భోజనం మధ్యలో నీళ్లు తాగడం మంచిదేనా.. అలా తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
మనం ప్రతిరోజు భోజనం చేసే సమయంలో తరచు నీటిని తాగుతూ ఉంటాం అయితే ఇలా నీటిని తాగడం మంచిదేనా అని చాలామంది సందేహం వ్యక్తం చేస్తుంటారు. మధ్య మధ్యలో ఇలా నీటిని తాగడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

చాలామంది భోజనం చేసే సమయంలో ఎక్కువగా నీటిని తాగటం వల్ల మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుందని చెబుతారు. అదేవిధంగా మరికొందరు తీసుకున్నా ఆహారం నీటిని అధికంగా తాగడం వల్ల సరిగ్గా జీర్ణం కాక జీర్ణ క్రియ సమస్యలు తలెత్తుతాయని చెబుతారు. అయితే భోజనం చేసే సమయంలో నీటిని తీసుకోవడం ఎంతవరకు మంచిది ఎంతవరకు మంచిది కాదు అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం...
మన శరీరంలోని జీవక్రియలు అన్ని సరైన క్రమంలో పని చేయాలంటే శరీరానికి సరైన మోతాదులో నీటిని అందించడం అవసరం. ఎప్పుడైతే మన శరీరానికి సరైన మోతాదులో నీరు అందడం లేదో అప్పుడే మనకు దప్పిక అనే భావన కలుగుతుంది. తద్వారా నీటిని తీసుకోవాలని కోరిక మనలో కలుగుతుంది.ఇక శరీరానికి సరైన మోతాదులో నీటిని తాగటం వల్ల జీవక్రియలు కూడా సక్రమంగా జరిగి ఏ విధమైనటువంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.
ముఖ్యంగా మనం భోజనం చేసే సమయంలో తరచూ నీటిని తాగుతూ ఉండకూడదు ఇలా చేయటం వల్ల మనం తీసుకున్న ఆహారం సరైన క్రమంలో జీర్ణం కాదు. మనం ఆహారం తీసుకున్న తర్వాత మన శరీరంలో జీర్ణ క్రియ జరగడం కోసం కొన్ని రసాయనాలు విడుదలవుతాయి అయితే మనం నీటిని తీసుకోవడం వల్ల రసాయనాలఘాడత తగ్గి మన ఆహారాన్ని సరైన క్రమంలో జీర్ణం చేయదు.
ఇలా తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాకపోతే ఎన్నో జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి.అందుకే ఆహారం తీసుకునే సమయంలో మధ్యలో ఎక్కువగా నీటిని తాగకూడదు. ఒకవేళ తాగాలనిపిస్తే కొద్ది పరిమాణంలో మాత్రమే నీటిని తీసుకోవాలి. ఇక మనం తీసుకునే ఆహార పదార్థాలు ఎక్కువగా కారం ఉన్నట్లయితే నీటిని తాగాలి అనిపిస్తుంది. అందుకే మనం ఆహార పదార్థాలలో కాస్త ఉప్పు కారం తక్కువగా వేసుకోవడం మంచిది.
భోజనం చేసిన తర్వాత కూడా కొంత సమయం పాటు నీటిని తీసుకోకపోవడం మంచిది. అలాగని పూర్తిగా నీటిని తాగకుండా ఉండకూడదు. కొద్ది పరిమాణంలో నీటిని తీసుకుంటే మనం తీసుకున్న ఆహారం సరైన క్రమంలో జీర్ణం అవుతుంది.కేవలం మనం భోజనం చేసే సమయంలో మాత్రమే తక్కువ పరిమాణంలో నీటిని తీసుకోవాలి మిగతా సమయంలో అధికంగా నీటిని తీసుకోవడం వల్ల మన శరీరంలో అన్ని జీవక్రియలు సక్రమంగా జరగడమే కాకుండా మన శరీరంలో ఉన్న వ్యర్ధాలను చెమట రూపంలోనూ యూరిన్ రూపంలోనూ బయటకు వెళ్తాయి.