MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Health
  • Hair: జుట్టు రాలుతోందా.? ఈ నూనెను ఇలా వాడితే ఠ‌క్కుమని ఆగిపోతుంది.

Hair: జుట్టు రాలుతోందా.? ఈ నూనెను ఇలా వాడితే ఠ‌క్కుమని ఆగిపోతుంది.

Hair: జుట్టు ఊడిపోవడం, రఫ్‌గా మారడం, ఫ్రిజీ హెయిర్ వంటి సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. ఈ సమస్యలను తగ్గించేందుకు చాలామంది సహజమైన పద్ధతులను వెతుకుతుంటారు. అలాంటి ఒక బెస్ట్ నేచుర‌ల్ రెమెడీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Mar 21 2026, 08:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
క‌లోంజీ నూనెలో పుష్క‌ల‌మైన పోష‌కాలు
Image Credit : Gemini AI

క‌లోంజీ నూనెలో పుష్క‌ల‌మైన పోష‌కాలు

కలోంజీ గింజలను నల్ల జీలకర్ర అని కూడా పిలుస్తారు. వీటి నుంచి త‌యారు చేసే నూనె క‌లోంజీ నూనె అంటారు. భారతదేశం మాత్రమే కాదు, మిడిల్ ఈస్ట్ దేశాల్లో కూడా ఈ ఆయిల్‌ను బ్యూటీ కేర్‌కు ఉప‌యోగిస్తున్నారు. ఇందులో ఉండే పోషకాలు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. క‌లోజి నూనెలో జుట్టుకు అవసరమైన అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో థైమోక్వినోన్ (Thymoquinone), ఫ్యాటీ యాసిడ్లు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. జుట్టు రూట్స్‌ను బలంగా చేయడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి. అలాగే స్కాల్ప్‌లో వచ్చే ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి జుట్టు పలచగా మారకుండా కాపాడడంలో సహాయపడుతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
స్కాల్ప్ మసాజ్‌తో మంచి ఫలితం
Image Credit : Freepik

స్కాల్ప్ మసాజ్‌తో మంచి ఫలితం

క‌లోంజి నూనెను వాడే సరైన పద్ధతుల్లో స్కాల్ప్ మసాజ్ ఒకటి. ఇందుకోసం రెండు చెంచాల క‌లోంజి నూనె తీసుకోవాలి. అందులో బాదం నూనె లేదా కొబ్బరి నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని తల చర్మంపై మెల్లగా 10–15 నిమిషాలు మసాజ్ చేయాలి. తర్వాత రాత్రంతా అలాగే ఉంచి ఉదయం కడిగేయాలి. ఇలా చేయడం వల్ల తల చర్మంలో రక్త ప్రసరణ మెరుగవుతుంది. జుట్టు రూట్స్‌కు పోషకాలు చేరి జుట్టు క్రమంగా బలంగా మారుతుంది.

35
జుట్టు పెరుగుదలకు క‌లోంజి – ఉల్లిపాయ నూనె
Image Credit : Getty

జుట్టు పెరుగుదలకు క‌లోంజి – ఉల్లిపాయ నూనె

జుట్టు పెరుగుదల కోసం కలోంజి నూనె, ఉల్లిపాయ నూనె మిక్స్‌ కూడా ఉపయోగపడుతుంది. ఇందుకోసం రెండు నూనెలను సమాన మోతాదులో కలపాలి. జుట్టు పలుచగా ఉన్న ప్రాంతాల్లో తల చర్మంపై రాయాలి. రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు మైల్డ్ షాంపూతో కడగాలి. వారం లో రెండు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితం కనిపించవచ్చు. ఉల్లిపాయ నూనెలో ఉండే సల్ఫర్ జుట్టు రూట్స్‌ను బలంగా చేయడంలో సహాయపడుతుంది.

45
డ్రై, డ్యామేజ్ లేదా ఫ్రిజీ జుట్టుకు హెయిర్ మాస్క్
Image Credit : PINTEREST

డ్రై, డ్యామేజ్ లేదా ఫ్రిజీ జుట్టుకు హెయిర్ మాస్క్

మీ జుట్టు డ్రైగా, డ్యామేజ్‌గా లేదా ఫ్రిజీగా ( జుట్టు తేమను కోల్పోవడం, పొడిగా మారడం) ఉంటే క‌లోంజి హెయిర్ మాస్క్ ఉపయోగపడుతుంది. ఈ హెయిర్ మాస్క్‌ను ఒక చెంచా కలొంజి నూనె,ఒక చెంచా తేనె లేదా పెరుగును కలిపి పేస్ట్‌లా తయారు చేసి జుట్టుకు రాయాలి. ఒక గంట తర్వాత మైల్డ్ షాంపూతో కడగాలి. ఇలా చేస్తే జుట్టుకు లోతుగా పోషణ అందుతుంది. జుట్టు మృదువుగా, మెరిసేలా మారుతుంది.

55
మ‌రింత పోష‌ణ‌కు ఇలా చేయండి
Image Credit : gemini a

మ‌రింత పోష‌ణ‌కు ఇలా చేయండి

జుట్టుకు మరింత పోషణ ఇవ్వాలంటే క‌లోంజి నూనెను కొంచెం గోరువెచ్చగా చేసి తల చర్మంతో పాటు జుట్టుకు రాయాలి. తర్వాత తలకు వెచ్చని తువాలు కట్టాలి. ఇలా కనీసం ఒక గంట లేదా రాత్రంతా ఉంచితే నూనె బాగా ప‌ట్టుకుంటుంది. దీంతో స్కాల్ప్‌కు పూర్తి పోషణ అందుతుంది. జుట్టు పెరుగుదలకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.

గమనిక: పైన తెలిపిన ఈ విష‌యాలు కేవ‌లం ప్రాథ‌మిక స‌మాచారం మేర‌కు మాత్ర‌మే. ఆరోగ్యానికి సంబంధించినంత వ‌ర‌కు వైద్యుల సూచ‌న‌లు పాటించ‌డ‌మే మంచిది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Recommended image2
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image3
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Related Stories
Recommended image1
Philips: ఇంట్లో ఇదొక్క‌టి ఉంటే చాలు.. ఇక‌పై గ్యాస్ సిలిండ‌ర్ కొనాల్సిన ప‌ని ఉండ‌దు.
Recommended image2
హైద‌రాబాద్‌లో బ‌త‌కాలంటే నెల‌కు ఎంత ఖ‌ర్చ‌వుతుంది.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved