గుడ్డుతో పాటు వీటిని అస్సలు తినకూడదు.. ఎందుకో తెలుసా?
గుడ్లు తినడం ఆరోగ్యానికి ఎంత మంచిదో మనకు తెలుసు. కానీ గుడ్డును కొన్ని రకాల ఆహార పదార్థాలతో కలిపి తినడం లేదా గుడ్డు తిన్న వెంటనే వాటిని తినడం అస్సలు మంచిదికాదు అంటున్నారు నిపుణులు. ఆ ఫుడ్స్ ఏంటో? గుడ్డుతో కలిపి తింటే ఏమవుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

గుడ్డు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
గుడ్డులో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. గుడ్డులోని ప్రోటీన్ శరీరానికి బలాన్ని ఇచ్చి, కండరాల అభివృద్ధికి సహాయపడుతుంది. ఇందులోని విటమిన్ B12, విటమిన్ D, కోలిన్, సెలేనియం వంటి పోషకాలు మెదడు పనితీరును మెరుగుపరిచి, జ్ఞాపకశక్తిని పెంచుతాయి. గుడ్డులో ఉండే మంచి కొవ్వులు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఇలా గుడ్డు ఆరోగ్యానికి మేలు చేసిప్పటికీ.. కొన్ని రకాల ఆహారాలతో కలిపి తినడం మంచిది కాదంటున్నారు నిపుణులు. అవేంటో ఇక్కడ చూద్దాం.
సోయా పాలు
గుడ్లు, సోయా పాలను కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థపై ప్రోటీన్ల భారం పెరుగుతుంది. ఇది ప్రోటీన్ల శోషణకు ఆటంకం కలిగిస్తుంది. జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. కొందరిలో అయితే వాపు, దురద, జీర్ణ సమస్యలు వంటి ప్రతికూల ప్రభావాలు కనిపిస్తాయి. ముఖ్యంగా జీర్ణ సమస్యలు ఉన్నవారు గుడ్డు తిన్న వెంటనే సోయా పాలు తాగకపోవడం మంచిది.
చక్కెరతో చేసిన స్వీట్లు
గుడ్లు తిన్న వెంటనే స్వీట్లు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. గుడ్లలోని అమైనో ఆమ్లాలు చక్కెరతో కలిసి ప్రతికూలంగా స్పందిస్తాయి. దానివల్ల జీర్ణ సమస్యలు పెరుగుతాయి. అధిక చక్కెర ఉన్న స్వీట్లు తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల కొంతమందికి అలసట, శక్తి తగ్గడం వంటి సమస్యలు ఎదురుకావచ్చు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు గుడ్డు తిన్న వెంటనే స్వీట్లు తినడం చాలా ప్రమాదం.
అధిక ప్రోటీన్ ఉన్న మాంసం
అధిక కొవ్వు, అధిక ప్రోటీన్లు ఉన్న మాంసాన్ని గుడ్లతో కలిపి తినడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. ఇది ఉబ్బరం, నీరసం వంటి జీర్ణ సంబంధిత అసౌకర్యానికి దారితీస్తుంది. ముఖ్యంగా జీర్ణక్రియ బలహీనంగా ఉన్నవారిలో ఈ సమస్య తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ప్రోటీన్ అధికంగా ఉన్న రెండు ఆహారాలు తీసుకునే ముందు కాస్త గ్యాప్ తీసుకోవడం మంచిది.
పాల ఉత్పత్తులు
పాలు, చీజ్ వంటి పాల ఉత్పత్తులతో పాటు గుడ్లు తినడం వల్ల కడుపులో ప్రోటీన్, కొవ్వు భారం పెరుగుతుంది. ఇది జీర్ణక్రియను కష్టతరం చేస్తుంది. అలాగే గుడ్డు తిన్న వెంటనే టీ లేదా కాఫీ తాగడం మంచిది కాదు. టీలోని టానిన్, కాఫీలోని కెఫిన్ గుడ్డులోని ఐరన్ శోషణకు ఆటంకం కలిగిస్తాయి. మలబద్ధకానికి కారణమవుతాయి.
సిట్రస్ పండ్లు
నారింజ, నిమ్మ, ద్రాక్ష వంటి ఆమ్ల గుణాలున్న పండ్లు గుడ్లలోని ప్రోటీన్‌ను గడ్డకట్టేలా చేస్తాయి. ఈ కలయిక జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది. అలాగే అరటి పండు కూడా గుడ్డుతో కలిపి తినడం మంచిది కాదు. దానివల్ల జీర్ణ వ్యవస్థపై భారం పెరిగి, ఉబ్బరం, నీరసానికి దారితీస్తుంది.

