రాత్రి చేసే ఈ పనులు.. ఏకంగా మీ ఫిట్నెస్ ని దెబ్బ తీస్తాయి తెలుసా..?
కొందరు రాత్రిపూట చేసే కొన్ని పొరపాట్ల కారణంగా.. ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట దినచర్య మీ మొత్తం ఆరోగ్యంపై ప్రధాన ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి.. రాత్రిపూట కొన్ని అలవాట్లు మార్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఓసారి చూద్దామా...

habit
ఆరోగ్యంగా ఉండాలనే తపన పడేవారు చాలా మందే ఉంటారు. ముఖ్యంగా... ఈ కరోనా వచ్చిన తర్వాత... ఆరోగ్యంపై దృష్టి ఎక్కువగానే పెరిగిందనే చెప్పాలి. ఈ క్రమంలో.. ఆరోగ్యకరమైన ఆహారం, మంచి వ్యాయామం పై దృష్టి పెడుతున్నారు. అయితే.. ఎంత ఫిట్నెస్ పై దృష్టిపెట్టి.. కసరత్తులు చేస్తున్నప్పటికీ.. కొందరు రాత్రిపూట చేసే కొన్ని పొరపాట్ల కారణంగా.. ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట దినచర్య మీ మొత్తం ఆరోగ్యంపై ప్రధాన ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి.. రాత్రిపూట కొన్ని అలవాట్లు మార్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఓసారి చూద్దామా...
కాఫీ.. చాలా మందికి కాఫీ తాగడం అంటే ఇష్టం ఎక్కువగా ఉంటుంది. అయితే... ఈ కాఫీని రాత్రిపూట మాత్రం అస్సలు తాగకూడదట. ఇది నిద్రను ఆలస్యం చేయడం లేదా అంతరాయం కలిగించడం ద్వారా నిద్రకు భంగం కలిగించవచ్చు. అందుకే నిద్రవేళకు ముందు కెఫిన్ లేదా ఆల్కహాల్ తీసుకోవడం మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
అతిగా స్క్రీన్ పై దృష్టి పెట్టడం...
ఈ రోజు గడిస్తే.. రేపు కచ్చితంగా వస్తుంది. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ.. చాలా మంది ఏదో జీవితంలో ఇదే చివరి రోజు అన్నట్లుగా.. రాత్రంతా.. అర్థరాత్రుల వరకు వెబ్ సిరీస్ లు, సినిమాలు చూస్తూనే ఉంటారు. అమేజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ తో సమయం గడిపిస్తూనే ఉంటారు. అయితే... అది మంచి అలవాటు కాదని.. నిద్రకు ఆటంకం కలిగించడం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక.. ఆ టీవీలను చూస్తూ.. విపరీతంగా.. తినేస్తూ ఉంటారు. దాని వల్ల కూడా సమస్యలు ఎదుర్కొంటారు. మీ ఫిట్నెస్ దెబ్బ తింటుంది.
పడుకునే ముందు తినడం..
సరిగ్గా భోజనం చేయాల్సిన సమయంలో ఆకలిగా అనిపించలేదు. అని తినరు.. ఇక రాత్రి పడుకునే సమయంలో ఆకలిగా వేసిందంటూ.. జంక్ ఫుడ్స్, స్నాక్స్ తింటూ ఉంటారు. అది ఆరోగ్యానికి మంచిది కాదట. తినగానే నిద్రపోవడం మంచిది కాదని చెబుతున్నారు. భోజనం పూర్తి చేసిన తర్వాత... కనీసం రెండు గంటల తర్వాతే మనం నిద్రపోవాలి అని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా.. రాత్రిపూట మద్యం సేవించడం కూడా మీ ఫిట్నెస్ ని దెబ్బ తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
brushing
బ్రష్ చేయకపోవడం: మీ దంతాలను మీరు అనుకున్నదానికంటే ఎక్కువ శుభ్రపరచడం అవసరం.రోజుకు ఒకసారి వాటిని బ్రష్ చేయడం అందరూ చేస్తారు. కానీ.. రాత్రిపూట కూడా బ్రష్ చేయాలట. ప్రతిరోజూ కనీసం 2 నిమిషాల పాటు పళ్ళు తోముకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఆరోగ్యకరమైన, మెరిసే, బలమైన దంతాల కోసం ఈ అలవాటును రాత్రిపూట దినచర్యలో తప్పనిసరిగా పెంచుకోవాలి.