MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Palash Flower Benefits: మోదుగ పూలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

Palash Flower Benefits: మోదుగ పూలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

మోదుగ పూలు వసంత కాలం రాకను సూచిస్తాయి. వీటిని అగ్ని పూలు అని కూడా అంటారు. మోదుగ పువ్వుల గురించి పల్లెటూర్లలో ఎక్కువగా తెలిసి ఉంటుంది. ఇవి ప్రకృతి అందాన్ని పెంచడమే కాదు.. ఔషధంగా కూడా పని చేస్తాయి. చర్మ సమస్యల నుంచి జీర్ణ సమస్యల వరకు మోదుగ పువ్వు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

1 Min read
Author : Kavitha G
Published : Mar 31 2025, 03:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మోదుగ పూలు ఒక రకమైన సువాస కలిగి ఉంటాయి. ఎరుపు రంగులో కనిపించే ఈ పూలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. అంతేకాదు మోదుగ పువ్వులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి అనేక వ్యాధులకు మందుగా పనిచేస్తాయి. మోదుగ నూనె, ఆకులు, విత్తనాలను ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. మోదుగ విత్తనాల్ని పొడి చేసి దానిలో కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు దూరం అవుతాయట. మోదుగ పూల ఔషధ గుణాల గురించి మరిన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నిద్ర సమస్యకు మోదుగ పువ్వు..

నిద్ర సమస్యకు మోదుగ పువ్వు..

వసంతకాలంలో వచ్చే ఈ పువ్వు నిద్ర సమస్యలను దూరం చేస్తుందట. మోదుగ ఆకుల రసం తాగితే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

చర్మ వ్యాధులకు...

వేసవిలో చాలా మందికి చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. మోదుగ పువ్వుల గింజల పొడిని వాడితే దురద తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

35
మూత్ర సంబంధిత వ్యాధులకు

మూత్ర సంబంధిత వ్యాధులకు

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడేవారికి మోదుగ పువ్వుల మొగ్గలు చాలా మంచిదట. దీని పొడిని వాడితే చాలా వ్యాధులు నయమవుతాయట.

క్రిముల నుంచి రక్షణగా..

మోదుగ చెట్టు బెరడు డయేరియాను నివారిస్తుందట. దీని గింజలు క్రిమిసంహారకంగా పనిచేస్తాయట. ఇవి ఆకలిని కూడా పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు.

45
రోగనిరోధక శక్తిని పెంచుతుంది

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

మోదుగ పువ్వులో విటమిన్ సి, కెరోటినాయిడ్లు, ఫ్లేవనాయిడ్ల లాంటి పోషకాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి

రక్త శుద్ధికి మోదుగ..

రక్తాన్ని శుద్ధి చేయడానికి మోదుగ చెట్టు బెరడు బాగా ఉపయోగపడుతుంది. రక్తం శుద్ధి అయితే చర్మ సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

55
జీర్ణ సమస్యలకు పరిష్కారంగా..

జీర్ణ సమస్యలకు పరిష్కారంగా..

జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి మోదుగ పూలు చాలా మంచిది. ఇది అజీర్ణం, మలబద్ధకం లాంటి సమస్యలను దూరం చేస్తాయి.

మెరుగైన కంటి చూపు..

మోదుగ పూలు చూడటానికి అందంగా ఉండటమే కాదు.. కంటి చూపును మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
చిట్కాలు మరియు ఉపాయాలు
జీవనశైలి
Latest Videos
Recommended Stories
Recommended image1
Barley Water: ఉదయాన్నే బార్లీ తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
Recommended image2
అంగస్తంభన సమస్య గుండె జబ్బుకు సంకేతమా? పురుషులు నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌ని హెచ్చ‌రిక‌లివే
Recommended image3
Egg Storage: గుడ్లు ఫ్రిడ్జ్ లో పెట్టినా పాడవుతున్నాయా? ఎన్ని రోజులు ఉంటే సేఫ్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved