Health: మగవారు అందుకు పనికి రారని ఎలా తెలుస్తుంది.? బయట నుంచి చూసి చెప్పొచ్చా
Health: ఆడ,మగల మధ్య ఆకర్షణ ఉండడం అనేది ప్రకృతి ధర్మం. అలా లేకపోతే ఏదో లోపం ఉందని భావించాలి. అయితే కొందరు పురుషులు నపుంసకులిగా మిగిలిపోతారు. ఇంతకీ నపుంసకత్వం అంటే ఏంటి.? దీనిని ఎలా గుర్తించవచ్చో చూద్దాం.

వాళ్లు స్వయంగా చెప్పరు
సాధారణంగా హిజ్రాలు మాత్రమే తాము నపుంసకులం అని చెప్పుకుంటారు. ఆ సామర్థ్యం లేని వారు స్వయంగా ఎప్పుడూ తాము నపుంసకులం అని చెప్పుకోరు. హిజ్రాల హవభావాల ఆధారంగా వారిని గుర్తించవచ్చు.
నపుంసకత్వం ఉంటే ఏమవుతుంది.?
నపుంసకత్వంతో బాధపడే పురుషులకు ఎలాంటి రొమాంటిక్ భావోద్వేగాలు కలగవు. స్త్రీలను, అమ్మాయిలను చూసినా ఎలాంటి ఫీలింగ్ ఉండదు. ఇక రొమాంటిక్ సన్నివేశాలు చూసినా అంగం స్థంభించదు.
నపుంసకత్వం రెండు రకాలు.
సాధారణంగా ఈ సమస్యను రెండు రకాలుగా విభజించారు. ఇందులో ఒకటి శారీరక నపుంసకత్వం కాగా మరోటి మానసిక నపుంసకత్వం.
* రక్తప్రసరణ లోపం, హార్మోన్ లోపాలు వంటివి శారీరక నపుంసకత్వానికి దారి తీస్తాయి. వీరిలో శరీరంలో ఎలాంటి స్పందన ఉండదు.
* ఇక మానసిక నపుంసకత్వానికి వస్తే.. ఆందోళన, భయం, కంగారు, అభద్రత భావం, డిప్రెషన్ వంటి వాటివల్ల
వస్తుంది.
ఎలా గుర్తించాలి.?
మగవారికి ఎలాంటి రొమాంటిక్ భావాలు కలగకపోతే వారిని పరీక్షించిన తర్వాత ఎలాంటి సమస్యతో బాధపడుతున్నారో గుర్తిస్తారు. వారిలో ఉన్న లక్షణాల ఆధారంగా శారీరకమైందా, లేదా మానసిక నపుంసకత్వమా అన్న విషయాన్ని వైద్యులు అంచనా వేస్తారు. దానికి తగ్గట్లు చికిత్స అందిస్తారు.

