MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Health
  • Stroke symptoms : పక్షవాతం వచ్చే ముందు కనిపించే లక్షణాలేంటో తెలుసా..?

Stroke symptoms : పక్షవాతం వచ్చే ముందు కనిపించే లక్షణాలేంటో తెలుసా..?

Stroke symptoms : చాలా సార్లు మన శరీరం వ్యాధులకు సంకేతాలను ఇస్తుంది. కానీ అవగాహన లేకపోవడం వల్ల మనం వాటిని పెద్దగా పట్టించుకోము. అలాగే పక్షవాతం  వచ్చే ముందు కూడా కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఆ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.ఇంతకీ ఆ లక్షణాలేంటీ?

1 Min read
Author : Rajesh K
Published : Jul 03 2025, 07:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ముఖ కదలికలో మార్పు
Image Credit : stockPhoto

ముఖ కదలికలో మార్పు

పక్షవాతం (స్ట్రోక్) అత్యంత సాధారణ లక్షణాలలో ముఖ కదలికలో మార్పు. స్ట్రోక్‌ సంభవించినప్పుడు ముఖం వేలాడి పోతుంది. స్ట్రోక్‌కు గురైన వ్యక్తి నవ్వలేకపోవచ్చు, కన్ను, నొరు వంగిపోతాయి. మాట్లాడటం, మాట అర్ధం చేసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. ఇది పక్షవాతం సంకేతం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
 ఆకస్మిక బలహీనత లేదా తిమ్మిరి
Image Credit : stockPhoto

ఆకస్మిక బలహీనత లేదా తిమ్మిరి

శరీరంలో ఒక వైపు, ముఖ్యంగా చేయి లేదా కాలులో అకస్మాత్తుగా బలహీనత లేదా తిమ్మిరిగా అనిపించడం కూడా స్ట్రోక్‌కు ముఖ్యమైన సంకేతం. ఉదాహరణకు చేయి బలహీనంగా మారడం లేదా కాలును ఎత్తినప్పుడు అదుపు కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు ఈ బలహీనత లేదా తిమ్మిరి క్రమంగా కాకుండా, అకస్మాత్తుగా వస్తుంది. 

తీవ్రమైన తలనొప్పి: హెమరేజిక్ స్ట్రోక్‌ వచ్చిన వారిలో  అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి వస్తుంది. మెదడులోని రక్తనాళం పగిలినప్పుడు హెమరేజిక్ స్ట్రోక్ వస్తుంది.  

33
గోల్డెన్ అవర్
Image Credit : stockPhoto

గోల్డెన్ అవర్

పైన పేర్కొన్న స్ట్రోక్ లక్షణాలేవైనా కనిపించిన వెంటనే వైద్య సహాయం పొందడం అత్యంత ముఖ్యం. ఎందుకంటే ప్రారంభ 3 గంటలలోపు చికిత్స అందితే మెదడు దెబ్బతినడం తగ్గి, కోలుకునే అవకాశం పెరుగుతుంది. స్ట్రోక్‌ లక్షణాలు మొదలైన తరువాత మొదటి 3 నుండి 4 గంటల వ్యవధిని "గోల్డెన్ అవర్" లేదా "గోల్డెన్ పీరియడ్" అని పిలుస్తారు. 

ఈ సమయంలో వైద్య చికిత్స అందితే: 

  • మస్తిష్కానికి తీవ్ర నష్టం జరగదు.  
  • వ్యాధి తీవ్రత తగ్గుతుంది,
  • రికవరీ త్వరగా జరుగుతుంది,
  • పేషెంట్ తిరిగి సాధారణ జీవితం సాగించే అవకాశాలు పెరుగుతాయి.  

ఏమి చేయాలి?

ముఖం వంగిపోవడం, చేయి లేదా కాలు బలహీనంగా మారడం, మాట్లాడలేకపోవడం,  ఆకస్మాత్తుగా తిమ్మిరి ఇవి కనిపించిన వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేయండి లేదా సమీప ఆసుపత్రికి తీసుకెళ్లండి.

  • కొన్ని సందర్భాల్లో లక్షణాలు కొద్దిసేపటి తరువాత మాయమవుతాయి. ఇది తాత్కాలిక ఇస్కీమిక్ దాడి (TIA) కావచ్చు. అయితే ఇది ఒక హెచ్చరిక సంకేతం. భవిష్యత్తులో తీవ్రమైన స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువ. అందువల్ల లక్షణాలు తగ్గినా  వైద్య పరీక్ష తప్పనిసరి.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఆరోగ్యం
మహిళలు
పురుషులు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Related Stories
Recommended image1
Heart Stroke: ఈ అలవాట్లు.. మీ గుండెకు ముప్పు తెస్తాయి తెలుసా..?
Recommended image2
Brain Stroke Symptoms: స్నానం ఇలా గనక చేస్తే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది.. జాగ్రత్త..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved