బ్లడ్ గ్రూప్ ఆధారంగా ఆహార పదార్థాలు తీసుకుంటే ఈ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు తెలుసా?
సాధారణంగా మనం ఒక్కొక్కరికి ఒక్కో బ్లడ్ గ్రూప్ కలిగి ఉంటుంది. అయితే బ్లడ్ గ్రూప్ ఆధారంగా మనం ఆహార పదార్థాలను కనుక తీసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మరి ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం..
ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరు ఉరుకులు పరుగులు పెడుతున్న కాలంతోపాటు ముందుకు పరుగులు తీస్తున్నారు. ఇలా ఎక్కువ సమయం పాటు పనిచేస్తూ అధిక ఒత్తిడి కారణంగా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము అయితే ఈ విధమైనటువంటి సమస్యల నుంచి బయటపడటానికి ఆహారం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా మనం తీసుకునే ఆహార పదార్థాలలో పోషక విలువలు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి.
ఈ విధంగా పోషక విలువలు కలిగినటువంటి ఆహార పదార్థాలను సరైన సమయానికి తీసుకోవటం వల్ల ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు. ఇకపోతే మన బ్లడ్ గ్రూప్ ఆధారంగా ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. మరి ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఏ ఏ ఆహార పదార్థాలను తీసుకోవాలి అనే విషయానికి వస్తే...
A బ్లడ్ గ్రూప్: ఏ పాజిటివ్ లేదా నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు చాలా వీక్ గా ఉంటారు. కనుక ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు ఎక్కువగా నిమ్మ జాతికి చెందిన పండ్లను తీసుకోవాలి. ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు వీలైనంతవరకు మాంసాహార పదార్థాలను చాలా తక్కువగా తీసుకోవాలి. అధిక బరువు సమస్యతో బాధపడేవారు ఎక్కువగా ఆకుకూరలు, బీన్స్, గింజలు,చిరుధాన్యాలు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీర బరువు తగ్గడమే కాకుండా వారిలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
B బ్లడ్ గ్రూప్: బి బ్లడ్ గ్రూప్ ఉన్నవారిలో జీర్ణక్రియ రేటు తక్కువగా ఉంటుంది. ఆహారం తీసుకున్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలో తగ్గిపోతాయి కనుక బి బ్లడ్ గ్రూప్ ఉన్నవారు సరైన సమయానికి తింటూ ఉండాలి. ఈ బ్లడ్ గ్రూప్ ఉన్న వారిలో కార్డిసాల్ హార్మోన్లు విడుదలవుతో ఉండటం వల్ల ఒత్తిడికి గురవుతూ ఉంటారు.అందుకే కొలెస్ట్రాల్ నూనెలు తక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది. ఆకుకూరలు, గుడ్లు కొలెస్ట్రాల్ తక్కువ ఉన్నటువంటి పదార్థాలను తీసుకోవడం మంచిది.
O బ్లడ్ గ్రూపు: ఓ బ్లడ్ గ్రూపు వారికి సహజంగా జీర్ణాశయ సంబంధిత వ్యాధులు ఎక్కువగా ఉంటాయి.అందుకే ఓ బ్లడ్ గ్రూప్ వారు ఎక్కువగా ప్రోటీన్లు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది. ఓ బ్లడ్ గ్రూపు వారు ఎక్కువగా చేపలు మాంసం కూరగాయలు ఆకుకూరలు వంటి ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవాలి.
AB బ్లడ్ గ్రూప్: ఈ బ్లడ్ గ్రూప్ ఉన్న వారి జీర్ణాశయంలో ఎక్కువగా ఆమ్ల రసాలు విడుదలవుతుంటాయి. కనుక ఆమ్లరసాల ఘాడతకు అనుగుణంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. ముఖ్యంగా ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు ఆపిల్ సైడర్ వెనిగర్, మునగ తేనె వంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి వీటితోపాటు చేపలు ఆకుకూరలు పాలు వంటి పదార్థాలను కూడా జోడించుకోవాలి.