MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Skin care: శనగ పిండిలో ఈ 4 కలిపి రాస్తే ముఖంపై మొటిమలు, మచ్చలు, నలుపు మాయం!

Skin care: శనగ పిండిలో ఈ 4 కలిపి రాస్తే ముఖంపై మొటిమలు, మచ్చలు, నలుపు మాయం!

ముఖం అందంగా మెరిసిపోవాలని ఎవరు కోరుకోరు చెప్పండి. మరీ ముఖ్యంగా అమ్మాయిలు. అందమైన ముఖం కోసం వారు చేయని ప్రయత్నాలు ఉండవు. రకరకాల ఫేస్ ప్యాక్ లు, క్రీమ్ లు ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటారు. కానీ శనగ పిండిలో ఈ 4 కలిపి ఎప్పుడైనా ట్రై చేశారా? ఇవి ముఖానికి రాస్తే అందం రెట్టింపు అవడం ఖాయం. మరి ఆ పదార్థాలెంటో ఓసారి తెలుసుకుందామా..

2 Min read
Author : Kavitha G
Published : Apr 22 2025, 05:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

శనగ పిండి చర్మ ఆరోగ్యానికి ఎంతమంచిదో అందరికీ తెలుసు. ఈ పిండిలో కొన్ని పదార్థాలు కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవడం ద్వారా చాలా రకాల చర్మ సమస్యలను దూరం చేసుకోవడంతో పాటు ముఖం అందాన్ని పెంచుకోవచ్చు. అవెంటో ఇక్కడ చూద్దాం.

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
శనగ పిండిని ఎలా ఉపయోగించాలి?

శనగ పిండిని ఎలా ఉపయోగించాలి?

శనగ పిండి సాయంతో ముఖంపై మొటిమలు, మచ్చలను సులభంగా తొలగించవచ్చు. అంతేకాదు ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. శనగపిండిని ఉపయోగించి ముఖాన్ని ఎలా అందంగా మార్చుకోవాలో ఇక్కడ చూద్దాం.

 

36
శనగపిండి, నిమ్మరసం

శనగపిండి, నిమ్మరసం

2 స్పూన్ల శనగపిండిలో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖమంతా పట్టించి 20 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ ముఖంలోని నల్ల మచ్చలు, నలుపును తగ్గించడంలో సహాయపడుతాయి. ఈ ఫేస్ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు ఉపయోగించవచ్చు.

46
శనగపిండి, పెరుగు

శనగపిండి, పెరుగు

2 లేదా 3 స్పూన్ల శనగపిండితో 2 స్పూన్ల పెరుగు కలిపి ఆ పేస్ట్‌ను ముఖమంతా పట్టించి బాగా ఆరిన తర్వాత ముఖాన్ని నీటితో కడుక్కోవాలి.ఈ ఫేస్ ప్యాక్ ముఖంలోని మొటిమలు, నల్ల మచ్చలు, మచ్చల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ ఫేస్ ప్యాక్‌ను వారానికి ఒకటి లేదా రెండుసార్లు వేసుకోవచ్చు.

 

56
శనగపిండి, రోజ్ వాటర్

శనగపిండి, రోజ్ వాటర్

ఒక స్పూన్ శనగపిండితో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ముఖానికి పట్టించి బాగా ఆరిన తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఈ ఫేస్ ప్యాక్ మీ ముఖాన్ని ప్రకాశవంతంగా, అందంగా మార్చడంలో సహాయపడుతుంది. ఇది ముఖాన్ని తేమగా, మృదువుగా ఉంచుతుంది. ఈ ఫేస్ ప్యాక్ అన్ని స్కిన్ టోన్లకు సరిపోతుంది. ఇది ముఖ్యంగా పొడి చర్మానికి బాగా పనిచేస్తుంది.

66
శనగపిండి, పచ్చిపాలు

శనగపిండి, పచ్చిపాలు

2 స్పూన్ల శనగపిండిలో 3-5 స్పూన్ల పచ్చిపాలు కలిపి ముఖం, మెడకు పట్టించి బాగా ఆరిన తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. పచ్చిపాలు చర్మంపై పేరుకుపోయిన దుమ్ము, ధూళిని సులభంగా తొలగిస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ ముఖాన్ని ప్రకాశవంతంగా, మృదువుగా మార్చడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా ఇది చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. ఈ ఫేస్ ప్యాక్‌ను మీరు వారానికి 1-2 సార్లు వేసుకోవచ్చు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
సౌందర్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mangoes: అతిగా మామిడి పండ్లు తింటే లావవుతారా?
Recommended image2
Mangoes: మామిడి పండ్లు తింటే ఒంట్లో వేడి చేస్తుందా? ఎక్కువ తింటే ఏమవుతుంది?
Recommended image3
Sugar: శరీరంలో చక్కెర మోతాదు పెరిగితే పేగుల్లో జరిగేది ఇదే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved