ఆహా.. రాత్రి నడకతో ఇన్ని లాభాలా?!
రాత్రి నడక: నడక ఎప్పుడూ మంచిదే. సామాన్యుల నుంచి ఆరోగ్య నిపుణుల దాకా అంతా చెప్పే మాట ఇది. మరి ఉదయం నడవాలా? సాయంత్రం మేలా? అన్నది చాలామంది సందేహం. పైగా ఉదయం వేళ నడక కొందరికి కుదరకపోవచ్చు. మరి రాత్రి రాత్రి నడవడం వల్ల ఒంటికి ఆరోగ్యం సమకూరుతుందా? అంటే తెలుసుకోవాల్సిందే..

తిన్న వెంటనే పడుకోవద్దు
ఈ ఆధునిక కాలంలో హెల్తీ ఫుడ్ కంటే తొందరగా రెడీ అయ్యే ఆహారాన్నే చాలామంది ఇష్టపడుతున్నారు. ఇలాంటి జంక్ ఫుడ్ వల్ల ఊబకాయం, షుగర్, థైరాయిడ్ లాంటి రోగాలు వస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం ఏంటంటే తిన్న వెంటనే పడుకోవడం, తిన్న వెంటనే ఒకే చోట కూర్చోవడం. కానీ తిన్న తర్వాత ఒళ్ళు కదిలిస్తేనే ఆరోగ్యంగా ఉండగలం. రాత్రి తిన్న తర్వాత నడిస్తే ఏమేం లాభాలున్నాయో తెలుసుకుందాం.
ఎంతసేపు నడవాలి?: రాత్రికి తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తినాలి. రాత్రి 8 గంటలకల్లా తింటే మంచిది. కుదరనివాళ్లు పడుకునే ముందు మూడు గంటల ముందు తినేయండి. తిన్న తర్వాత 10 నుంచి 30 నిమిషాల దాకా నడిస్తే మంచిది. ఆయుర్వేదం ప్రకారం తిన్న తర్వాత కాసేపు నడిస్తే ఆరోగ్యం బాగుంటుంది. రోగాల నుంచి కూడా కాపాడుతుంది.
తిన్న తర్వాత నడక: రాత్రి తిన్న తర్వాత నడిస్తే ఒంటికి ఆరోగ్యం. షుగర్, బీపీ, ఊబకాయం, నిద్రపట్టకపోవడం లాంటి సమస్యలున్నవాళ్లకి రాత్రి నడక బాగా హెల్ప్ చేస్తుంది. నిద్ర కూడా బాగా పడుతుంది. అంతేకాదు, తిన్న తర్వాత నడిస్తే జీర్ణక్రియ బాగుంటుంది. మలబద్ధకం, గ్యాస్ సమస్యలు, జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
బరువు తగ్గుతారు: రాత్రి నడిస్తే క్యాలరీలు బాగా కరుగుతాయి. బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. జీవక్రియ బాగుండటం వల్ల ఎక్కువ శక్తిని వాడుకుని బరువు తగ్గుతారు. బరువు తగ్గాలనుకునేవాళ్లు రాత్రి నడవచ్చు.
గుండె ఆరోగ్యం: తిన్న తర్వాత నడిస్తే గుండె ఆరోగ్యం బాగుంటుంది. గుండె రోగాలు తెచ్చే చెడు కొలెస్ట్రాల్, బీపీ తగ్గి నార్మల్ అవుతాయి. దాంతో రోగాలు వచ్చే రిస్క్ తగ్గుతుంది. గుండెను బలంగా చేయడానికి రాత్రి నడక హెల్ప్ చేస్తుంది.
నిద్ర బాగా పడుతుంది: నిద్రలేమి చాలా సమస్యలకు కారణం. మీరు రాత్రి నడిస్తే మీ మూడ్ మారిపోయి మంచి నిద్ర పడుతుంది. కడుపు ఉబ్బరం, మలబద్ధకం, గ్యాస్ సమస్యలు, జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గి హాయిగా నిద్రపోతారు.
ఎప్పుడు నడవాలి?: రాత్రి తిన్న తర్వాత నడవడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. మీరు ఎక్కువసేపు నడవాల్సిన అవసరం లేదు. 20 నుంచి 30 నిమిషాలు నడిస్తే చాలు. తిన్న వెంటనే కాకుండా పది నిమిషాల తర్వాత నడవడం మొదలుపెట్టొచ్చు. మరీ వేగంగా కాకుండా బ్రిస్క్ వాక్ చేయాలి.