MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Life
  • Health
  • గ‌ర్భిణీలు పారాసిట‌మాల్ వేసుకుంటే పిల్ల‌లు ఆటిజంతో పుడుతారా.? అధ్య‌య‌నంలో తేలిన నిజం

గ‌ర్భిణీలు పారాసిట‌మాల్ వేసుకుంటే పిల్ల‌లు ఆటిజంతో పుడుతారా.? అధ్య‌య‌నంలో తేలిన నిజం

Pregnancy: గర్భధారణ సమయంలో ఏదైనా ట్యాబ్లెట్ వేసుకోవాలంటే గ‌ర్భిణీలు భ‌యంతో ఉంటారు. ముఖ్యంగా పారాసిటమాల్ ట్యాబ్లెట్‌ తీసుకుంటే పుట్టబోయే బిడ్డకు ఆటిజం వచ్చే ప్రమాదం ఉంటుంద‌నే వార్త వైర‌ల్ అవుతోంది. తాజా పరిశోధన వీటికి చెక్ పెట్టింది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Apr 19 2026, 10:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కొత్త పరిశోధన ఏమి చెబుతోంది?
Image Credit : Gemini AI

కొత్త పరిశోధన ఏమి చెబుతోంది?

ది లాన్సెట్ ఆబ్స్టెట్రిక్స్, గైన‌కాల‌జీ అండ్ ఉమెన్స్ హెల్త్‌లో ప్రచురితమైన తాజా పరిశోధన ప్రకారం, గర్భధారణ సమయంలో సరైన విధంగా పారాసిటమాల్ తీసుకోవడం వల్ల పిల్లల్లో ఆటిజం, ADHD లేదా మానసిక అభివృద్ధి సమస్యలు వచ్చే ప్రమాదానికి నేరుగా సంబంధం లేదని తేలింది. ఈ స్టడీ చాలా పెద్దది, నమ్మదగినది అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఈ స్టడీ ఎలా నిర్వహించారు?
Image Credit : Getty

ఈ స్టడీ ఎలా నిర్వహించారు?

ఈ పరిశోధనలో మొత్తం 43 క్లినికల్ స్టడీలను విశ్లేషించారు. అలాగే స్వీడన్‌లో సుమారు 25 లక్షల పిల్లల డేటాను కూడా పరిశీలించారు. శాస్త్రవేత్తలు “సిబ్లింగ్ కంపారిజన్” అనే పద్ధతిని ఉపయోగించారు. అంటే ఒకే తల్లి నుంచి పుట్టిన పిల్లల్లో ఒక గర్భధారణలో పారాసిటమాల్ వాడిన సందర్భం, మరొక గర్భధారణలో వాడని సందర్భాన్ని పోల్చారు. ఫలితంలో తేలిన దాని ప్ర‌కారం ఇద్ద‌రు పిల్లల్లో కూడా ఆటిజం లేదా ఇతర మానసిక సమస్యల ప్రమాదంలో ఎలాంటి తేడా కనిపించలేదు.

35
అంత‌కు ముందు అధ్య‌య‌నాల్లో గంద‌రోళం
Image Credit : Getty

అంత‌కు ముందు అధ్య‌య‌నాల్లో గంద‌రోళం

ఇంతకు ముందు కొన్ని పరిశోధనల్లో పారాసిటమాల్ వాడకానికి, ఆటిజం మధ్య కొంత సంబంధం ఉన్నట్టు కనిపించింది. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్పిన వివ‌రాల ప్రకారం పారాసిటమాల్ తీసుకున్న మహిళలకు ఇప్పటికే జ్వరం, నొప్పి లేదా ఇన్ఫెక్షన్ ఉండి ఉంటుంది. ఈ సమస్యలే పిల్లల అభివృద్ధిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే దీనికి జన్యు (Genetic) కారణాలు కూడా పాత్ర పోషిస్తాయి. ఈ కారణాల వల్లే అప్పట్లో తప్పు అర్థం చేసుకున్నారు.

45
నిపుణులు ఏమంటున్నారు?
Image Credit : AI-generated

నిపుణులు ఏమంటున్నారు?

వైద్య నిపుణుల ప్రకారం, పారాసిటమాల్ ఇప్పటికీ గర్భిణీలకు సురక్షితమైన నొప్పి నివారణ మందులలో ఒకటి. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కూడా దీనిని అవసరమైన ముఖ్యమైన మందుల జాబితాలో చేర్చింది. ఇది NSAIDs లేదా ఓపియాయిడ్ మందుల కంటే ఎక్కువ సురక్షితం. అయితే తక్కువ మోతాదులో, అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడాలి.

55
మందు తీసుకోకపోతే ప్రమాదమా?
Image Credit : stockPhoto

మందు తీసుకోకపోతే ప్రమాదమా?

కొంతమంది మహిళలు భయంతో మందులు తీసుకోవడం మానేస్తారు. కానీ ఇది మరింత ప్రమాదకరం కావచ్చు.

జ్వరం తగ్గించకపోతే గర్భస్రావం ప్రమాదం, ముందస్తు ప్రసవం (Preterm Birth), పుట్టే బిడ్డలో ఆరోగ్య సమస్యలు వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. అందుకే డాక్టర్ సలహా తీసుకుని చికిత్స చేయించుకోవడం చాలా ముఖ్యం. గ‌ర్భిణీలు నిజంగా అవసరం ఉన్నప్పుడు మాత్రమే పారాసిటమాల్ వాడాలి. తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి. మీ ఇష్టం ప్రకారం ఎక్కువ మోతాదులో తీసుకోకండి.

గ‌మ‌నిక‌: గర్భధారణ సమయంలో సరైన విధంగా పారాసిటమాల్ వాడితే బిడ్డకు ఆటిజం వస్తుందని చెప్పడానికి ఎలాంటి బలమైన ఆధారాలు లేవు. కాబట్టి భయపడకుండా, కానీ జాగ్రత్తగా డాక్టర్ సలహాతో మాత్రమే మందులు వాడటం మంచిది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
జీవనశైలి
ఆరోగ్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Recommended image2
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image3
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Related Stories
Recommended image1
Free Train: హైద‌రాబాదీల‌కు ఉచితంగా రైలు ప్ర‌యాణం.. దెబ్బ‌కు ట్రాఫిక్ స‌మ‌స్య మాయం
Recommended image2
Hyderabad: ఇక హైద‌రాబాద్ రియ‌ల్ ఎస్టేట్ అంతా అటు వైపే.. కొన‌డానికి ఇదే స‌రైన స‌మ‌యం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved