మీరు పట్టు చీరలు పెట్టే కప్ బోర్డ్ తేమగా లేకుండా చూసుకోవాలి. లేదంటే చీరలకు ఫంగస్ సోకుతుంది. దీంతో చీరల నుంచి దుర్వాసన రావడమే కాదు బూజు కూడా ఏర్పడుతుంది.
పట్టు చీరలను బీరువాలో పెట్టడానికి ముందు వీటిని మస్లిక్ వస్త్రంలో చుట్టి పెట్టాలి. దీనివల్ల పట్టు చీరలకు దుర్వాసన, తేమ రాకుండా ఉంటాయి.
అలాగే పట్టు చీరలు పెట్టే కప్ బోర్డ్ లేదా బీరువాలో వేపాకులు వంటి తేమను పీల్చుకునే వస్తువులను ఉంచండి. దీనివల్ల పట్టు చీరలు సేఫ్ గా ఉంటాయి.
బీరువాలో పట్టుచీరలను నేరుగా పెట్టకుండా వాటిని గాలి వెళ్లని ప్లాస్టిక్ బ్యాగ్ లో పెట్టిన తర్వాతే పెడుతుంటారు.కానీ ప్లాస్టిక్ తేమను నిలిపి, చీరపై ఫంగస్ పెరిగేలా చేస్తుంది.
పట్టు చీరలను కబోర్డ్ లో పెట్టినా, బీరువాలో పెట్టినా వాటిలో తేమను పీల్చుకునే బేకింగ్ సోడా, కల్లుప్పు వంటి సహజమైన వాటిని పెట్టండి.
అయితే పట్టు చీరలను ఎప్పుడైనా సరే చెక్క హ్యాంగర్ కు మాత్రమే తగిలించండి. స్టీల్, ఇనుము వంటి హ్యాంగర్లకు తగిలించకండి.
ఎక్కువ వెలుతురు, ఎండ ఉన్న చోట పట్టు చీరలను పెడితే వాటి రంగు వెలసిపోతుంది. అందుకే వీటిని చీకటిగా ఉండే కబోర్డ్ లోనే పెట్టండి. అలాగే అక్కడ పురుగులు ఉండకూడదు.
పట్టు చీరను చాలా కాలం పాటు ఒకే మడతలో ఉంచకూడదు. ప్రతినెలా బయటకు తీసి మళ్లీ మడతపెట్టండి.