తరిగిన ఉల్లిపాయలను ఫ్రిడ్జీ లో పెడుతున్నారా? ఈ వ్యాధులొస్తయ్ జాగ్రత్త..
కొన్ని ఆహార పదార్థాలను ఫ్రిజ్ లో అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే ఈ ఆహారపదార్థాలు విషతుల్యంగా మారి మన ఆరోగ్యాన్ని రిస్క్ లో పడేస్తాయని నిపుణులు అంటున్నారు. ఇలాంటి వాటిలో తరిగిన ఉల్లిపాయలు కూడా ఉన్నాయి.
టీవీ లేని ఇల్లు ఎలా అయితే లేదో.. ఈ కాలంలో ఫ్రిడ్జి లేని ఇళ్లను కూడా మనం చూడలేం. నిజానికి ఫ్రిడ్జి మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. వీటిలో పండ్లు, కూరగాయలను, ఇతర ఆహార పదార్థాలను నిల్వ చేస్తుంటాం. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను మాత్రం నిల్వ చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. చాలా మందికి వండిని ఆహారాలను ఫ్రిడ్జిలో పెట్టి రెండు మూడు రోజుల పాటైనా తినే అలవాటు ఉంటుంది. కానీ ఇది మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.
ఫ్రిడ్జిలో మిగిలిపోయిన ఆహార పదార్థాల నుంచి కొత్తగా కొన్న కూరగాయల వరకు ఎన్నో పెడుతుంటాం. అయితే తాజా కూరగాయలతో కూడిన కొన్ని ఆహార పదార్థాలను ఫ్రిజ్ లో అస్సలు ఉంచకూడదంటారు నిపుణులు.ఎందుకంటే ఇలా చేస్తే అవి విషతుల్యంగా మారుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇలాంటి వాటిలో తరిగిన ఉల్లిపాయ కూడా ఉంది. అసలు తరిగిన ఉల్లిపాయలను ఫ్రిడ్జిలో పెట్టడం వల్ల ఎలాంటి సమస్యలొస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
సంక్రమణ
తరిగిన ఉల్లిపాయలను ఫ్రిడ్జిలో పెట్టడం వల్ల బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. వీటిని తినడం వల్ల మనకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. అంతేకాదు తరిగిన ఉల్లిపాయలను ఫ్రిడ్జిలో ఉంచడం వల్ల దుర్వాసన వస్తుంది. ఆ వాసన ఫ్రిజ్ లో ఉంచిన ఇతర ఆహార పదార్థాలకు కూడా వ్యాపిస్తుంది. ఫలితంగా అవి రుచిని కోల్పోతాయి.
పోషక విలువలు తగ్గుతాయి
తరిగిన ఉల్లిపాయల్లో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని ఫ్రిడ్జి లో పెట్టడం వల్ల ఉల్లిపాయలు మెత్తగా మారుతాయి. ఎక్కువ తేమకు గురికావడం వల్ల వ్యాధికారక క్రిములు వాటికి అంటుకుంటాయి. అలాగే ఉల్లిపాయల్లో ఉండే పోషక విలువలు కూడా తగ్గుతాయి. ఇవి బ్యాక్టీరియా పెరుగుదలకు దారితీస్తాయి. తరిగిన ఉల్లిపాయలలో ఫ్రిడ్జ్ చల్లని ఉష్ణోగ్రతతో పనిచేసే ఎంజైమ్లు ఉంటాయి. ఈ ప్రతి చర్యలు ప్రతి ఒక్కటి సల్ఫర్ సమ్మేళనాలు ఏర్పడటానికి దారితీస్తాయి. ఎందుకంటే ఉల్లిపాయల్లో సల్ఫర్ ఉంటుంది. ఈ ఉల్లిపాయలు వంట చెడువాసన వచ్చే లా చేస్తుంది. అలాగే కూర చేదుగా అవుతుంది.
ఉల్లిపాయల పొట్టు తీయకండి
ఉల్లిపాయలను కట్ చేసి నిల్వ చేసినప్పుడు వాటి పొట్టును తీసేయడం వల్ల మరొక ప్రమాదం వచ్చే అవకాశం కూడా ఉంది. ఉల్లిపొట్టును తీసేస్తే దాని నుంచి ఎన్నో రకాల రసాయనాలు విడుదలవుతాయి. ఇవి బ్యాక్టీరియాను ఆకర్షించే పోషకాలుగా మారి వాటి పెరుగుదలకు కారణమవుతాయి. ఉల్లిపాయలను ఫ్రిజ్లో 40 డిగ్రీల ఫారెన్హీట్ లేదా 4.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఉంచడం ఉత్తమ మార్గం.