గుండెజబ్బులు రాకుండా ఉండేందుకు వీటిని తింటే సరిపోతుందట
శాఖాహారం మంచిదా; మాంసాహారం మంచిదా? అన్న సందేహాలు చాలా మందికి వస్తుంటాయి. కొందరు శాకాహారాన్ని హెల్తీ ఫుడ్ గా భావిస్తే.. మరికొంతమంది మాంసాహారాన్ని హెల్తీగా భావిస్తారు. అయితే ఈ రెండు రకాల ఆహారాల గురించి ఓ స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఖచ్చితంగా తినాలి. హెల్తీ ఫుడ్ యే మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతుంది. అయితే కొంతమంది వెజ్ ను ఇష్టపడితే.. మరికొంతమంది మాత్రం నాన్ వెజ్ ను తినడానికి ఇష్టపడతారు. వెజ్ యే మంచిదంటే.. కాదు నాన్ వెజ్జే మంచిదని చాలా మంది భావిస్తుంటారు. అయితే తాజాగా ఓ అధ్యయనం ఈ చర్చకు బ్రేక్ వేసింది.
heart
స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఒక తాజా అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనంలో.. వరుసగా 8 వారాల పాటు శాఖాహార ఆహారాన్నితినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని కనుగొన్నారు. ఈ అధ్యయనం జామా నెట్ వర్క్ ఓపెన్ జర్నల్ లో ప్రచురితమైంది.
Vegetarian Diet
అధ్యయనం ఏం చెబుతోంది?
ఈ అధ్యయనంలో శాఖాహారం, మాంసాహారం రెండింటినీ తినే పిల్లలతో సహా 22 జతల కవలలు కూడా ఉన్నారు. ఈ అధ్యయనం ప్రకారం.. మాంసాహార ఆహారం తీసుకునే పిల్లల కంటే శాకాహార ఆహారం తీసుకునే పిల్లల్లో చెడు కొలెస్ట్రాల్ , ఇన్సులిన్ స్థాయిలు , ఊబకాయం తక్కువగా ఉన్నట్టు తేలింది.
శాఖాహార ఆహారం అంటే?
మొక్కల ఆధారిత ఆహారాన్నే శాఖాహారం అని అంటారు. ఈ ఆహారాల్లో కూరగాయలు, ధాన్యాలు, కాయలు, పండ్లు వంటి మొక్కల ఆహార పదార్థాలను రోజువారి ఆహారంలో భాగం చేస్తారు.
వెజిటేరియన్ డైట్ వల్ల కలిగే ప్రయోజనాల
శాకాహారాన్ని తింటే గుండె జబ్బులొచ్చే ప్రమాదం దగ్గుతుంది.
ఫైబర్ కంటెంట్ ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉండే శాకాహారాన్ని తినడం వల్ల బరువు పెరిగే ప్రమాదం తగ్గుతుంది.
పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలలో ఉండే ఫైబర్ మలబద్దకాన్ని నివారించడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
శాకాహారం కూడా రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.
శాఖాహార ఆహారం కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
శాకాహారి ఆహారం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు కూడా సహాయపడుతుంది.
శాఖాహార ఆహారాన్ని అవలంబించడం వల్ల మీరు ఎక్కువ కాలం జీవించవచ్చని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.