Banana: పండిపోయిందని అరటిపండును పడేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే అస్సలు ఆ పనిచేయరు?
Banana: ఇంట్లో ఉన్న అరటిపండ్లు బాగా పండాయా? నల్లటి మచ్చలు వచ్చాయని వాటిని పారేస్తున్నారా? ఆగండాగండి.. బాగా పండిన అరటిపండ్ల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే మీరు ఆ పని చేయరు. పండిన అరటిపండ్ల గురించి డాక్టర్లు ఏమంటున్నారంటే?

పండిన అరటిపండును పారేస్తున్నారా?
మనలో చాలామంది మార్కెట్‌లో లేదా ఇంట్లో పైన డార్క్ బ్రౌన్ మచ్చలు (Dark Brown Spots) ఉన్న అరటిపండ్లను చూడగానే అవి పండిపోయాయని, పండితే పాడైపోయాయని భావించి పడేస్తుంటారు. పైన ఎలాంటి మచ్చలు లేకుండా శుభ్రంగా ఉండే పండ్లనే తినడానికి ఇష్టపడతారు. కానీ, బయట చూడటానికి కాస్త నల్లగా, బ్రౌన్ మచ్చలతో, కాస్త పండినట్టు కనిపించే ఆ అరటిపండే నిజానికి మన ఆరోగ్యానికి 'సూపర్ ఫుడ్' అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఈ విషయం తెలిస్తే అస్సలు వదలరు!
బాగా పండిన, బ్రౌన్ మచ్చలున్న అరటిపండులో TNF (Tumor Necrosis Factor) లాంటి ఆక్టివ్ కాంపౌండ్స్ లభిస్తాయి. ఇవి మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను (Immune System) విపరీతంగా బూస్ట్ చేయడానికి ఎంతగానో తోడ్పడతాయి. అరటిపండు ఎంతగా పండితే, దానిలోని యాంటీఆక్సిడెంట్ శక్తి (Antioxidant Power) అంతగా పెరుగుతుంది. ఇవి శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, కణాలను రక్షిస్తాయి.
ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది
అరటిపండు బాగా పండే క్రమంలో అందులో ఉండే సంక్లిష్టమైన 'స్టార్చ్' కాస్త సులభంగా జీర్ణమయ్యే 'సహజమైన చక్కెర'గా (Natural Sugar) మారుతుంది. పండిన అరటిపండులోని పోషక విలువలను (Nutrients) మన శరీరం చాలా సులభంగా గ్రహిస్తుంది (Easy Absorption). జీర్ణ వ్యవస్థపై భారం పడకుండా, శరీరానికి తక్షణ శక్తిని (Better Energy) , ఆరోగ్య రక్షణను ఇది అందిస్తుంది.
పండిన అరటిని పారేయకుండా ఎలా ఉపయోగించాలి?
పైన మచ్చలు వచ్చి బాగా మెత్తబడినంత మాత్రాన అరటిపండు పాడైపోయినట్లు కాదు. వీటిని నేరుగా తినడానికి ఇష్టపడకపోతే..మిల్క్ షేక్‌లు లేదా స్మూతీలలో సహజమైన తీపి కోసం వాడవచ్చు. హెల్తీ బనానా పాన్‌కేక్స్, కేక్‌లు లేదా ఓట్స్ ఐటమ్స్ తయారీలో తీపి పదార్థాలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. కాబట్టి, తదుపరిసారి డార్క్ బ్రౌన్ మచ్చలున్న అరటిపండు కనిపిస్తే అనవసరంగా చెత్తబుట్టలో పారేయకండి! అది మీ శరీరానికి ఒక హెల్త్ అప్‌గ్రేడ్ అని గుర్తించండి.

