MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Health
  • Intermittent Fasting: 16 గంటలు ఫుడ్ తినకపోతే శరీరంలో ఏం జరుగుతుంది? మంతెన ఏం చెప్పారో తెలుసా?

Intermittent Fasting: 16 గంటలు ఫుడ్ తినకపోతే శరీరంలో ఏం జరుగుతుంది? మంతెన ఏం చెప్పారో తెలుసా?

అధిక బరువు, ఆరోగ్యంపై శ్రద్ధ, ఇతర కారణాల వల్ల చాలామంది ఫాస్టింగ్‍ వైపు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‍ని ఫాలో అవుతున్నారు. కానీ 16 గంటలు ఏం తినకపోతే శరీరంలో ఏం జరుగుతుంది? ఇది ఆరోగ్యానికి మంచిదా? కాదా? మంతెన ఏం చెప్పారో చూద్దాం.

1 Min read
Author : Kavitha G
Published : Apr 22 2026, 01:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ప్రయోజనాలు
Image Credit : AI

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ప్రయోజనాలు

ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న ప్రస్తుత కాలంలో చాలామంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ విధానాన్ని అనుసరిస్తున్నారు. దాదాపు 16 గంటలపాటు ఆహారం తీసుకోకుండా ఉండే ఈ పద్ధతి వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? అసలు ఈ విధానం ఆరోగ్యానికి మంచిదా? లేక ప్రమాదమా? దీనిపై ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ రాజు ఏం చెప్పారో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
16 గంటలు ఫుడ్ తినకపోతే..
Image Credit : Getty

16 గంటలు ఫుడ్ తినకపోతే..

మంతెన ప్రకారం.. 16 గంటలు ఆహారం తీసుకోకుండా ఉంటే శరీరంలో గ్లూకోజ్ నిల్వలు తగ్గి, శరీరం.. నిల్వ ఉన్న కొవ్వును ఎనర్జీగా ఉపయోగించడం మొదలు పెడుతుంది. దీనివల్ల బరువు తగ్గడం ప్రారంభమవుతుంది. అలాగే శరీరంలో ఆటోఫాజీ అనే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఇందులో పాత, దెబ్బతిన్న కణాలు తొలగిపోయి, కొత్త కణాలు ఏర్పడతాయి. దీనివల్ల శరీర శుద్ధి జరుగుతుంది. మనం తినే ఆహారానికి సరైన విరామం ఇవ్వడం వల్ల జీర్ణవ్యవస్థకు విశ్రాంతి లభిస్తుంది. ఇది శరీర ఆరోగ్యానికి చాలా ముఖ్యమని మంతెన చెబుతున్నారు.

34
ఈ సమస్యలు వచ్చే అవకాశం
Image Credit : our own

ఈ సమస్యలు వచ్చే అవకాశం

అయితే 16 గంటలు ఆహారం తీసుకోకపోవడం అందరికీ సెట్ కాకపోవచ్చు. మొదటిసారి ప్రయత్నించే వారికి కాస్త తలనొప్పి, అలసట, బలహీనంగా అనిపించవచ్చు. శరీరం అలవాటు పడే వరకు ఈ లక్షణాలు కనిపించడం సహజం. మంతెన ప్రకారం, ఉపవాసం చేసే సమయంలో నీళ్లు, జ్యూసులు, లేదా సహజ పానీయాలు తీసుకోవడం ద్వారా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. అలాగే ఉపవాసం ముగిసిన తర్వాత తేలికపాటి, సహజ ఆహారం తీసుకోవడం మంచిది. ఒకేసారి ఎక్కువగా తినడం జీర్ణ సమస్యలకు దారి తీస్తుంది.

44
సరైన పద్ధతిలో చేస్తే..
Image Credit : Getty

సరైన పద్ధతిలో చేస్తే..

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ విధానం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండవచ్చు. అయితే ఇప్పటికే డయాబెటిస్ ఉన్నవారు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహాతో మాత్రమే ఈ విధానాన్ని అనుసరించాలి. మంతెన సూచన ప్రకారం.. 16 గంటల ఫాస్టింగ్ సరైన పద్ధతిలో, శరీరానికి అనుగుణంగా చేస్తే ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
చిట్కాలు మరియు ఉపాయాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image2
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Recommended image3
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Related Stories
Recommended image1
Gardening Tips: ఇంట్లో ఈ 5 మొక్కలుంటే అందానికి అందం.. ఆరోగ్యానికి ఆరోగ్యం!
Recommended image2
Vastu Tips For Morning: ఉదయం నిద్ర లేవగానే అస్సలు చేయకూడని 5 పనులు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved