కిస్ మిస్ లు ఆరోగ్యానికి మంచివే.. కానీ అతిగా తింటే మీ పని అంతే..!
ఎండుద్రాక్ష ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న డ్రై ఫ్రూట్. వీటిని నానబెట్టుకుని తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. అలాగని వీటిని మోతాదుకు మించి తింటే మాత్రం ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
![article_image1](https://static-gi.asianetnews.com/images/01dtba5h8wyg155t2xzdnt6vje/58-jpg_380x217xt.jpg)
ఎండుద్రాక్షలను తింటే కడుపు తొందరగా నిండుతుంది. అలాగే కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. రక్తహీనతను పోగొడుతుంది. ఒంట్లో రక్తాన్ని పెంచుతుంది. జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు ఎసిడిటీ, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. కిస్ మిస్ లను మోతాదులో తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతాం. కానీ వీటిని అతిగా తింటే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్లు వీటిని అతిగా అస్సలు తినకూడదు. ఎందుకంటే వీటిలో సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల బ్లడ్ షుగర్ పెరుగుతుంది. అంతేకాదు వీటిలో కేలరీలు కూడా ఉంటాయి. అసలు వీటిని అతిగా తింటే ఎలాంటి సమస్యలొస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
బరువు పెరగడం..
కిస్ మిస్ లల్లో సహజ చక్కెరలు, కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఒకవేళ మీరు వీటిని అతిగా తిన్నట్టైతే బరువు పెరిగే అవకాశం ఉంది. అందుకే వెయిట్ లాస్ అయ్యేవారు వీటిని అతిగా అసలే తినకూడదు.
దంతక్షయం
ఎండుద్రాక్షలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్ పాటుగా సహజ చక్కెరలు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల దంత క్షయం , నోటి కుహరం వంటి సమస్యలు వస్తాయి.
జీర్ణ సమస్యలు
కిస్ మిస్ లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని మితంగా తింటే మన జీర్ణక్రియకు సహాయపడుతాయి. ఒకవేళ మీరు వీటిని ఎక్కువగా తింటే అంటే ఫైబర్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, విరేచనాలతో పాటుగా ఎన్నో జీర్ణ సమస్యలు వస్తాయి.
బ్లడ్ షుగర్ పెరగడం
ఎండుద్రాక్షల్లో ఎక్కువగా ఉండే సహజ చక్కెర మధుమేహులకు మంచిది కాదు. వీళ్లు ఒకేసారి ఎక్కువ కిస్ మిస్ లను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరుగుతాయి. డయాబెటిస్ ఉన్నవారు లేదా ఈ సమస్యవ వచ్చే ప్రమాదం ఉన్నవారు వీటిని మోతాదులోనే తినాలి.
ఖనిజ అసమతుల్యత
కిస్ మిస్ లల్లో ఇనుము, పొటాషియం వంటి కొన్ని ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ ఖనిజాలు మన ఆరోగ్యానికి చాలా చాలా అవసరం. అయితే వీటిని ఎక్కువగా తీసుకుంటే మాత్రం శరీరంలో ఖనిజ స్థాయిలలో అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది హైపర్కలేమియా లేదా ఇనుము ఓవర్లోడ్ వంటి ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.