MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Health
  • Period Pain: పీరియడ్స్ టైంలో కాళ్ల నొప్పులు వేధిస్తున్నాయా? ఇలా చేస్తే వెంటనే రిలీఫ్!

Period Pain: పీరియడ్స్ టైంలో కాళ్ల నొప్పులు వేధిస్తున్నాయా? ఇలా చేస్తే వెంటనే రిలీఫ్!

పీరియడ్స్ టైంలో ఒక్కొక్కరు ఒక్కో సమస్యతో బాధపడుతుంటారు. కొందరిని కడుపునొప్పి వేధిస్తే.. మరికొందరిని కాళ్ల నొప్పులు బాధ పెడతాయి. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో ఈ సమస్యలనుంచి ఉపశమనం పొందవచ్చు. అవేంటో ఇక్కడ చూద్దాం. 

1 Min read
Author : Kavitha G
Published : Jul 01 2025, 06:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పీరియడ్స్ టైంలో కాళ్ల నొప్పులు తగ్గించే చిట్కాలు

పీరియడ్స్ టైంలో కాళ్ల నొప్పులు తగ్గించే చిట్కాలు

పీరియడ్స్ టైంలో మహిళలు చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ఎక్కువ రక్తస్రావం, కడుపు నొప్పి, నడుము నొప్పితో పాటు కొంతమంది మహిళలకు తీవ్రమైన కాళ్ల నొప్పి కూడా ఉంటుంది. ఇది హార్మోన్ల మార్పుల వల్ల వస్తుంది. ఇది సాధారణమే అయినప్పటికీ చాలా బాధను కలిగిస్తుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
హీట్ ప్యాడ్..

హీట్ ప్యాడ్..

పీరియడ్స్ సమయంలో కాళ్ల నొప్పి లేదా కండరాల నొప్పి ఉంటే.. కాళ్లపై హీట్ ప్యాడ్ తో మసాజ్ చేయండి. ఇది నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. హీట్ ప్యాడ్ (heat pad) రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. నొప్పిని తగ్గిస్తుంది.

36
మసాజ్..

మసాజ్..

పీరియడ్స్ టైంలో వచ్చే కాళ్ల నొప్పులకు.. మసాజ్ మంచి చికిత్స. లావెండర్ లేదా ఆవనూనెతో మసాజ్ చేయవచ్చు. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. కాళ్లకు మసాజ్ చేయడం వల్ల అలసట తగ్గుతుంది. విశ్రాంతి లభిస్తుంది.

46
యోగా లేదా వ్యాయామం (yoga or exercise)

యోగా లేదా వ్యాయామం (yoga or exercise)

వ్యాయామం.. కాళ్ళ నొప్పులను తగ్గించడానికి సహాయపడుతుంది. వ్యాయామం చేసినప్పుడు.. మెదడు నొప్పిని తగ్గించే ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది. వ్యాయామం.. రక్త ప్రసరణకు సహాయపడుతుంది. ఇది కాళ్ల నొప్పి, కండరాల నొప్పులను తగ్గిస్తుంది. అయితే తేలికపాటి వ్యాయామాలు చేయడం మంచిది.

56
సమతుల్య ఆహారం

సమతుల్య ఆహారం

పోషకాల లోపం కాళ్లలో నొప్పి, కండరాల నొప్పులకు కారణమవుతుంది. కాబట్టి పీరియడ్స్ సమయంలో సరైన పోషకాలు తీసుకోండి. విటమిన్ డి, జింక్, మెగ్నీషియం, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉన్న ఆహారాలు తీసుకోవడం మంచిది.

66
హైడ్రేట్ గా ఉండండి..

హైడ్రేట్ గా ఉండండి..

నెలసరి సమయంలో హైడ్రేట్ గా ఉండటం చాలా ముఖ్యం. సరిపడా నీరు తాగక పోవడం కూడా కాళ్ల నొప్పులకు కారణం కావచ్చు. కాబట్టి వాటర్ మంచిగా తాగండి. దోసకాయ, పుచ్చకాయ వంటి వాటిని డైట్ లో చేర్చుకోండి.  

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
మహిళలు
ఆరోగ్యం
జీవనశైలి
చిట్కాలు మరియు ఉపాయాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Recommended image2
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image3
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Related Stories
Recommended image1
Period Blood: పీరియడ్ బ్లడ్ ఈ కలర్ లో ఉంటే ఎంత ప్రమాదమో తెలుసా?
Recommended image2
Period Beliefs: పీరియడ్స్ గురించి ఏ దేశంలో ఎలాంటి నమ్మకాలున్నాయో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved