స్మోకింగ్ మానేయడానికి ఈ చిట్కాలు సూపర్ గా పనిచేస్తాయి!
Best Tips To Quit Smoking: స్మోకింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిది కాదనే విషయం అందరికీ తెలుసు. కానీ చాలామంది ఈ అలవాటు నుంచి త్వరగా బయటపడలేరు. అయితే కొన్ని సహజ చిట్కాలతో స్మోకింగ్ అలవాటును ఈజీగా మానుకోవచ్చు. అదేలాగో ఇక్కడ చూద్దాం.

Tips To Quit Smoking
ధూమపానం ఆరోగ్యానికి హానికరమని మనందరికీ తెలుసు. ఇది ఆస్తమా, క్యాన్సర్, క్షయ వంటి తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది. ఊపిరితిత్తుల నుంచి గుండె వరకు శరీరంలోని ప్రతి అవయవానికి నష్టం కలిగిస్తుంది. అయినప్పటికీ చాలా మంది ఈ అలవాటు నుంచి బయటపడలేరు. స్మోకింగ్ చేయాలనే కోరికను నియంత్రించుకోలేరు. అలాంటి వారికి ఈ చిట్కాలు చక్కగా ఉపయోగపడతాయి. వీటిని పాటించడం ద్వారా స్మోకింగ్ అలవాటు నుంచి సులభంగా బయటపడవచ్చు. మరి అవేంటో చూద్దామా…
వాటర్ తాగడం
మీకు స్మోకింగ్ చేయాలని అనిపించిన ప్రతీసారి వెంటనే ఒక గ్లాసు వాటర్ తాగండి. నీరు శరీరం నుంచి నికోటిన్, దాని ఉత్పన్నాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. ఇంకా క్రమంగా స్మోకింగ్ అలవాటును తగ్గిస్తుంది. స్మోకింగ్ చేయాలి అనిపించినప్పుడు నీరు తాగే అలవాటు చాలా చిన్నది అయినప్పటికీ.. ఇది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది.
తులసి
సిగరెట్ తాగాలనే కోరిక కలిగిన వెంటనే 2-3 తులసి ఆకులను నమిలి తినండి. ఇది నోటిని చల్లబరుస్తుంది. నికోటిన్ కోరికను తగ్గిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తులసి ఆకులు ధూమపానం అలవాటును మానేయడానికి చాలా సహాయపడతాయి.
యాలకులు, సోంపు
యాలకులు, లవంగాలు, సోంపు వంటి మసాలా దినుసులు కూడా ధూమపానం అలవాటును మానేయడానికి సహాయపడతాయి. కాబట్టి వీటిని ఎప్పుడూ మీ వెంట ఉంచుకోండి. సిగరెట్ తాగాలని అనిపించినప్పుడు.. వాటిని నోట్లో వేసుకుని నమలండి. సిగరెట్ తాగాలనే కోరిక క్రమంగా తగ్గిపోతుంది.
అల్లం
అల్లంలో ఉండే ఘాటైన రుచి నికోటిన్ కోరికను తగ్గిస్తుంది. కాబట్టి ధూమపానం చేయాలని అనిపించినప్పుడు ఒక చిన్న అల్లం ముక్కను నోట్లో వేసుకుని నమలండి. కావాలంటే అల్లంతో తేనె కలిపి కూడా తినవచ్చు.
ఉసిరికాయ
సిగరెట్ మానేయడానికి ఉసిరికాయ కూడా చాలా ఉపయోగపడుతుంది. దీని కోసం ఉసిరికాయ, అల్లాన్ని సమానంగా తీసుకుని తురుముకోండి. ఆపై దానికి ఉప్పు, నిమ్మరసం కలిపి ఒక గాజు సీసాలో వేసి నిల్వ చేయండి. సిగరెట్ తాగాలి అనిపించినప్పుడల్లా దాన్ని తినండి.
నిమ్మరసం, తేనె
ఒక గ్లాస్ లెమెన్ వాటర్ లో కొంచెం తేనె కలిపి ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తాగడం ద్వారా శరీరంలో నికోటిన్ క్రమంగా బయటకుపోతుంది. ధూమపానం అలవాటు కూడా అదుపులోకి వస్తుంది. రోజంతా ఉత్సాహంగా కూడా ఉంటారు.