MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Health
  • Tulasi Leaves: 10 రోజులపాటు 4 తులసి ఆకులు నమిలి తింటే కలిగే 5 అద్భుతమైన లాభాలు ఇవే!

Tulasi Leaves: 10 రోజులపాటు 4 తులసి ఆకులు నమిలి తింటే కలిగే 5 అద్భుతమైన లాభాలు ఇవే!

మన సంస్కృతిలో తులసి మొక్కకు చాలా ప్రాధాన్యం ఉంది. దాదాపు ప్రతి ఇంట్లో తులసి మొక్క కనిపిస్తుంది. ఈ మొక్క దాని ఔషధ గుణాలకు ప్రసిద్ధి. నిపుణుల ప్రకారం 10 రోజులు క్రమం తప్పకుండా 4 తులసి ఆకులు నమిలి తింటే శరీరంలో ఎలాంటి మార్పులుంటాయో ఇక్కడ తెలుసుకుందాం. 

2 Min read
Author : Kavitha G
Published : Feb 12 2026, 02:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Tulasi Leaves Benefits
Image Credit : Getty

Tulasi Leaves Benefits

తులసి ఆకులు ఆరోగ్యానికి ఎంతమేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీటిని శతాబ్ధాలుగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు.  ఆరోగ్య నిపుణుల ప్రకారం ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో 4–5 తులసి ఆకులు నమలడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా 10 రోజులు వరుసగా తులసి ఆకులు నమిలితే శరీరంలో స్పష్టమైన మార్పులు గమనించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
రోగనిరోధక శక్తి పెరగడం
Image Credit : Getty

రోగనిరోధక శక్తి పెరగడం

తులసిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ C, ఫైటో న్యూట్రియెంట్లు శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించి రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలను ఎదుర్కోవడంలో తులసి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 10 రోజులపాటు తులసి ఆకులు తీసుకుంటే శరీరం వైరస్, బ్యాక్టీరియాలపై మరింత ప్రభావంతంగా పనిచేస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా వాతావరణ మార్పుల సమయంలో ఇది రక్షణ కవచంలా పనిచేస్తుందని సూచిస్తున్నారు.

37
శ్వాస సమస్యలు
Image Credit : Gemini AI

శ్వాస సమస్యలు

శ్వాసకోశ ఆరోగ్యానికి తులసి ఎంతో మేలు చేస్తుంది. ఆయుర్వేద నిపుణుల ప్రకారం తులసి ఆకుల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శ్వాసనాళాలలో ఉన్న వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ఆస్తమా, బ్రాంకైటిస్, సైనసైటిస్ వంటి సమస్యలతో బాధపడుతున్నవారికి తులసి చక్కగా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 10 రోజుల పాటు తులసి ఆకులు నమిలితే కఫం తగ్గడం, గొంతు శుభ్రంగా ఉండటం, శ్వాస సులభంగా తీసుకోవడం వంటి మార్పులు గమనించవచ్చని చెబుతున్నారు.

47
జీర్ణక్రియ మెరుగుపడటం
Image Credit : Getty

జీర్ణక్రియ మెరుగుపడటం

తులసి ఆకులు జీర్ణక్రియను ప్రోత్సహించే గుణాలు కలిగి ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గేందుకు తులసి సహాయపడుతుంది. అంతేకాదు శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపడంలో తులసి సహకరిస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. 10 రోజులు వరుసగా తులసి ఆకులు తీసుకోవడం వల్ల కడుపు తేలికగా ఉండటం, ఆకలి మెరుగుపడటం, జీర్ణ సమస్యలు తగ్గడం వంటి ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తాయని వివరిస్తున్నారు.

57
ఒత్తిడి తగ్గడం
Image Credit : Getty

ఒత్తిడి తగ్గడం

ఆరోగ్య నిపుణుల ప్రకారం తులసి ఆకులు నాడీ వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపి ఆందోళన, టెన్షన్ తగ్గించడంలో సహాయపడతాయి. 10 రోజుల పాటు తులసి ఆకులు నమిలితే మనసు ప్రశాంతంగా ఉండటం, నిద్ర మెరుగుపడటం, ఉత్సాహంగా ఉండటం వంటి ప్రయోజనాలు చూడవచ్చు. ముఖ్యంగా ఎక్కువ ఒత్తిడితో జీవించే వారికి ఇది సహజ ఉపశమనంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

67
రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ
Image Credit : Getty

రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ

కొన్ని అధ్యయనాల ప్రకారం తులసి ఆకులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. తులసిలోని యాంటీఆక్సిడెంట్లు గుండెకు హాని చేసే ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. 10 రోజులు తులసి ఆకులు నమిలితే శరీరంలో శక్తి స్థాయిలు సమతుల్యం కావడం, అలసట తగ్గడం వంటి మార్పులు గమనించవచ్చు. అయితే షుగర్ లేదా గుండె సంబంధిత సమస్యలున్నవారు, మందులు వాడేవారు తులసి ఆకులను తినేముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

77
మోతాదు ముఖ్యం..
Image Credit : stockPhoto

మోతాదు ముఖ్యం..

తులసి ఆకులు తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది కాదు. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు లేదా ప్రత్యేక ఆరోగ్య సమస్యలున్నవారు వైద్యుల సూచన మేరకు మాత్రమే తీసుకోవాలి. సాధారణంగా రోజుకు 4–5 తాజా తులసి ఆకులు సరిపోతాయి. శుభ్రంగా కడిగి నమలడం ఉత్తమం.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Recommended image2
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image3
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Related Stories
Recommended image1
Cumin Water: 11 రోజులపాటు ఖాళీ కడుపుతో జీలకర్ర నీరు తాగితే కలిగే 5 లాభాలు ఇవే!
Recommended image2
Pumpkin Seeds: 11 రోజులు క్రమం తప్పకుండా గుమ్మడి గింజలు తింటే శరీరంలో జరిగే 5 మార్పులు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved