ధగధగా మెరిసే చర్మం కావాలా? మార్కెట్ లోకి లేటెస్ట్ గా వచ్చిన ఈ ట్రీట్మెంట్ ట్రై చేయండి
Red Light Therapy: చర్మ సౌందర్యాన్ని పెంచి, వయసు ప్రభావం కనిపించకుండా చేస్తే కొత్త ట్రీట్ మెంట్ మార్కెట్ లో హల్ చల్ చేస్తోంది. సెలబ్రిటీలు కూడా చేయించుకుంటున్న ఈ రెడ్ లైట్ థెరపీ వల్ల కలిగే ప్రయోజనాల గురించి డీటైల్డ్ గా తెలుసుకుందాం రండి.

ట్రీట్ మెంట్ ఎలా చేస్తారంటే..
రెడ్‌లైట్ థెరపీ అనేది శరీర సౌందర్యాన్ని పెంచే ఆధునిక వైద్య పద్ధతి. ఈ పద్ధతిలో తక్కువ వేవ్ లెన్త్(తరంగదైర్ఘ్యాలు) కలిగిన ఎరుపు కాంతిని చర్మంపై ప్రయోగిస్తారు. దీని వల్ల చర్మపు ముడతలు, మచ్చలు, గీతలు తగ్గిపోవడమే కాకుండా చర్మ కణజాలం పునరుత్పత్తి జరుగుతుంది.
మెరిసే చర్మం కావాలా?
ఈ థెరపీ ముఖ్యంగా చర్మానికి మెరుపు ఇస్తుంది. ముడతలను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. కాలజెన్ ఉత్పత్తిని పెంచేందుకు ఈ థెరపీ చేస్తారు. చర్మాన్ని మెరుస్తూ ఉండేలా చేయడానికి ఇది సహాయపడుతుంది. దీన్ని స్కిన్ కేర్ చికిత్సలలో భాగంగా ఉపయోగించడమే కాకుండా, నూతన సౌందర్య పరికరాల్లో భాగంగా కూడా వినియోగిస్తున్నారు.
సెలబ్రిటీలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు..
ప్రస్తుతం మార్కెట్లో ప్రత్యేకమైన మాస్క్ రూపంలోని రెడ్‌లైట్ పరికరాలు లభ్యమవుతున్నాయి. మహిళలు, మేకప్ ఆర్టిస్టులు, సెలబ్రిటీలు విస్తృతంగా వీటిని ఉపయోగిస్తున్నారు. ఈ మాస్కులు ముఖం మొత్తానికి సమానంగా కాంతిని ప్రసరింపజేస్తాయి. లోతైన చర్మ పొరలకు వెళ్లి పని చేస్తాయి. దాంతో పాటు చర్మంపై డస్ట్, దుమ్మును తగ్గిస్తుంది. ఫలితంగా చర్మం చాలా ఆరోగ్యంగా ఉంటుంది.
అనేక సమస్యలకు చెక్ చెప్పే థెరపీ ఇది
ఈ థెరపీని డెర్మటాలజిస్ట్‌లు కూడా ముడతలు తొలగించేందుకు ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా ఎక్నే సమస్యలను తగ్గించేందుకు కూడా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా దీని వల్ల చర్మంలో అనేక మార్పులు కనిపిస్తాయి. ప్రస్తుతం లేటెస్ట్ బ్యూటీ ట్రీట్మెంట్స్ లో ఇది ప్రధాన స్థానం సంపాదించుకుంది. ఇది ఫిజికల్ చికిత్సల్లో కూడా ఉపయోగపడుతుంది.
రెడ్ లైట్ థెరపీతో వృద్ధాప్యం త్వరగా రాదు
రెడ్‌లైట్ థెరపీ మానవ చర్మ కణాలకు నేరుగా ప్రభావం చూపిస్తూ కాలజెన్ స్థాయిని పెంచుతుంది. దీనివల్ల వృద్ధాప్యం తగ్గుతుంది. చిన్న వయసులో వృద్ధాప్య సమస్యలు వచ్చి బాధపడే వారికి వైద్యులు ఈ థెరపీ ద్వారా నయం చేస్తారు.
రెడ్‌లైట్ థెరపీ ఇటీవల వేగంగా గుర్తింపు పొందిన బ్యూటీ ట్రీట్మెంట్. ఆరోగ్యంతో పాటు ఆకర్షణీయ చర్మాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.