పరగడుపున బొప్పాయి పండు తింటే ఏమవుతుందో తెలుసా?
బొప్పాయి పండు రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కానీ ఏ పండునైనా సరైన పద్ధతిలో సరైన టైంలో తీసుకుంటేనే దాని పూర్తి ప్రయోజనాలు పొందవచ్చు. రోజూ ఉదయాన్నే పరగడుపున బొప్పాయి పండు తింటే ఏమవుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

Papaya Benefits
బొప్పాయి పండును అందరు ఇష్టంగా తింటారు. రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తక్కువ ధరకు లభిస్తుంది. కాబట్టి దీన్ని చాలామంది కొనుగోలు చేస్తుంటారు. బొప్పాయిలో విటమిన్ సి, ఎ, ఫైబర్, ఫోలేట్, పొటాషియం వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాంటి బొప్పాయిని రోజూ ఉదయాన్నే పరగడుపున తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం.
రోగనిరోధక శక్తి
బొప్పాయి పండులో విటమిన్ సి మాత్రమే కాదు.. ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. పరగడుపున బొప్పాయి తింటే.. దానిలోని పోషకాలు రోగనిరోధక శక్తి పెరగడానికి సహాయపడుతాయి. సీజనల్ ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి రోగనిరోధక శక్తి సహాయపడుతుంది.
బరువు తగ్గడానికి
బరువు తగ్గాలనుకునే వారికి బొప్పాయి బెస్ట్ ఛాయిస్. ఈ పండులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ ఎక్కువసేపు ఉంటుంది. ఆకలిని కంట్రోల్ చేస్తుంది. పరగడుపున బొప్పాయి తింటే రోజంతా తక్కువ కేలరీలు తీసుకుంటారు.
ప్రకాశవంతమైన చర్మం
బొప్పాయిలోని విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ప్రకాశవంతంగా, యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. ఉదయాన్నే పరగడుపున బొప్పాయి తింటే చర్మం సహజంగా మెరుస్తుంది.
కంటి ఆరోగ్యానికి..
బొప్పాయిలో విటమిన్ సి, విటమిన్ ఇ, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఉదయాన్నే పరగడుపున బొప్పాయి తింటే కంటి సమస్యలు తగ్గి, కంటి చూపు స్పష్టంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
గుండె ఆరోగ్యానికి..
బొప్పాయిలోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు గుండెకు మంచివి. పరగడుపున తింటే శరీరంలోని విష పదార్థాలు బయటకు పోతాయి. పొటాషియం బీపీని కంట్రోల్ చేసి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.