MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Gardening
  • Gardening Tips: ఇంట్లో ఈ 5 మొక్కలుంటే అందానికి అందం.. ఆరోగ్యానికి ఆరోగ్యం!

Gardening Tips: ఇంట్లో ఈ 5 మొక్కలుంటే అందానికి అందం.. ఆరోగ్యానికి ఆరోగ్యం!

మొక్కలు పెంచడాన్ని చాలామంది ఇష్టపడతారు. మనం ఇంట్లో పెంచుకునే మొక్కలు ఇంటికి అందాన్ని ఇవ్వడమే కాదు.. స్వచ్ఛమైన గాలిని కూడా అందిస్తాయి. ముఖ్యంగా 5 రకాల మొక్కలు ఇంట్లో ఉంటే అందానికి అందం, ఆరోగ్యానికి ఆరోగ్యం అంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Apr 21 2026, 05:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Air Purifying Indoor Plants
Image Credit : Gemini AI

Air Purifying Indoor Plants

ప్రస్తుత రోజుల్లో బయటి గాలితో పోలిస్తే ఇంట్లో గాలే ఎక్కువ రెట్లు కలుషితమై ఉంటోందనే విషయం మీకు తెలుసా? అవును.. ఫర్నిచర్ పెయింట్స్, క్లీనింగ్ వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వచ్చే విష పదార్థాలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే కొన్ని రకాల  మొక్కలను ఇంట్లో పెంచుకోవడం ద్వారా స్వచ్చమైన గాలితో పాటు ఇంటి అందాన్ని కూడా పెంచుకోవచ్చని చెబుతున్నారు. మరి ఆ మొక్కలేంటో వాటి వల్ల కలిగే లాభాలేంటో ఇక్కడ చూద్దాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
స్నేక్ ప్లాంట్
Image Credit : Getty

స్నేక్ ప్లాంట్

ఇంట్లో మొక్కలు పెంచాలి అనుకునేవారికి స్నేక్ ప్లాంట్ బెస్ట్ ఛాయిస్. ఇది చాలాకాలం బతుకుతుంది, తక్కువ వెలుతురులోనూ బాగా పెరుగుతుంది. మిగతా మొక్కల్లా కాకుండా, ఇది రాత్రిపూట కూడా ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. ఇది గాలిలోని ఫార్మాల్డిహైడ్, బెంజీన్, జైలీన్ వంటి విష రసాయనాలను పీల్చుకుంటుంది. దీనికి చాలా తక్కువ నీళ్లు అవసరం. మట్టి పూర్తిగా ఆరిపోయాక మాత్రమే నీళ్లు పోయాలి.

Related Articles

Related image1
Vastu Plants: ఇంట్లో డబ్బులకు లోటు రావద్దంటే.. కచ్చితంగా పెంచాల్సిన మొక్కలు ఇవే!
Related image2
Vastu Tips For Morning: ఉదయం నిద్ర లేవగానే అస్సలు చేయకూడని 5 పనులు ఇవే!
37
మనీ ప్లాంట్
Image Credit : Gemini AI

మనీ ప్లాంట్

మనీ ప్లాంట్ ని చాలా ఇళ్లల్లో పెంచుతుంటారు. వాస్తు, ఫెంగ్ షుయ్ ప్రకారం ఈ మొక్కను శుభప్రదంగా భావిస్తారు. ఈ మొక్క ఇంటి మూలమూలలకూ పాకి, పచ్చదనంతో నింపేస్తుంది. గాలిలోని విష పదార్థాలను తొలగించడంలో ఇది ముందు వరుసలో ఉంటుంది. దీన్ని మట్టిలో, నీటిలో కూడా పెంచవచ్చు. ఇది ఒత్తిడిని తగ్గించి, ఏకాగ్రతను పెంచడానికి కూడా సహాయపడుతుంది. 

47
పీస్ లిల్లీ
Image Credit : freepik

పీస్ లిల్లీ

పీస్ లిల్లీ తన తెల్లని పువ్వులు, మెరిసే ఆకులతో ఏ లివింగ్ రూమ్‌కైనా 'ప్రీమియం' లుక్ ఇస్తుంది. ఇది చూడటానికి అందంగా ఉండటమే కాకుండా, గాలిలోని తేమను నియంత్రించడంలో సహాయపడుతుంది. పరిశోధనల ప్రకారం, ఇది గాలిలోని అమ్మోనియా, బూజు బీజాలను శుభ్రం చేస్తుంది. ఈ మొక్క తక్కువ వెలుతురులో కూడా ఈజీగా పెరుగుతుంది. ఎప్పుడూ మట్టి తేమగా, నీరు నిలిచిపోకుండా ఉంటే చాలు.. చక్కగా పెరుగుతుంది.

57
కలబంద
Image Credit : gemini ai

కలబంద

కలబంద 'టూ-ఇన్-వన్' మొక్క. ఇది గాలిని శుభ్రపరచడమే కాకుండా, దీని జెల్‌ను చర్మం, జుట్టు సంరక్షణకు కూడా ఉపయోగించవచ్చు. ఇది గాలి నుంచి బెంజీన్, ఫార్మాల్డిహైడ్‌ను తొలగిస్తుంది. ఇంట్లో తాజా వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. మంచిగా సూర్యరశ్మి పడే కిటికీ దగ్గర దీన్ని పెట్టుకోవచ్చు. మట్టి పూర్తిగా ఆరిపోయిన తర్వాత నీళ్లు పోస్తే సరిపోతుంది.

67
స్పైడర్ ప్లాంట్
Image Credit : chat gpt

స్పైడర్ ప్లాంట్

స్పైడర్ ప్లాంట్ కూడా ఇంట్లో పెంచడానికి చాలా అనువైన మొక్క. ఎందుకంటే ఇందులో విషపూరిత గుణాలు ఉండవు. దీని పొడవైన, వేలాడే ఆకులు హ్యాంగింగ్ బాస్కెట్లలో చాలా అందంగా కనిపిస్తాయి. ఇది కార్బన్ మోనాక్సైడ్, చెడు వాసనలను తొలగించడంలో చాలా చక్కగా పనిచేస్తుంది. ఇది ఇంటి వాతావరణాన్ని తాజాగా, కాలుష్య రహితంగా ఉంచుతుంది. పరోక్ష వెలుతురులో ఇది బాగా పెరుగుతుంది. వారానికి 2-3 సార్లు నీళ్లు పోస్తే చాలు.

77
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Image Credit : Getty

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఇండోర్ మొక్కలు చనిపోవడానికి ప్రధాన కారణం ఎక్కువ నీళ్లు పోయడమే. కాబట్టి సరిపడా నీళ్లు పోయడంతో పాటు కుండీకి తప్పనిసరిగా డ్రైనేజ్ హోల్ ఉండేలా చూసుకోవాలి. అలాగే ఆకులపై పేరుకునే దుమ్ము, కిరణజన్య సంయోగక్రియ సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి తడి గుడ్డతో అప్పుడప్పుడు ఆకులను తుడవాలి. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇంట్లో స్వచ్ఛమైన గాలిని విడుదల చేస్తుంది. 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
తోటపని
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Tulsi Plant: తులసి మొక్క సడెన్ గా ఎండిపోయిందా? కారణం ఇదే
Recommended image2
Spider Plant: బెడ్రూమ్ లో ఈ ఒక్క మొక్క ఉంటే జరిగే మ్యాజిక్ ఇదే..!
Recommended image3
Terrace Gardening: ఇలా చేస్తే ఎన్ని మొక్కలు వేసినా డాబాకు పగుళ్లే రావు
Related Stories
Recommended image1
Vastu Plants: ఇంట్లో డబ్బులకు లోటు రావద్దంటే.. కచ్చితంగా పెంచాల్సిన మొక్కలు ఇవే!
Recommended image2
Vastu Tips For Morning: ఉదయం నిద్ర లేవగానే అస్సలు చేయకూడని 5 పనులు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved