Health Tips: కడుపు మంట నుంచి ఉపశమనం పొందాలంటే.. వెంటనే ఈ ఆహారాన్ని తినండి!
HealthTips : చాలామందికి కడుపు మంట అనేది వేడి వల్ల, ఇతరత్రా కారణాలవల్ల వస్తుంది. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను వెంటనే తినటం వలన కడుపు మంట నుంచి ఉపశమనం పొందవచ్చు అంటున్నారు వైద్యులు. అది ఎలాగో చూద్దాం.
సాధారణంగా కడుపులో మంట శరీరానికి వేడి చేసినప్పుడు లేదా మనకి సరిపడని ఆహార పదార్థాలు తిన్నప్పుడు, తిన్నది సరిగ్గా అరగనప్పుడు ఇలా చాలా కారణాలవల్ల కడుపులో మంటగా అనిపిస్తుంది. అయితే మంట లేదా వేడి శరీరంలోని అనేక వ్యాధులను కలిగిస్తుంది. అలాగే శరీరాన్ని డిహైడ్రేషన్ కి గురిచేస్తుంది.
కడుపులో మంటగా ఉన్నప్పుడు మనం వేయించిన ఆహారాన్ని అసలు తినకూడదు. పొట్టతో పాటు శరీరం కూడా చల్లగా ఉండి శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచే కొన్ని రకాల ఆహార పదార్థాలను ఇప్పుడు చూద్దాం. పుచ్చకాయ లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.
ఈ పండు శరీరాన్ని చాలా సమయం పాటు చల్లగా ఉండటానికి సహాయపడుతుంది, ఇందులో ఉండే లైకోపీన్ చర్మాన్ని ఎండ దెబ్బ తినకుండా కాపాడుతుంది. ఇది తిన్న వెంటనే మీకు ఆకలి అనిపించదు. అలాగే పనస పండు కూడా శరీరానికి చలవ చేస్తుంది.
ఈ పండులో మీ శరీరాన్ని చల్లదనంతో నింపడంలో ఉపయోగపడే అనేక రకాల ఖనిజాలు, విటమిన్లు ఉన్నాయి. ఇందులో ఉండే విటమిన్ సి శరీరం యొక్క రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. అలాగే దోసకాయలో కూడా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.
మరియు పోషకాలతో నిండి ఉంటుంది ఇది మీ కడుపుని చల్లబరించడానికి ఒక మంచి ఆహారం. అలాగే దోసకాయలో పీచు ఎక్కువగా ఉంటుంది దీని వలన జీర్ణ క్రియ బాగా జరిగి మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇది శరీరంలోని నీటి శాతాన్ని పెంచుతుంది. దోసకాయ తినటం వల్ల శరీరం చల్లగా ఉంటుంది.
మరియు వేడి నుంచి మీ పొట్టను చల్లగా ఉంచుతుంది. పెరుగు లేదా మజ్జిగ కూడా శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. క్యాల్షియం పుష్కలంగా ఉన్న పెరుగు కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.