ఈ పచ్చి ఆకులను పరగడుపున నమిలి తింటే ఎంత మంచిదో
guava leaves: జామకాయల్ని ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటుంటారు. అయితే జామకాయలే కాకుండా.. జామ ఆకుల్ని కూడా తినొచ్చు. ఇవి మనల్ని ఎన్నో సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

జామ ఆకులు
ఆరోగ్యకరమైన పండ్లలో జామకాయ ఒకటి. జామకాయను తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి అందరికీ తెలుసు. కానీ జామ ఆకుల్ని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం చాలా మందికి తెలియదు. కానీ పరిగడుపున జామ ఆకుల్ని నమిలి తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అందుకే ఈ ఆకుల్ని తినడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది
జామ ఆకుల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీనిలో ఆరెంజ్ పండు కంటే నాలుగు రెట్లు విటమిన్ సి ఎక్కువగా ఉంటుందట. ఈ ఆకుల్ని గనుక పరిగడుపున తింటే మీ రోగనిరోధక పనితీరు మెరుగుపడుతుంది. దీంతో మీరు జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్లు, ఇన్ఫెక్షన్లు వంటి అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంటారు.
గుండె ఆరోగ్యంగా
జామ ఆకుల్ని పరిగడుపున నమిలి తినడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వీటిని తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ముప్పు కూడా తగ్గుతుంది. మొత్తంగా జామ ఆకులు గుండె ఆరోగ్యానికి కూడా సహాయపడతాయి.
షుగర్ కంట్రోల్
డయాబెటీస్ పేషెంట్లకు కూడా జామ ఆకులు సహాయపడతాయి. ఈ ఆకులను తింటే ఇన్సులిన్ సున్నితత్వం మెరుగుపడుతుంది. అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ లో ఉంటాయి. ఈ ఆకులను పరిగడుపున తినడం వల్ల గ్లూకోజ్ శోషణ నెమ్మదించి బ్లడ్ షుగర్ పెరిగే అవకాశం తగ్గుతుంది.
ఒత్తిడి తగ్గుతుంది
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. జామ ఆకుల్లో ఒత్తిడిని తగ్గించే లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి స్ట్రెస్ ను, యాంగ్జైటీని తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడానికి సహాయపడతాయి. స్ట్రెస్ తో ఉన్నప్పుడు వీటిని తింటే ప్రశాంతంగా, రిలాక్స్ గా ఉంటారు.
బరువు తగ్గడానికి
బరువు తగ్గాలనుకునే వారికి కూడా జామ ఆకులు మంచి ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని పరిగడుపున తిన్నా లేదా టీ గా తాగినా సులువుగా బరువు తగ్గుతారు. అలాగే జామ ఆకులు ఎన్నో చర్మ సమస్యల్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది.