Liver Health: లివర్ హెల్త్ కు కాఫీ మంచిదేనా? వైద్యులు ఏమంటున్నారు?
Liver Health: ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఆరోగ్య విషయాలపై అవగాహన కల్పిస్తారు. తాజాగా గట్ (జీర్ణవ్యవస్థ), కాలేయ ఆరోగ్యానికి సంబంధించిన పలు చిట్కాలను తన ఫాలోవర్స్ తో పంచుకున్నారు. ఆయన ఏమన్నారంటే.

వైద్యుల సలహా
ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఆరోగ్య విషయాలపై అవగాహన కల్పిస్తారు. తాజాగా గట్ (జీర్ణవ్యవస్థ), కాలేయ ఆరోగ్యానికి సంబంధింన చిట్కాలను పంచుకున్నారు. కాలేయ ఆరోగ్యానికి చిన్న చిన్న అడుగులు కూడా చాలా సహాయపడతాయని డాక్టర్ సేథీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. కాలేయ పనితీరును మెరుగుపరచడానికి పాటించాల్సిన అంశాలను వివరించారు. ఈ క్రమంలో తాను ప్రతిరోజూ 3 పానీయాలను సేవిస్తానని వెల్లడించారు. ఆ డ్రింక్స్ ఏమిటో తెలుసుకుందాం..
గ్రీన్ టీ
హార్వర్డ్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథీ ప్రతిరోజూ 3 పానీయాలు తాగుతారు. అందులో ఉదయాన్నే ఒక కప్పు గ్రీన్ టీ తాగి ఆ రోజును ప్రారంభిస్తారట. యాంటీఆక్సిడెంట్స్ ఉంటే గ్రీన్ టీ చాలా ప్రయోజనాలున్నాయని తెలిపారు.
ప్రయోజనాలు:
లివర్ డిటాక్స్: గ్రీన్ టీ లివర్‌ను ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడుతుంది, డిటాక్స్ చేయడంలో సహాయపడుతుంది.
జీర్ణక్రియ మెరుగు: ఇది కడుపులో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
మెటబాలిజం పెరుగుదల: ఇది శరీరంలో మెటబాలిజంను వేగవంతం చేస్తుంది, బరువు నియంత్రణలో ఉంటుంది.
కాఫీ
కాఫీ తాగడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుందని, రోజూ 2 కప్పుల కాఫీ తాగడం వల్ల కాలేయ వ్యాధులు తగ్గుతాయి. ముఖ్యంగా లివర్ సిర్రోసిస్, లివర్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చంట. అందుకే తన దినచర్యలో కాఫీని చేర్చుకుంటున్నట్లు చెబుతున్నారు.
ప్రయోజనాలు:
లివర్ వ్యాధి ప్రమాదం తగ్గుతుంది: అనేక అధ్యయనాలు కాఫీ లివర్ క్యాన్సర్, సిర్రోసిస్ (తీవ్రమైన లివర్ వ్యాధి) వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని చూపించాయి.
నొప్పి తగ్గుతుంది: కాఫీలోని ఎంజైమ్‌లు శరీరంలోని నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి, ఇది లివర్ ఆరోగ్యానికి ముఖ్యం.
యాంటీఆక్సిడెంట్స పుష్కలం: గ్రీన్ టీ లాగానే కాఫీ కూడా యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.
స్మూతీలు
రోజుకు ఒక్కసారైన పండ్లు, కూరగాయలతో తయారుచేసిన స్మూతీలను తీసుకోవాలని, అందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయని తెలిపారు.
ప్రయోజనాలు:
ఫైబర్ : పండ్లు, కూరగాయలతో చేసిన స్మూతీలను తీసుకోవడం వల్ల ఫైబర్ పుష్కలంగా దొరుకుతుంది. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది.
విటమిన్లు, ఖనిజాలు: ఇవి శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి.
డిటాక్సిఫికేషన్: బీట్ రూట్, పాలకూర, ఆపిల్, క్యారెట్ వంటి కూరగాయలు, పండ్లు లివర్‌ను డిటాక్స్ చేయడానికి, దాని పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి.
వీడియో చూడండి
వైద్యులు తమ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుంటారో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.