- Home
- Life
- Health
- మీ గుండె పదిలమేనా? 35 ఏళ్లు దాటిన వారంతా ఏడాదికి ఒక్కసారైనా ఈ పరీక్షలు చేయించుకోవాల్సిందే.
మీ గుండె పదిలమేనా? 35 ఏళ్లు దాటిన వారంతా ఏడాదికి ఒక్కసారైనా ఈ పరీక్షలు చేయించుకోవాల్సిందే.
గుండెపోటు బారిన పడుతోన్న వారి సంఖ్య ఇటీవల ఎక్కువవుతోంది. అప్పటి వరకు ఎంతో చలాకిగా ఉన్న వారు కూడా ఒక్కసారిగా కుప్పకూలి పోతున్నారు. మరీ ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత గుండెపోటు బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే గుండె పోటు బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

గుండెపోటు బారిన పడుతోన్న వారి సంఖ్య ఇటీవల ఎక్కువవుతోంది. అప్పటి వరకు ఎంతో చలాకిగా ఉన్న వారు కూడా ఒక్కసారిగా కుప్పకూలి పోతున్నారు. మరీ ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత గుండెపోటు బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే గుండె పోటు బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
తెలిసిన వారు ఎవరైనా గుండె పోటుతో మరణిస్తే ఒక్కసారిగా ఆందోళన పెరిగిపోతుంది. మనం ఎంత వరకు భద్రంగా ఉన్నామన్న ప్రశ్న తలెత్తడం ఖాయం. దీంతో చాలా మంది జాగ్రత్త పడడం కంటే ఆందోళన చెందడం ఎక్కువుతోంది. అనవసరంగా ఒత్తిడి పెంచుకుంటున్నారు. రకరకాల టెస్టులు చేయించుకుంటూ జేబులు గుల్లా చేసుకుంటున్నారు. అయితే ఏ సమయాల్లో పరీక్షలు చేయించుకోవాలి.? ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలంటే.
ప్రస్తుతం శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోయింది. ఈ స్థానంలో మానసిక ఒత్తిడి పెరుగుతోంది. 30 నుంచి 40 ఏళ్ల మధ్యలోని వారు బీపీ, షుగర్, ఊబకాయం వంటి సమస్యల బారిన పడుతున్నారు. భారతదేశంలో మరణాలకు గుండెపోటు మొదటి స్థానంలో ఉందంటే నమ్ముతారా.? భారత దేశంలో 50 శాతం గుండెపోటు బాధితుల్లో 50 ఏళ్ల లోపు వారే ఉంటున్నారు. అలాగే వీరిలో 25 శాతం మంది 40 ఏళ్ల కంటే తక్కువ వయసు వారు మాత్రమే కావడం ఆందోళన కలిగిస్తోంది.
వైద్యుల సూచనలు..
శారీరకంగా ఎంతో ఫిట్‌గా ఉన్న వారు కూడా గుండెపోటు బారిన పడుతున్నారు. దీంతో ఇంతకీ మన గుండె పదిలంగానే ఉందా అన్న ప్రశ్న రావడం సహజం. అయితే గుండె పనితీరు ఎలా ఉందో తెలుసుకునేందుకు కొన్ని రకాల పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన వారు రెగ్యులర్‌గా ఏడాదికి ఒకసారైనా జీవక్రియలకు సంబంధించిన పరీక్షలతో పాటు ఈసీజీ, 2 డి ఎకో, టీఎంటీ వంటి పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
కాగా కుటుంబంలో గుండెపోటు వచ్చిన వారు ఉంటే 35 ఏళ్ల నుంచే ఏడాదికి ఒకసారి పరీక్షలు చేయించుకుంటే మంచిదని అంటున్నారు. అలాగే ‘సీటీ యాంజియోగ్రామ్’ పరీక్ష కూడా చేయించుకోవాలని సూచిస్తున్నారు. దీని రిజల్ట్ నార్మల్‌గా ఉంటే ఐదేళ్ల వరకు మళ్లీ పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. మిగిలిన పరీక్షలను మాత్రం ఏడాదికోసారి చేయించుకోవాలని అంటున్నారు.
సాధారణంగా యాంజియోగ్రామ్‌లో రక్తనాళంలోకి కాథటర్‌ను ప్రవేశపెట్టి గుండె రక్తనాళాల్లో పూడికలను పరీక్షిస్తారు. పూడికలు ఉంటే గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుందని కాబట్టి ఏమైనా పూడికలు ఉంటే వెంటనే స్టంట్ వేస్తారు. అయితే సిటీ యాంజియో పదేపదే చేసుకోవడం కూడా మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక సిటీ యాంజియో స్కాన్ టీ 20 ఎక్స్‌రేలతో సమానమని అంటున్నారు.
జాగ్రత్తలు తప్పనిసరి..
ఇక గుండెపోటు బారిన పడకుండా ఉండాలంటే తీసుకునే ఆహారంతో పాటు జీవన విధానంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నూనె తక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలని సూచిస్తున్నారు. అదే విధంగా ఒకే చోట ఎక్కువసేపు కూర్చొకూడదని, వాకింగ్ కచ్చితంగా అలవాటు చేసుకోవాలని అంటున్నారు. ఇక ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఫుండే ఫుడ్ తీసుకోవాలి. ఇక మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు యోగా, మెడిటేషన్ వంటి వాటిని కచ్చితంగా అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.