MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Insect Remove From Ear: చెవిలోకి పురుగులు వెళ్లినప్పుడు.. ఇలా చేస్తే వెంటనే బయటకు వస్తాయి!

Insect Remove From Ear: చెవిలోకి పురుగులు వెళ్లినప్పుడు.. ఇలా చేస్తే వెంటనే బయటకు వస్తాయి!

చెవిలోకి చీమలు, పురుగులు వెళ్తే ఎంత ఇబ్బందిగా ఉంటుందో చాలామందికి తెలిసే ఉంటుంది. అవి బయటకు వచ్చే వరకు చుక్కలు కనిపిస్తాయి. ఒక్కచోట కూర్చోలేము.. నిల్చోలేము. ప్రాణమంతా చెవిలోనే ఉంటుంది. పురుగులు చెవి లోపలికి వెళ్లినంత ఈజీగా బయటకు రావు. అక్కడేదో ఇళ్లు కట్టుకున్నట్లే చేస్తాయి. మరి వాటిని ఈజీగా ఎలా బయటకు రప్పించాలో కొన్ని చిట్కాలు మీకోసం. ఒకసారి చూసేయండి.

2 Min read
Author : Kavitha G
Published : Apr 11 2025, 05:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

చెవిలోకి చీమలు, పురుగులు దూరడం చాలా ఇబ్బంది పెట్టే విషయం. అవి చెవి నుంచి బయటకు వచ్చే వరకు మనం ప్రశాంతంగా ఉండలేము. ముఖ్యంగా ఇది పిల్లలకు ఎక్కువగా జరుగుతుంటుంది. చెవిలోపలికి వెళ్లిన కీటకాలు చెవిలోని భాగాలను కొరికి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి.

చెవి లోపలి భాగాలు చాలా సన్నితంగా ఉంటాయి. కాబట్టి చెవికి ఎలాంటి సమస్య రాకుండా జాగ్రత్తగా ఉండాలి. చెవిలోకి పురుగులు, చీమలు వెళ్తే వాటిని ఈజీగా ఎలా బయటకు తీయాలో ఇక్కడ తెలుసుకుందాం.

24
చీకటి గది:

చీకటి గది:

చెవిలో పురుగు ప్రవేశిస్తే, మొదట చీకటి గదిలోకి వెళ్లి టార్చ్ లేదా మొబైల్ లైట్‌ను చెవిలో చూపించాలి. ఎందుకంటే కొన్ని పురుగులు వెలుతురు చూసి వెంటనే బయటకు వస్తాయి.

ఆలివ్ లేదా బేబీ ఆయిల్:

మీ చెవిలోకి చీమలు, పురుగులు ఏమైనా వెళ్లినప్పుడు ఆలివ్ లేదా బేబీ ఆయిల్ చుక్కలను చెవిలో వేస్తే, పురుగులు చెవిలో ఉండలేక ఆ నూనెతో కలిసి బయటకు వస్తాయి.

34
ఉప్పు నీరు:

ఉప్పు నీరు:

గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి కొన్ని చుక్కలు చెవిలో వేయాలి. ఉప్పు కలిపిన నీరు పురుగుకు సహించదు. కాబట్టి వెంటనే చెవి నుంచి బయటకు వస్తుంది.

ఆల్కహాల్:

చెవిలో ఉన్న పురుగు బయటకు రావడానికి, దూదిని ఆల్కహాల్‌లో ముంచి చెవి బయటి భాగంలో ఉంచితే, పురుగులు చెవి నుంచి బయటకు వస్తాయి. ఒకవేళ ఇలా చేసినా బయటకు రాకపోతే, కొన్ని చుక్కలు మాత్రమే ఆల్కహాల్‌ను చెవిలో వేయండి! పురుగు వచ్చేస్తుంది.

44
ఇవి గుర్తుంచుకోండి:

ఇవి గుర్తుంచుకోండి:

- చెవిలోకి పురుగు వెళ్తే బడ్స్ లేదా ఇతర వస్తువులను ఉపయోగించి పురుగులను తీయడానికి ప్రయత్నించవద్దు. ఇలా చేస్తే పురుగు మరింత లోపలికి వెళ్తుంది. అంతేకాకుండా చెవి లోపలి భాగాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

- చెవిలోకి పురుగు వెళ్తే వెంటనే వేలు పెట్టకండి. దీని వల్ల చెవి నొప్పి పెరుగుతుంది.

- కొంతమంది చెవిలోకి పురుగు వెళ్తే అగ్గిపుల్లతో తీయడానికి ప్రయత్నిస్తారు. కానీ అలా చేయడం తప్పు. దీని వల్ల చెవికి సమస్య వచ్చి, కొన్నిసార్లు వినికిడి శక్తి కూడా పోవచ్చు.

- నీరు, నూనె వేసినా చెవిలో ఉన్న పురుగు బయటకు రాకపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ముఖ్యంగా పిల్లలు ఈ సమస్యను ఎదుర్కొంటే వెంటనే వారిని డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లండి.

- పురుగులు చెవిలోకి వెళ్లకుండా ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండండి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
చిట్కాలు మరియు ఉపాయాలు
జీవనశైలి
Latest Videos
Recommended Stories
Recommended image1
Vitamin D Deficiency: విటమిన్ డి లోపమా? మీ శరీరంలో ఈ 7 లక్షణాలు కనిపిస్తున్నాయా?
Recommended image2
Black Coffee: మీ డే బ్లాక్ కాఫీతో మొదలవుతుందా? అయితే ఈ విషయం మీకు తెలుసా?
Recommended image3
Cancer Symptoms: క్యాన్సర్ విషయంలో 5 లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved