Bone Health: ఎముకలు బలంగా ఉండాలంటే కచ్చితంగా తినాల్సిన ఫుడ్స్ ఇవే!
ఎముకలు బలంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఎముకల ఆరోగ్యంలో కాల్షియం, విటమిన్ కె, డి వంటివి కీలకపాత్ర పోషిస్తాయి. బోన్స్ బలంగా ఉండాలంటే తినాల్సిన ఫుడ్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

Foods for Strong Bones
మన శరీరానికి ఆధారం ఎముకలు. అవి బలంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే వయసు పెరిగే కొద్దీ ఎముకల దృఢత్వం తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఎముకలు బలంగా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవడం అవసరం. మరి ఎలాంటి ఆహారం ఎముకల బలోపేతానికి సహాయపడుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
పాల ఉత్పత్తులు
పాలు, పాల ఉత్పత్తుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా చేస్తుంది. రోజూ పాలు లేదా పెరుగు ఇతర పాల ఉత్పత్తులు తీసుకోవడం ద్వారా ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఆకుకూరలు
ఆకుకూరల్లో ( పాలకూర, బచ్చలికూర, తోటకూర, మునగాకు వంటివి) కాల్షియం, విటమిన్ K, మెగ్నీషియం ఉంటాయి. ఇవి ఎముకల ఎదుగుదలకు, దృఢత్వానికి సహాయపడతాయి.
బాదం, కాజు, వాల్‌నట్స్
బాదం, కాజు వాల్ నట్స్ వంటి వాటిలో ఎముకల ఆరోగ్యానికి అవసరమైన కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్‌లు ఉంటాయి. మెగ్నీషియం ఎముకల్లో కాల్షియం శోషణకి సహాయపడుతుంది. వీటిని రెగ్యులర్‌గా తింటే ఎముకలు బలంగా మారుతాయి.
సిట్రస్ పండ్లు
ఆరెంజ్ వంటి సిట్రస్ పండ్లలో కూడా కాల్షియం అధికంగా ఉంటుంది. ఈ పండ్ల జ్యూస్ కూడా శరీరానికి అవసరమైన కాల్షియం, విటమిన్ డిని అందిస్తుంది. ఎముకల బలోపేతానికి సహాయపడుతుంది. సిట్రస్ పండ్లను రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
అరటి పండు, గుడ్డు
గుడ్డులోని పచ్చసొనలో విటమిన్ కె, డి వంటివి పుష్కలంగా ఉంటాయి. గుడ్డును ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అరటిపండులో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకల దృఢత్వానికి సహాయపడుతుంది.
నువ్వులు, చియా సీడ్స్
నువ్వులు, చియా గింజల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
విటమిన్ డి
ఎముకల ఆరోగ్యానికి విటమిన్ డి అవసరం. మనం తీసుకునే ఆహారంలో సరైన మోతాదులో విటమిన్ డి అందకపోవచ్చు. కాబట్టి సూర్యరశ్మి నుంచి విటమిన్ డిని పొందవచ్చు. అందుకోసం ఉదయాన్నే కాసేపు ఎండలో నడవడం మంచిది.