ఈ సింపుల్ ట్రిక్స్ షుగర్ ను సెకన్లలో తగ్గిస్తయ్.. !
డయాబెటీస్ పేషెంట్లు ఆహారం, జీవన శైలి విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి. పెరిగిన బ్లడ్ షుగర్ ను కొన్ని సింపుల్ ట్రిక్స్ తో సులువుగా తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. అవేంటంటే?
డయాబెటిస్ కూడా ప్రాణాంతక వ్యాధే. దీన్ని పూర్తిగా తగ్గించే మందులు లేవు. కానీ నియంత్రించొచ్చు. బ్లడ్ షుగర్ ను కంట్రోల్ లో ఉంచుకోవడానికి మనం సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే రెగ్యులర్ గా వ్యాయామం చేయాలి. డయాబెటీస్ పేషెంట్లు తృణధాన్యాలు, ప్రోటీన్లు, పండ్లు, కూరగాయలు, ఆరోగ్యకరమైన కొవ్వులున్న ఆహారాలను తీసుకోవాలి. అంతేకాదు రక్తంలో చక్కెరను అదుపులో ఉంచడానికి స్వీట్లను తినకూడదు. చక్కెర ఉండే ఆహారం, పానీయాలకు దూరంగా ఉండాలి. పెరిగిన చక్కెర స్థాయిలను ఫాస్ట్ గా తగ్గించే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
సమయానికి తినకపోవడం, స్ట్రెస్ కు గురవ్వడం, హడావిడిగా తినడం వల్ల శరీరంలో ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ హార్మోన్లు పెరుగుతాయి. దీని వల్ల జీర్ణ ప్రక్రియ ఎంతో ప్రభావితమవుతుంది. అందుకే నిర్ణీత సమయానికి తినండి. నిజానికి మీ రక్తంలో చక్కెరను అదుపులో ఉంచడానికి మీరు ఏ సమయానికి తింటున్నారు తెలుసుకోండి. రోజూ ఒకేసమయానికి తినడానికి ప్రయత్నించండి. దీంతో రక్తంలో చక్కెర ఒకే విధంగా ఉంటుంది.
diabetes
రాత్రిపూ తేలిక పాటి భోజనం చేయండి. అలాగే మీ రాత్రి భోజనంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పదార్థాలను, కూరగాయలు ఉండేలా చూసుకోండి. అయితే రాత్రిపూట కార్భోహైడ్రేట్లను ఎక్కువగా తీసుకోకండి.
diabetes diet
సాయంత్రం 6 గంటల నుంచి 7.30 గంటల వరకు డిన్నర్ ను కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. దీనివల్ల ఆహారం జీర్ణం కావడానికి తగినంత సమయం దొరుకుతుంది. అలాగే శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి. సరైన సమయానికి రాత్రిపూట తినడం వల్ల హైపోగ్లైసీమియా లేదా హైపర్గ్లైసీమియా ప్రమాదం తగ్గుతుంది.
రాత్రి భోజనం చేసిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను రెగ్యులర్ చెక్ చేస్తూ ఉండండి. దీంతో మీరు ఏ పదార్థాలు తీసుకుంటున్నారో? అది మీ శరీరంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో తెలుసుకోవచ్చు.
రాత్రి లేట్ గా లేదా పడుకునే ముందు తినకండి. ఎందుకంటే ఇది మీ జీవక్రియను దెబ్బతీస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది.