Vitamin D Deficiency ఓరినాయనో.. విటమిన్ డి లోపంతో ఇన్ని సమస్యలా?
వివిధ రకాల విటమిన్ల లోపంతో మనకు వివిధ రకాల సమస్యలు వస్తాయి. విటమిన్ డి సైతం మనం శరీరానికి అత్యవసరమైంది. మెదడు పనితీరు సక్రమంగా ఉండాలంటే ఈ విటమిన్ చాలా అవసరం. అంతేకాదు, విటమిన్ డి లోపిస్తే శరీరంలో చాలా సమస్యలు వస్తాయి. విటమిన్ డి మన శరీరానికి చాలా ముఖ్యం. ఇది లోపిస్తే.. వచ్చే సమస్యలు ఏంటంటే..

మాటిమాటికీ కోపం..
విటమిన్ డి లోపం వల్ల శరీరంలో చాలా సమస్యలు వస్తాయి. వాటి లక్షణాలు కింద ఉన్నాయి. మాటిమాటికీ కోపం రావడం లేదా ఎప్పుడూ మూడీగా ఉండటానికి విటమిన్ డి లోపం ఒక కారణం కావచ్చు.
ఎముకలు బలహీనంగా అవ్వడం: వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనంగా మారుతాయి. దీనివల్ల నొప్పులు వస్తాయి. అడుగు తీసి అడుగు వేయలేం. చిన్న చిన్న ప్రమాదాలకే ఎముకలు విరిగిపోతాయి.
రోగనిరోధక శక్తి తగ్గడం: రోగనిరోధక శక్తిని పెంచడానికి విటమిన్ డి చాలా అవసరం. ఇది లోపిస్తే శరీరం తరచూ అనారోగ్యాలకు గురవుతుంటుంది. తరచుగా వైరల్ జ్వరం, జలుబు, దగ్గు వస్తుంటే విటమిన్ డి లోపం ఉండవచ్చు.
కండరాలలో నొప్పి: ప్రతిరోజూ కండరాలు, భుజాలు, తొడలు, చేతుల్లో నొప్పి ఉంటే విటమిన్ డి లోపం కావచ్చు. జుట్టు, చర్మ సమస్యలు: విటమిన్ డి లోపం వల్ల జుట్టు, చర్మానికి కూడా హాని కలుగుతుంది. విటమిన్ డి లోపం వల్ల మానసిక కుంగుబాటు, ఆందోళన, నిద్రలేమి, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు వస్తాయి.
మీకు ఈ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా డాక్టర్ సలహా తీసుకోండి, విటమిన్ డి పరీక్ష చేయించుకోండి. విటమిన్ డి శరీరంలో కాల్షియం, ఫాస్పరస్ శోషణను నియంత్రిస్తుంది. కాబట్టి ఈ పరీక్ష చేయించుకోండి. గుర్తుంచుకోండి, విటమిన్ డి మన శరీరానికి చాలా ముఖ్యం. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత విటమిన్ డి తీసుకోండి. కొంతసేపు ఎండలో నడవడం, విటమిన్ డి ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఈ లోపాన్ని సరిచేయవచ్చు.