Headache: ఉదయం లేవగానే తలనొప్పి బాధిస్తోందా..? కారణాలు ఇవే..!
Headache: ప్రతిరోజూ ఉదయం లేవగానే తలనొప్పి వస్తోందా? ట్యాబ్లెట్ వేసుకోనిది ఆ నొప్పి తగ్గడం లేదా? ఇలాంటి నొప్పిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు చెబుతున్నారు.

తలనొప్పి..
తలనొప్పి కామన్ గా అందరికీ వచ్చే సమస్యే. కానీ... కొందరిని చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఉదయం లేవగానే తలనొప్పి వచ్చేసిందని తల పట్టుకొని కూర్చొంటారు. రాత్రి సరిగా నిద్రపోకపోతే తలనొప్పి రావడం ఒకే.. కానీ మంచిగా నిద్రపోయిన తర్వాత కూడా తలనొప్పి వస్తుంది అంటే, అది కూడా రెగ్యులర్ గా వస్తుంది అంటే.. నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.
ఇలా తలనొప్పి రావడానికి, కొన్నిసార్లు నిద్రలేమి, అధిక మానసిక ఒత్తిడి, మైగ్రేన్ , డీ హైడ్రేషన్, స్లీప్ అప్నియా వంటి అనేక కారణాలు కూడా తలనొప్పికి దారితీస్తాయి. నిద్ర లేచిన వెంటనే మెదడు సున్నితత్వం పెరగడం వల్ల కూడా ఉదయం తలనొప్పి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అసలు ఉదయం లేవగానే తలనొప్పి రావడం వెనక కారణాలేంటో ఓసారిచూద్దాం...
తలనొప్పి కారణాలు...
హై బీపీ...
ప్రతిరోజూ ఉదయం మీకు తలనొప్పి వస్తూ ఉంటే, మీ బీపీని తనిఖీ చేయించుకోవడం చాలా మంచిది. హై బీపీ ఉన్నవారికి కూడా ఇలా జరగొచ్చు.
రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోతే
రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోయినా మెదడులో ఒత్తిడి పెరుగుతుంది, ఇది ఉదయం తలనొప్పిని మరింత తీవ్రతరం చేస్తుంది.
ఒత్తిడి , మానసిక ఆందోళన
అధిక ఒత్తిడి వల్ల కండరాలు, ముఖ్యంగా మెడ , భుజాలలోని కండరాలు బిగుసుకుపోతాయి. ఇది రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది, దీనివల్ల ఉదయం నిద్రలేవగానే టెన్షన్ తరహా తలనొప్పి వస్తుంది.
ఇవి కూడా కారణం కావచ్చు...
మైగ్రేన్ సమస్యలు
మైగ్రేన్‌తో బాధపడేవారిలో ఉదయం తలనొప్పి సర్వసాధారణం. నిద్రలేమి, ప్రకాశవంతమైన కాంతి, మారుతున్న వాతావరణం , ఖాళీ కడుపుతో నిద్రపోవడం వంటివి మైగ్రేన్‌ను ప్రేరేపిస్తాయి, దీనివల్ల ఉదయం తీవ్రమైన నొప్పి వస్తుంది.
స్లీప్ అప్నియా
స్లీప్ అప్నియా వల్ల నిద్రలో శ్వాస మధ్యమధ్యలో ఆగిపోతుంది, దీనివల్ల శరీరానికి తగినంత ఆక్సిజన్ అందదు. ఇది నిద్రలేచినప్పుడు తీవ్రమైన తలనొప్పి, మైకం , నీరసానికి కారణమవుతుంది.
డీహైడ్రేషన్ సమస్య ఉంటే
రాత్రిపూట నీరు తాగకపోవడం , శరీరంలో ద్రవాల స్థాయి తక్కువగా ఉండటం వల్ల రక్తనాళాలు సంకోచిస్తాయి, ఇది మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకుండా చేసి తలనొప్పికి కారణమవుతుంది.
ఆల్కహాల్ లేదా కెఫీన్ ప్రభావాలు
రాత్రిపూట ఆల్కహాల్ తాగడం లేదా అధిక కెఫీన్ ఉన్న పానీయాలు సేవించడం వల్ల నిద్ర సమస్యలు వస్తాయి. నిద్ర పట్టడం కష్టమవుతుంది. దీని కారణంగా ఉదయాన్నే నిద్రలేచినప్పుడు తలనొప్పి రావచ్చు.

