MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Pregnancy: ప్రెగ్నెన్సీ ఆలస్యం కావడానికి కారణాలు ఇవే! జాగ్రత్త పడకపోతే..

Pregnancy: ప్రెగ్నెన్సీ ఆలస్యం కావడానికి కారణాలు ఇవే! జాగ్రత్త పడకపోతే..

Pregnancy: గర్భధారణ ( Pregnancy)అనేది ప్రతి మహిళ జీవితం లో మధురమైన ఘట్టం. జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి కారణంగా మహిళల్లో గర్భసమస్యలు పెరుగుతున్నాయి. పిల్లలు పుట్టకపోవడానికి ప్రధాన కారణాలేంటో తెలుసుకుందాం.

2 Min read
Author : Rajesh K
Published : Jul 14 2025, 07:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రెగ్నెన్సీ ఆలస్యం
Image Credit : Pinterest

ప్రెగ్నెన్సీ ఆలస్యం

ప్రతి మహిళ జీవితంలో మాతృత్వం అనేది ఓ అనన్యమైన అనుభూతి. కానీ ఈ ఆనందం అందరికీ లభించదు. కొన్ని కారణాల వల్ల స్త్రీలు గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. గర్భధారణను ప్రభావితం చేసే ప్రధాన కారణాలలో అధిక బరువు ఒకటి. అధిక బరువు ఉన్న స్త్రీలు గర్భం దాల్చడం కష్టం. అదేవిధంగా పురుషులలో ఊబకాయం కూడా సంతానోత్పత్తి సమస్య కారణం. కాబట్టి బరువు తగ్గడం మొదటి పరిష్కారం.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
థైరాయిడ్ అసమతుల్యత, రుతు చక్రం
Image Credit : Pinterest

థైరాయిడ్ అసమతుల్యత, రుతు చక్రం

థైరాయిడ్ హార్మోన్లు (T3, T4) లైంగిక సామర్థాన్ని ప్రభావితం చేస్తాయి. వీటి అసమతుల్యత వల్ల గర్భధారణ సమస్యలు, గర్భస్రావాలు వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. 

క్రమరహిత నెలసరి (రుతు చక్రం) కూడా ప్రెగ్నెన్సీ ఆలస్యానికి కారణం. సాధారణంగా ఋతు చక్రం 28 రోజులకు ఒకసారి 3 -5 రోజులు రక్తస్రావం జరుగుతుంది. అధిక రక్తస్రావం లేదా క్రమరహిత ఋతు చక్రం వంటి సమస్యలు ఉంటే తక్షణం వైద్య సలహా అవసరం.

Related Articles

Related image1
Pregnancy Care: ప్రెగ్నెన్సీ టైంలో డ్రై ఫ్రూట్స్ ఎలా తింటే మంచిదో తెలుసా?
Related image2
Pregnancy: వర్షాకాలంలో గర్భిణులు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ చిట్కాలను పాటించాల్సిందే..
35
పీసీఓడీ, వీర్య సమస్యలు
Image Credit : Pinterest

పీసీఓడీ, వీర్య సమస్యలు

PCOS (పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) వల్ల అండం ఉత్పత్తిలో జాప్యం,  క్రమరహిత ఋతు చక్రం వల్ల గర్భధారణలో సమస్యలు ఏర్పడతాయి. అయితే, ఇది సరైన చికిత్సతో నియంత్రించవచ్చు. 

అలాగే, గర్భం దాల్చడంలో ఇబ్బంది ఉంటే పురుషులకు వీర్య పరీక్ష అవసరం. తక్కువ వీర్యకణాల సంఖ్య లేదా వీర్యకణాల పనితీరు లోపం వంధ్యత్వానికి దారితీస్తాయి. పరీక్షల ద్వారా సమస్యలు గుర్తించి చికిత్స చేస్తే గర్భధారణ అవకాశాలు మెరుగవుతాయి.

45
ఈ సూచనలు పాటించండి
Image Credit : Pinterest

ఈ సూచనలు పాటించండి

25 నుంచి 35 ఏళ్ల మధ్యలో  ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వారు ముందుగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వికల్ క్యాన్సర్) పరీక్ష చేయించుకోవడం అత్యంత అవసరం. ఇది భవిష్యత్ ఆరోగ్య సమస్యలను నిరోధించడంలో సహాయపడుతుంది. 

ప్రెగ్నెన్సీ కోసం తేలికపాటి నుంచి మోస్తరు వ్యాయామం తప్పనిసరి వ్యాయామం చేయడం వల్ల రుతు చక్ర నియంత్రణ, రక్త ప్రసరణ, ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది. దీని వల్ల గర్భధారణ సులభం అవుతుంది.

55
గమనిక
Image Credit : Pinterest

గమనిక

పైన పేర్కొన్న సమాచారం అంతా ఇంటర్నెట్‌లో లభించే సాధారణ సమాచారం మాత్రమే. ప్రతి ఒక్కరి ఆరోగ్యం, గర్భం దాల్చడానికి గల కారణాలు వేర్వేరుగా ఉండవచ్చు. కాబట్టి మీకు గర్భం ఆలస్యం అవుతుంటే సరైన వైద్యుడిని సంప్రదించి సలహా, చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఆరోగ్యం
మహిళలు
పురుషులు

Latest Videos
Recommended Stories
Recommended image1
Mangoes: అతిగా మామిడి పండ్లు తింటే లావవుతారా?
Recommended image2
Mangoes: మామిడి పండ్లు తింటే ఒంట్లో వేడి చేస్తుందా? ఎక్కువ తింటే ఏమవుతుంది?
Recommended image3
Sugar: శరీరంలో చక్కెర మోతాదు పెరిగితే పేగుల్లో జరిగేది ఇదే!
Related Stories
Recommended image1
Pregnancy Care: ప్రెగ్నెన్సీ టైంలో డ్రై ఫ్రూట్స్ ఎలా తింటే మంచిదో తెలుసా?
Recommended image2
Pregnancy: వర్షాకాలంలో గర్భిణులు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ చిట్కాలను పాటించాల్సిందే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved