ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కనిపించే ఈ లెటర్స్ అర్థం ఏంటో తెలుసా.? ఇంత కథ ఉందా..
Traffic signal: మనకు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర లేదా లైట్ల దగ్గర చిన్న స్క్రీన్లపై ATC, MNL, VAC వంటి అక్షరాలు కనిపిస్తాయి. ఇవి సాధారణంగా ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్‌లో ఉపయోగించే టెక్నికల్ షార్ట్ కోడ్‌లు. మరి వీటి అర్థం ఏంటో తెలుసా.?

ATC అంటే ఏంటి?
ఏటీసీ అంటే అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోల్. దీంట్లో సిగ్నల్ ఆటోమేటిక్‌గా ట్రాఫిక్ బట్టి పనిచేస్తోంది. ఇందులో సెన్సర్లు, కెమెరాలు, AI టెక్నాలజీ ఉంటాయి. రోడ్డుపై వాహనాల సంఖ్య ఆధారంగా సిగ్నల్ టైమింగ్ మారుతుంది. రోడ్డులో వాహనాలు ఎక్కువ ఉంటే గ్రీన్ సిగ్నల్ టైమ్ పెరుగుతుంది. వాహనాలు తక్కువైతే రెడ్/గ్రీన్ టైమ్ తగ్గుతుంది. ఈ విధానం స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు.
MNL అంటే ఏమిటి?
MNL అంటే మాన్యువల్ మోడ్. ఈ విధానంలో సిగ్నల్స్‌ను మాన్యువల్‌గా ఆపరేట్ చేస్తారు. ట్రాఫిక్ పోలీసులు నేరుగా సిగ్నల్స్‌ని కంట్రోల్ చేస్తుంటారు. ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉన్నప్పుడు. వీఐపీ మూమెంట్ ఉన్నప్పుడు, ర్యాలీలు, మతపరమైన వేడుకల సమయంలో ఈ విధానాన్ని ఉపయోగిస్తారు. ఈ సందర్భాల్లో ట్రాఫిక్ పోలీస్ స్వయంగా గ్రీన్, రెడ్, ఆరెంజ్ సిగ్నల్స్‌ను మార్చుతారు.
VAC అంటే ఏమిటి?
వెహికిల్ అక్యుయేటెడ్ కంట్రోల్ విధానంలో.. సిగ్నల్ వాహనాల కదలికను గుర్తించి ఆటోమేటిక్‌గా పనిచేస్తోంది. ఇందులో రోడ్డు మీద ప్రత్యేకమైన మాగ్నెటిక్ లేదా లేజర్ సెన్సర్లు ఉంటాయి. వాహనం సిగ్నల్ దగ్గర ఆగితే సిస్టం గుర్తిస్తుంది. దీంతో ట్రాఫిక్ లేకున్నా రెడ్‌లో ఎక్కువసేపు ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. ఒక దిశలో వాహనాలు లేకపోతే సిగ్నల్ వెంటనే మరో దిశకు మారుతుంది.
ఇవి ఎలా పనిచేస్తాయి?
ట్రాఫిక్ సిగ్నల్స్‌లో ఈ విధమైన కోడ్‌ల వెనుక ఒక సెంట్రలైజ్డ్ కంట్రోల్ రూం ఉంటుంది. అక్కడ కంప్యూటర్ల ద్వారా. కెమెరా ఫుటేజీ, సెన్సర్ ఇన్‌పుట్స్, AI డేటా, ట్రాఫిక్ గణాంకాలను విశ్లేషించి సిగ్నల్ ఎలా పనిచేయాలో నిర్ణయిస్తారు. అవసరమైతే పోలీసులు మాన్యువల్‌గా కూడా మార్చగలరు.

