాస‌న‌కు సపోర్ట్ గా కామెంట్స్ చేస్తుంటే మ‌రికొంద‌రు మాత్రం విమ‌ర్శిస్తున్నారు. ప్ర‌స్తుత పోటీ ప్ర‌పంచంలో మ‌హిళ‌లు అన్ని రంగాల్లో రాణిస్తున్నార‌ని మ‌రిన్ని విజ‌యాలు సాధించడానికి ఎగ్ ఫ్రీజింగ్ అనేది మంచి ఆప్ష‌న్ అని కొంద‌రు అంటుంటే.. మ‌రికొంద‌రు మాత్రం ఇది డ‌బ్బులు ఎక్కువ ఉన్న‌వారికి మాత్ర‌మే సెట్ అవుతుంద‌ని సామాన్యులకు ఇది సాధ్య‌మ‌య్యే ప‌ని కాద‌ని అంటున్నారు.

Related Articles

Related image1
రూపాయికే అర‌కిలో చికెన్‌.. ఒక్క‌సారిగా ఎగ‌బ‌డుతోన్న జ‌నం. ఎక్క‌డంటే..
Related image2
ట్రాఫిక్ సిగ్న‌ల్స్ వ‌ద్ద క‌నిపించే ఈ లెట‌ర్స్ అర్థం ఏంటో తెలుసా.? ఇంత క‌థ ఉందా..
310
స్పందించిన ఉపాస‌న
Image Credit : social media

స్పందించిన ఉపాస‌న

తన పోస్టు పై వచ్చిన విమర్శలపై ఉపాసన స్పందించారు. తాను చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆరోగ్య‌క‌ర‌మైన చ‌ర్చ సాగ‌డం ఆనందంగా ఉందన్నారు. వ్యక్తిగత నిర్ణయాలు, ప్రేమగా పెళ్లి చేసుకోవడం, సమయం నిర్ణయించడం వంటి విషయాలు గౌర‌వంగా ఉండాలని ఆమె అభిప్రాయ‌ప‌డ్డారు. తాను 27 ఏళ్ల‌లో పెళ్లి చేసుకున్నాన‌ని, 29 ఏళ్ల వ‌య‌సులో తమ అండాలను ఫ్రీజ్ చేయించుకిన.. 36లో బిడ్డ‌కు జ‌న్మనిచ్చాన‌ని తెలిపారు. అలాగే ఇప్పుడు క‌వ‌ల‌ల‌కు జ‌న్మించ‌బోతున్న‌ట్లు చెప్పుకొచ్చారు. ఇలా త‌న వ్యాఖ్య‌ల‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌పై ఉపాస‌న క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

410
అసలు ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏమిటి?
Image Credit : Getty

అసలు ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏమిటి?

అండాలను సేకరించి, క్రయోగెనిక్ టెక్నిక్స్ ఉపయోగించి చాలా తక్కువ తాపన వద్ద నిల్వ చేయడమే ఎగ్ ఫ్రీజింగ్ విధానం. భ‌విష్య‌త్తులో న‌చ్చిన‌ప్పుడు ఫ్రీజ్ చేసిన అండాల‌ను శుక్ర‌క‌ణాల‌తో ఫ‌ల‌దీక‌రించి.. ఐవీఎఫ్ ద్వారా గర్భధారణ ప్రయత్నాలకు ఉపయోగిస్తారు. ఇది ఒక రకమైన ప్రీ-పెరెస్టీవ్ రిప్రొడక్టివ్ సైవింగ్ టెక్నిక్స్.

510
ఎగ్ ఫ్రీజింగ్ ప్ర‌క్రియ ఎలా ఉంటుంది.?
Image Credit : ANI

ఎగ్ ఫ్రీజింగ్ ప్ర‌క్రియ ఎలా ఉంటుంది.?

* ముందుగా థైరాయిడ్, షుగర్, ప్రొలాక్టిన్ స్థాయిలు వంటి పరీక్షల‌ను నిర్వ‌హిస్తారు.

* అనంత‌రం అండాశయ నిల్వ (Ovarian Reserve) కొలిచేందుకు AMH టెస్ట్ చేస్తారు.

* మెన్స్ట్రువల్ సైకిల్‌కి సంబంధించి 2వ లేదా 3వ రోజున అల్ట్రాసౌండ్ ద్వారా ఫాలికల్ కౌంట్ చెక్ చేస్తారు.

* ద‌శ‌ల‌వారీగా హార్మోన్ ప్రేర‌ణ ఇంజెక్ష‌న్ల‌ను ఇస్తారు.

* అన‌స్థీషియా ఇచ్చి అండాల‌ను బ‌య‌ట‌కు తీసి సేక‌రిస్తారు.

* ఆ త‌ర్వాత సేకరించిన అండాలను క్రయోప్రొటెక్షెంట్ మధ్యలో ఫ్రీజ్ చేస్తారు. ఇందుకోసం పెద్ద ఎత్తున ఛార్జీల‌ను వ‌సూలు చేస్తారు.

610
స‌క్సెస్ రేట్ ఎంత‌.?
Image Credit : Asianet News

స‌క్సెస్ రేట్ ఎంత‌.?

అయితే ఎగ్ ఫ్రీజింగ్ త‌ర్వాత అండం క‌చ్చితంగా ఫ‌ల‌దీక‌ర‌ణ చెందుతుందా అంటే చెప్ప‌లేని ప‌రిస్థితి. సాధారణంగా త‌క్కువ వ‌య‌సులో విజయ రేట్లు అధికమయినప్పటికీ వ‌య‌సు పెరిగినా కొద్దీ స‌క్సెస్ రేట్ త‌గ్గుతుంది. 35 ఏళ్లకు ముందు ఫ్రీజ్ చేస్తే లైవ్ బర్త్ రేట్లు సాధారణంగా మెరుగ్గా కనిపిస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. కొన్ని లెక్క‌ల ప్ర‌కారం.. 35కి ముందున్న వారిలో 60 శాతం విజ‌య‌వంతం కాగా.. 40 ఏళ్ల‌కిపైబ‌డిన వారిలో 20–30% స్థాయికి ప‌డిపోయిన‌ట్లు తెలుస్తోంది.

710
ఎంత ఖ‌ర్చ‌వుతుంది.?
Image Credit : Getty

ఎంత ఖ‌ర్చ‌వుతుంది.?

క్లినిక్, మందుల బ్రాండ్, అవసరమైన సైకిల్స్ సంఖ్యపై ఆధారపడి ఖర్చు పరిమితి ఉంది. సాధారణంగా ప్రాసెస్ ఖర్చు రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు అవుతుంది. అదనంగా వార్షిక నిల్వ ఛార్జీలు సుమారు రూ. 10,000 నుంచి మొద‌ల‌వుతాయి. మొత్తం వ్యయం, అవసరమైన మందులు, తీసుకొనే సైకిల్స్ పరిమాణం ఆధారంగా పెరగొచ్చు.

810
వైద్యులు ఏమంటున్నారు.?
Image Credit : Getty

వైద్యులు ఏమంటున్నారు.?

ఫ్రీజ్ చేసిన అండాలు భవిష్యత్తులో 100 శాతం గర్భధారణ అవుతాయ‌ని హామీ ఇవ్వ‌లేమ‌ని వైద్యులు అంటున్నారు. ఎగ్ ఫ్రీజింగ్ ప్రాసెస్‌తో గ్యారంటీ లేక‌పోవ‌డం ప్రధాన ఆందోళన. అదనంగా, ఐవీఎఫ్ సైకిళ్ల‌ విఫలతలు, రిపీట్‌ ఇంజెక్షన్లు, అనేక వైద్య ప్రక్రియల వల్ల భావోద్వేగ నొప్పి, ఆర్థిక ఒత్తిడి ఏర్పడే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు.

910
ఎవ‌రికి ఉప‌యోగ‌ప‌డుతుంది.?
Image Credit : google

ఎవ‌రికి ఉప‌యోగ‌ప‌డుతుంది.?

* వైద్య‌ప‌రమైన కార‌ణాల ద్వారా సంతానోత్పత్తి ప్రమాదంలో ఉన్నవారు (క్యాన్సర్ చికిత్స మొదలైనవి).

* కుటుంబ చరిత్రలో ప్రీమేచర్ మెనోపాజ్ ఉన్నవారు.

* వృత్తిపరిశ్రమా కారణాల వల్ల ఆలస్యంగా పిల్లలు కావాలని యోచించేవారు‌, ఆర్థికంగా ప్లాన్ చేసి, పూర్తి సమాచారం తీసుకున్నవారికి ఈ ప్రాసెస్ ఉప‌యోగ‌ప‌డుతుంది.

1010
భావోద్వేగ అంశాలు, ఫ్యామిలీ సపోర్ట్
Image Credit : our own

భావోద్వేగ అంశాలు, ఫ్యామిలీ సపోర్ట్

హార్మోన్ల ఇంజెక్షన్ల సమయంలో భావోద్వేగాల్లో మార్పులు, కడుపులో ఉబ్బరం, అసౌకర్యం కలగొచ్చు. ఎమోష‌న‌ల్ స‌పోర్ట్‌, భాగస్వామి స‌పోర్ట్‌, కౌన్సెలింగ్ వంటి అవ‌సరాలు ఉంటాయి. అలాగే ఆర్థిక ప్రణాళిక లేకపోతే దీని ఒత్తిడి మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది. కాబ‌ట్టి ఎగ్ ఫ్రీజింగ్‌కు వెళ్లే ముందు ఇవ‌న్నీ అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
జీవనశైలి
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Hair Care: సమ్మర్ హెయిర్ కేర్‌కు సొల్యూషన్..అవకాడోతో బెస్ట్ రిజల్ట్
Recommended image2
Testosterone: యువకుల్లోనే టెస్టోస్టెరాన్ సమస్య..ఎందుకంటే?
Recommended image3
Fatty Liver: సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో ఫ్యాటీ లివర్ ముప్పు..కారణమిదే..
Related Stories
Recommended image1
రూపాయికే అర‌కిలో చికెన్‌.. ఒక్క‌సారిగా ఎగ‌బ‌డుతోన్న జ‌నం. ఎక్క‌డంటే..
Recommended image2
ట్రాఫిక్ సిగ్న‌ల్స్ వ‌ద్ద క‌నిపించే ఈ లెట‌ర్స్ అర్థం ఏంటో తెలుసా.? ఇంత క‌థ ఉందా..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved